గుండెనిండా గుడిగంటలు జూన్ 13 ఎపిసోడ్

రోహిణి పార్లర్ కి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన మనోజ్..అక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ పేరు కాకుండా క్వీన్ అని రాసి ఉండడం చూసి షాక్ అవుతాడు. అదే విషయం రోహిణిని అడుగుతాడు. బిజినెస్ పెంచడంలో భాగంగా ఈ గ్రూప్ తో భాగస్వామిగా మారాను అని అబద్ధం చెబుతుంది. మనోజ్ అదే నిజం అనుకుని కంగ్రాట్స్ చెప్పేసి వెళ్లిపోతాడు. హమ్మయ్య అనుకుంటుంది రోహిణి. ఎంటి రిలాక్స్ అయిపోతున్నావ్ ఇంటికెళ్లి మనోజ్ మీ అత్తకు నిజం చెప్తే ఏమవుతుందో ఆలోచించు అంటుంది. అమ్మో నిజమే అనుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది రోహిణి

బాలుకు తెలియకుండా కారు కొనాలని ప్లాన్ చేసుకున్న మీనా.. కన్సల్టెన్సీకి వెళ్లి డబ్బులిస్తారు. కార్ ముందుగా బుక్ చేస్తారు. బాలుని తీసుకొచ్చి కారు చూపించమని రాజేష్ ను అడుగుతుంది. వాడికి సర్ ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కదా అని రాజేష్ అంటే.. మీ ఫ్రెండ్ కోసం అని చెప్పండి, కారు కండిషన్ నీకు బాగా తెలుస్తుంది కదా అని చెప్తుంది. సంతోషిస్తాడు రాజేష్. 

ప్రభావతి కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటుంది. డబ్బులు ఎందుకు అప్పు తీసుకుందో చెప్పదా అది..దాని సంగతి చెప్తాను ఇప్పుడే అని హడావుడి చేస్తుంది. ఇంతలో బాలు రావడంతో నీతో మాట్లాడాలి అంటుంది. నాతోనేనా మాట్లావతి అంటుంది. సత్యం, బాలుని ఆపుతుంది..ఇంతలో మీనా వస్తుంది. ఇంటిని, పూలకొట్టును వదిలేసి పుట్టింటికి వెళ్లి వచ్చిందని ఫైర్ అవుతుంది. నేను నా పుట్టింటికి వెళ్లానని మీకు చెప్పానా అంటుంది? మీనా వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లిందంటే నీకేంటి బాధ అంటాడు బాలు. అదేమైనా ఇంద్రభవనమా అంటుంది ప్రభావతి. మా అమ్మ కూర్చుని తినేరకం కాదంటుంది మీనా. నన్నే అంటున్నావా అని ఫైర్ అవుతుంది ప్రభావతి. మీనా కష్టపడిసంపాదించుకున్న డబ్బు తను వాళ్ల పుట్టింట్లో ఇస్తే తప్పేముందు అంటుంది శ్రుతి..నాది కూడా అదే మాట అంటాడు రవి. అంతవరకూ సరే కానీ..అప్పు కూడా చేసిందని చెబుతుంది. నాకు అత్యవసరం వచ్చింది అందుకే అప్పు చేశాను అంటుందిమీనా.

రోహిణి వదినను ఎప్పుడూ అడగలేదు కదా అని రవి అంటాడు..అవును నన్ను కూడా ఎప్పుడూ అడగలేదు కదా మరి మీనాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీస్తుంది శ్రుతి. వాళ్లకంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి దీనికేం ఉంటాయ్ అంటుంది ప్రభావతి. ఏ అవసరమో నాకు చెప్పాలి అని నిలదీస్తుంది ప్రభావతి. చెప్పదు అని సత్యం, చెప్పాల్సిన అవసరం లేదని బాలు, అంతే అని శ్రుతి రవి కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ఈ ఇంట్లో అత్తగారికి విలువలేదా? నువ్వు కారు అమ్మేసినప్పుడు కూడా ఇది అదే అంది అంటుంది. ఇద్దరూ ఒకేమాటపై ఉన్నారు మంచిదే కదా అని శ్రుతి అంటుంది. మీనా ఒంటిపై బంగారం తీసేసుకున్నారు మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఇప్పుడు బంగారం కొనుక్కుంటుందేమో అంటుంది శ్రుతి. కారణం అది కాదు అంటుంది ప్రభావతి. 

