గుండెనిండా గుడిగంటలు మే 28 ఎపిసోడ్
కారు అమ్మేసినందుకు రోహిణి, ప్రభావతి, మనోజ్, శ్రుతి అందరూ కలసి బాలుని నిలదీస్తారు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు ఎవరికీ తెలియకుండా ఎలా అమ్మేస్తావని నిలదీస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో కారు అమ్మాల్సి వచ్చంది? ఆ డబ్బులు ఏం చేశావని వరుస ప్రశ్నలు సంధిస్తుంది ప్రభావతి. తండ్రి సత్యం కూడా క్వశ్చన్ చేయడంతో..ఓ కారణంతో కారు అమ్మేశానని చెప్తాడు బాలు. తనకు ఓ ఆపద వచ్చిందని దాన్నుంచి బయటపడేందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనడగానే ప్రభావతి విశ్వరూపం చూపిస్తుంది. ఆ కారణం ఏంటో చెప్పాలని పట్టుబడుతుంది. అదేంటో ఇప్పుడే చెప్పలేను సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు బాలు. ఇదే అదనుగా మనోజ్ రెచ్చిపోతాడు.
కారు అమ్మితే మూడు నాలుగు లక్షలొస్తాయి కదా ఆ డబ్బులు ఇప్పుడే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు మనోజ్. రోహిణి కూడా ఆ డబ్బు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. ఎంత చెప్పినా ఎవ్వరూ వినకపోవడంతో చిరెత్తిపోయిన బాలు.. అసలు మొదట్లో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి తెచ్చిన 40 లక్షలు ఇమ్మని రివర్సవుతాడు. అప్పుడే తాను తీసుకున్న డబ్బులు కూడా వెంటనే ఇస్తానని మనోజ్ కి ఇచ్చిపడేస్తాడు. నువ్వు చేసిన అప్పు గురించి మాట్లాడితే నన్ను డబ్బులు అడుగుతావేంటని మనోజ్ అడుగుతాడు. అయినా నీతో మాట్లాడడం నాదే తప్పంటూ రూమ్ లో కివెళ్లిపోతాడు.
మనోజ్ రూమ్ లోకి వెళ్లిపోయిన తర్వాత రోహిణిని నిలదీస్తాడు బాలు. నన్ను కారు విషయంలో నిలదీస్తున్నావ్ నీ గుట్టు రట్టు చేయాలా? నువ్వు ఇప్పటివరకూ ఏ తప్పూ చేయలేదా? ఇంట్లో వాళ్లకి అబద్ధాలు చెప్పలేదా? మోసం చేయడం లేదా? అని వరుస క్వశ్చన్స్ వేస్తాడు బాలు. రోహిణి పార్లర్ గురించి మాట్లాడుతుండగా సత్యం కంట్రోల్ చేస్తాడు.
మీరు లేచిపోయి పెళ్లిచేసుకోవడం వల్లే మా నాన్న ఆరోగ్యం పాడైంది ముందు ఆ సంగతి తేలుద్దామా అని శ్రుతిని క్వశ్చన్ చేస్తాడు. ఇక శ్రుతి ఏమీ మాట్లాడలేక ఆగిపోతుంది.
కారు అమ్మేసిన డబ్బులు ఎక్కడికీ పోలేదు..ఓ సమస్య వచ్చి వాడుకున్నా త్వరలోనే అమ్మకు సంబంధించిన ఆ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తాడు
కారణం చెప్పకపోవడంతో ఇంట్లో అంతా మళ్లీ మళ్లీ క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. బాలు అస్సలు స్పందించకుండా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. మీనా క్వశ్చన్ చేసినా మాట్లాడనివ్వడు.దీంతో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటుంది మీనా బాలు స్నేహితుడు రాజేష్ ని కలిసిన మీనా ఏం జరిగిందా అని ఆరాతీస్తుంది. ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాడు రాజేష్. గుణ చేసిన గొడవ సహా అన్నీ చెప్పేస్తాడు. అది విన్న మీనా ఎమోషనల్ అవుతుంది. తనపై నేనెప్పుడూ సీరియస్ అవ్వను అంటుంది. గుణ దగ్గరకు వెళ్లిన మీనా కడిగేస్తుంది. పిక్ పాకెట్లు కొట్టే ఎదవ్వి నీ కాళ్లు నా భర్త పట్టుకోవాలా అని ఫైర్ అవుతుంది. నా భర్త తలుచుకుంటే నీకు బతుకు ఉండదని హెచ్చరిస్తుంది. మరోసారి నా తమ్ముడిని వెంటపెట్టుకుని తిరగొద్దని హెచ్చరిస్తుంది. శివను అడ్డుపెట్టుకుని మొగుడు పెళ్లాలను దూరం చేస్తానంటాడు గుణ
ఉద్యోగం వచ్చింది..కెనడా వెళతానంటూ కలలు కంటాడు మనోజ్. నీ దగ్గర డబ్బులున్నాయా అని రోహిణి అడిగితే మీ నాన్న ఇస్తారుగా అంటాడు. గాల్లో మేడలు కట్టకు అంటుంది రోహిణి. ఇంతలో మనోజ్ కు అప్పు ఇచ్చిన పార్క్ ఫ్రెండ్ ఆ డబ్బులు తిరిగి అడుగుతాడు..దీంతో ఇంట్లోంచి బయటకు వెళ్లను అంటాడు మనోజ్.
గుండెనిండా గుడిగంటలు మే 29 ఎపిసోడ్ లో...మౌనిక కనిపించలేదంటూ అని వెతుకుంటాడు భర్త సంజయ్..అది గమనించిన బాలు ఆ ఇంటికి వెళ్లి నా చెల్లిని ఏం చేశావని నిలదీస్తాడు..