గుండెనిండా గుడిగంటలు మే 27 ఎపిసోడ్రోహిణికి దొరికిపోయిన బాలు

బాలును ఆటోడ్రైవర్ గా చూసిన రోహిణిలో అనుమానం వస్తుంది. ఎన్నిసార్లు అడిగినా అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంటాడు. రాజేష్ కి కాల్ చేసి కారు రెంట్ కి ఇచ్చానని తాళాలు తీసుకోమని కావాలని చెప్తాడు. ముందు అర్థకానట్టు మాట్లాడిన రాజేష్.. ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్లు ఆటో ఎక్కారా అని క్వశ్చన్ చేస్తే అవును అని రిప్లై ఇస్తాడు బాలు. వాళ్లతో జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజేష్. రోహిణిని వాళ్ల పార్లల్ దగ్గర దింపేస్తాడు. అక్కడ బాలుకి తెలిసిన వ్యక్తి ఎదురవుతాడు. ఎందుకు ఆటో నడుపుతున్నావ్ కారు అమ్మేశావా అని అడిగితే..అవును అని రిప్లై ఇస్తాడు. ఆ మాటలు వింటుంది రోహిణి. బాలు కారు అమ్మేశాడని అర్థమైన తర్వాత ఈ విషయం ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకుంటుంది.

మనోజ్ కి చెప్పిన రోహిణి

పార్లల్ లో పని త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్లి..బాలు కారు అమ్మేశాడని ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడనే విషయం చెప్తుంది. అది విన్న మనోజ్ అస్సలు రియాక్ట్ కాడు..కారు నడిపితే ఏంటి, ఆటో నడిపితే ఏంటి అని కొట్టిపడేస్తాడు. ఇంటిపత్రాలు తాకట్టు పెట్టి కదా కారు కొన్నాడు.. అలాంటిది ఎవరికీ చెప్పకుండా ఎలా కారు అమ్మేస్తాడని నిలదీస్తుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు కదా..అందరకీ అడిగే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నిస్తుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టిన టైమ్ లో మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో నీకు తెలుసుకదా ఇప్పుడు కారు ఎందుకు అమ్మేశాడో అడగాల్సిందే అని మనోజ్ ని ముందుకి తోస్తుంది. వాడితో మనకెందుకు అని మనోజ్ అన్నా కానీ రోహిణి ఊరుకోదు. నీవల్ల కాదు నేనే తేల్చుతా అంటూ హాల్లోకి వెళుతుంది 

ప్రభావతికి రోహిణి కంప్లైంట్

దేవుడికి దీపం పెట్టుకుంటున్న అత్త ప్రభావతి దగ్గరకు వెళ్లి నాకు ఓ నిజం తెలిసింది అత్తయ్య అంటుంది. మీకు మనింట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసా అని అడుగుతుంది. నువ్వు పార్లర్ నడుపుతున్నావ్, మనోజ్ కెనడా వెళుతున్నాడు, శ్రుతి డబ్బింగ్ చెబుతోంి. రవి రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. మీనా పూలకొట్టు నడుపుతోంది..బారు కారు డ్రైవ్ చేస్తున్నాడు అంటుంది. రియాక్టైన రోహిణి బాలు కారు డ్రైవ్ చేయడం లేదు.. ఆటో నడుపుతున్నాడు నేను స్వయంగా చూశాను అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు అమ్మేసి ఆ డబ్బులు ఏం చేశాడో తెలియడం లేదని ప్రభావతిని బాలుపైకి వదులుతుంది రోహిణి 

మీనాని నిలదీసిన ప్రభావతి

ఇంట్లో అందర్నీ పిలిచి బాలు గురించి హడావుడి చేస్తుంటుంది ప్రభావతి. ఇంతలో మీనా రావడంతో బాలు ఆటో నడుపుతున్నాడా అని అడుగుతుంది. అవును ఇందాకే పూలకొట్టు దగ్గర చూశాను అంటుంది. కారు అమ్మేసి ఆ డబ్బులు మీ ఇద్దరూ కలసి మీ ఇంటికి పంపించారా అని నోటికి పనిచెప్తుంది ప్రభావతి. నాకు ఏ విషయం తెలియదు ఆయన వచ్చిన తర్వాత అడగండి అని క్లారిటీ ఇస్తుంది. అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు

బోనులో బాలు

బాలుని బోనులో నిల్చోబెట్టిన ప్రభావతి..కారు విషయంలో నిలదీస్తుంది.కారు అమ్మేసి ఆ డబ్బులు దాచేశాడు..ఆటో అద్దెకు నడుపుతున్నాడు అంటుంది. వీడు చేస్తే కరెక్ట్, నేను చేస్తే రాంగా అంటాడు మనోజ్. నేను డ్రైవింగ్ చేయకుండా చేస్తున్నట్టు అబద్ధం చెప్పలేదు కదా అంటాడు బాలు. ఆయన ఏం చేసినా అర్థం ఉంటుంది అంటుంది మీనా. కారు అమ్మేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతాడు సత్యం. అవును నాన్నా అమ్మేశాను తప్పలేదు అమ్మేశాను అంటాడు. నాకు కొన్ని సమస్యలు వచ్చాయి..అందుకే అమ్మేయాల్సి వచ్చింది అంటాడు. ఆ డబ్బులేవి అని ప్రభావతి నిలదీస్తుంది

గుండెనిండా గుడిగంటలు మే 28 ఎపిసోడ్ లో

కారు అమ్మేసి ఆటో నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజేష్ ని నిలదీస్తుంది మీనా. శివ, గుణ నుంచి మొత్తం జరిగినదంతా చెప్పేస్తాడు రాజేష్.