దొంగను నిలదీసినట్టు ఎందుకు నిలదీస్తున్నారు? అందులోంచి ఒక్క రూపాయి కూడా నేను నాకోసం వాడుకోలేదు నా పుట్టింట్లో ఇవ్వలేదు. నానుంచి మా అమ్మ రూపాయి కూడా ఆశించదు, డబ్బు నేను వృధాచేయను, నమ్మితే నమ్మండి లేదంటే మీ ఇష్టం..ఆ డబ్బు ఏం చేశానో మీకు తెలియాల్సినప్పుడే తెలుస్తుంది అంటుంది మీనా. మీరేమైనా అడగాలా అని బాలుతో అంటే..నీ ఇష్టం అంటాడు బాలు. నా భర్తకి లేని అనుమానం మీకెందుకు అత్తయ్యా అనేసి వెళ్లిపోతుంది.

నీ డబ్బు వాడుకుని నీకు అబద్ధాలు చెప్పేవారిని ఏమీ అనవు కానీ...నా పెళ్లాం కష్టం అది ఖర్చు పెట్టుకుంటే ఎందుకు నిలదీస్తావ్ అంటాడు బాలు. మీరు సైలెంట్ గా ఉండలేరా అంటుంది శ్రుతి, నాన్నా అమ్మకు అరగడానికి సిరఫ్ తెచ్చి పెట్టు అంటాడు రవి. నీపై కూడా అరుస్తారు పద రవి అని తీసుకెళ్లిపోతుంది. మీనా దుబారామనిషి కాదు అనేసి సత్యం అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

పూజ దగ్గర కూర్చుని ఉంటుంది మౌనిక. నాన్ వెజ్ లేదని గొడవచేస్తాడు సంజయ్. బయటకు వెళ్లి తినమంటుంది తల్లి. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉండి నన్ను బయటకు వెళ్లి తినమంటున్నారని ఫైర్ అయి వెళ్లిపోతాడు

ఇంటికి హడావుడిగా వచ్చిన మనోజ్..మీకో గుడ్ న్యూస్ అంటాడు. అందర్నీ పిలుస్తాడు..బాలు సెటైర్స్ వేస్తుంటాడు. నువ్వు చెప్పురా అంటుంది ప్రభావతి. రోహిణి ఏం చేసిందో తెలుసా అని మనోజ్ అంటే నువ్వు నాన్న డబ్బు కొట్టేసినట్టు పార్లలమ్మ నీ డబ్బు కొట్టేసిందా అని అడుగుతాడు. రోహిణి మన పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చింది , క్వీన్ బ్యూటీ పార్లర్ తో మన పార్లర్ కలిపేసింది. ఆ పార్లర్ కి అమ్మపేరు తీసేశారు ఇప్పుడు అంటాడు. అంతే షాక్ అవుతుంది ప్రభావతి. ఇంతలో రోహిణి ఎంట్రీ ఇస్తుంది. నేనే మీతో చెప్పాలి అనుకున్నా మనోజ్ చెప్పేశాడు అంటుంది రోహిణి. ప్రభావతి ఏమీ అనదు..పైగా ఇది మంచి విషయమే కదా అని సపోర్ట్ చేస్తుంది.

గుండెనిండా గుడిగంటలు జూన్ 14 ఎపిసోడ్ లో రోహిణిని రూమ్ కి తీసుకెళ్లి నిలదీస్తుంది ప్రభావతి. నీ పార్లర్ లో జుట్టు కట్ చేసి పాడేసినంత ఈజీగా నా పేరు తీసి పడేస్తే తగ్గుతానా అంటుంది. ఇదికాకుండా ఇంకా ఏమైనా దాచావా ఇప్పుడే చెప్పు అని నిలదీస్తుంది ప్రభావతి