గుండెనిండా గుడిగంటలు జూన్ 04 ఎపిసోడ్

బాలు మీనా ఇద్దరూ పూలు కొనుక్కుని తీసుకెళ్తుంటారు. మధ్యలో సుమతిని పిక్ చేసుకుందాం అంటుంది మీనా. ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు కదా మీ పని చెప్తా అనుకుంటుంది సుమతి. మీనాను కిందకు దింపేసి ముందు సీట్లో బాలు పక్కన కూర్చోబెడుతుంది. సుమతి వెనుక కూర్చుంటుంది. బాలు-మీనా ఇద్దర్నీ చూసి మురిసిపోతుంది సుమతి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంంటుంది. మీద మీద పడతావేంటి సరిగా కూర్చో అని విసుక్కుంటాడు. ఆటోనా హార్టా అని సెటైర్స్ వేస్తుంది సుమతి. ఇక మాటల్లో కోపం తగ్గిపోతుంది బాలుకి. ఇంటికి చేరుకుంటారు. 

ప్రభావతికి పెద్ద క్లాస్

భారీ ఎత్తున పూలమాలలు ఆర్డర్ రావడంతో పూలు కట్టేందుకు కొందర్ని పిలుస్తుంది మీనా. ఈ సంతంతా ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. బావున్నారా అడిగితే నాకేమైనా అయిందని ఎవరైనా చెప్పారా అంటుంది. మీరంతా ఎవరు అంటే పూలకొట్టు ఓపెన్ చేసినప్పుడు వచ్చాం అంటారు. మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చింది పూలు కట్టేందుకు వచ్చాం అంటారు. అదే పనిమనిషి దానికింద మీరు పనిచేసేందుకు వచ్చారా అని సెటైర్స్ వేస్తుంది. బస్తీ వాళ్లంతా కలసి ప్రభావతిని ఆడేసుకుంటారు. మీనా అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్తూ ప్రభావతిని టార్గెట్ చేస్తారు. మీనా ఇంట్లో పని చేస్తూ కొట్టు పెట్టుకుని సంపాదించుకుంటోంది కష్టపడుతోంది మీరు ఇంట్లో తిని కూర్చుని ఉండలేకపోతున్నారా అని మండిపడతారు. ఇంకోసారి మీనా గురించి మాట్లాడితే ఊరుకోను అంటారు. 

రోహిణికి మనోజ్ థ్యాంక్స్

మనోజ్ రోడ్డుపై వెళుతుంటే ...అప్పు తీర్చమని వెంటపడిన వ్యక్తి కనిపించి నీ భార్య నీ అప్పులు తీర్చేసిందని చెప్తాడు. అంత మంచి భార్య దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి అంటాడు. ఇంటికివెళ్లిన మనోజ్ రోహిణితో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. నాపై కోపం లేదా అని మనోజ్ అడిగితే..నేను నిన్ను మోసం చేశాను అందుకు నేనేం కావాలి అనుకుంటుంది. నేను కూడా నీతో కొన్ని విషయాలు చెప్పలేదు ..ఇకపై సీక్రెట్స్ ఉండకూడదు...ఈ జన్మలో నేను నిన్ను మోసం చేయను, ఏ అబద్ధం చెప్పను అంటుంది. డబ్బులకు సంబంధించిన సమస్యలు నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటుంది. థ్యాంక్స్ చెబుతాడు మనోజ్

మౌనికకు మరో వార్నింగ్ ఇచ్చిన సంజూ

అప్పుడే పూజ చేసుకుని వచ్చిన మౌనికతో... నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చి దేవుడి దగ్గరకు వెళతావు అనుకుంటే గుడిలో దేవుడి దగ్గరకు వెళ్లి వచ్చావ్ అంటాడు సంజయ్. కాఫీ కావాలా అని అడుగుతుంది. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కాఫీ కావాలా, టీ కావాలా అని అడుగుతావేంటి అంటాడు. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నువ్వు మీ పుట్టింటికి వెళతావ్, నీ కాపురం కూలిపోతే నీ పుట్టింటివాళ్లంతా నా కాళ్లు పట్టుకోవాలి, కుళ్లి కుళ్లి ఏడవాలి అంటాడు. పగతో రగిలిపోయే మీరు ప్రేమకు దగ్గరవలేకపోతున్నారని చెప్తుంది..సంజయ్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

ఇల్లంతా పూలే

ఇంతలో బాలు మీనా వచ్చి పూల సంచులన్నీ దించుతారు. అవి చూసి మళ్లీ ప్రభావతి నోరు పారేసుకుంటుంది. ఇలా ఇంటిని పూలమార్కెట్ చేశారేంటి అంటుంది. ఇంటి ముందు ఇలా పెడితే వచ్చిపోయేవాళ్లకి ఇబ్బంది అవుతుంది. హాల్లోకి రండి అంటాడు సత్యం. ప్రభావతి షాక్ అవుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి ఇదేంటని అడిగితే పెద్ద ఆర్డర్ వచ్చిందని చెబుతాడు సత్యం. ఈ ఒక్కరోజే బాలు మీనా రెండున్నర లక్షలు సంపాదించబోతున్నారని చెబుతాడు.  అంతా షాక్ అవుతారు. మీనా సంతోషంగా ఉంటుందంటే చూసి ప్రభావతి ఓర్వలేకపోతుంది. వెంటనే వదిన కామాక్షికి కాల్ చేసి రమ్మని పిలుస్తుంది.

గుండెనిండా గుడిగంటలు జూన్ 05 గురువారం ఎపిసోడ్ లో మీనా-బాలుకి వచ్చిన ఆర్డర్ చెడగొట్టేందుకు, పూల దండలు తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తాడు గుణ