గుండె నిండా గుడి గంటలు మే 22 ఎపిసోడ్  

బాలు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు..పోలీసులు ఇలా మొత్తం డబ్బులు ఇవ్వరని విన్నానే అంటాడు మనోజ్, బాలు చెప్పింది నమ్మశక్యంగా లేదంటుంది రోహిణి. మలేషియా నుంచి మీ మావయ్య వచ్చాడన్నావ్ మేం నమ్మలేదా అని కౌంటర్ ఇస్తాడు బాలు. దొంగని పట్టుకుంటే కోర్టులో సబ్ మిట్ చేయాలి కదా అని రోహిణి అంటే..దొంగలు, పోలీసులు, డిపార్ట్ మెంట్ గురించి బాగా స్టడీ చేసినట్టున్నావ్ అంటాడు. ఇంతకీ దొంగ ఎక్కడున్నాడు అని అడిగితే. కష్టపడి సంపాదించిన సొమ్ము మనల్ని వదిలి పోదులే అందుకు ఇదే సాక్ష్యం అంటాడు సత్యం. కొన్ని దొంగకోళ్లు పట్టే కళ్లు వీటిపై కన్నేశాయి అని మనోజ్ కి కౌంటర్ ఇస్తాడు. వెంటనే స్పందించిన మనోజ్ అరేయ్ ఎవర్నిరా అంటున్నావ్ అంటాడు. నువ్వెందుకు భుజాలు తడుముకున్నావ్ అని మరోసారి ఇచ్చిపడేస్తాడు. ఆ డబ్బులు దాచిపెడతాను ఇవ్వు అని ప్రభావతి అంటే..ఓసారి ఇచ్చాను బాగా దాచావుకదా చాలు..ఇవి నేను జాగ్రత్త చేసుకుంటాను అనేసి సత్యం వెళ్లిపోతాడు.

ఎవరికి వాళ్లు వెళ్లిపోతారు..రూమ్ లోకి వెళ్లిన రోహిణి బాలు చెప్పిన ఒక్కోమాటని తల్చుకుని ఆలోచిస్తుంది. బాలు చెప్పింది నమ్మశక్యంగా లేదు అనుకుంటుంది. ఆ దొంగకి, బాలుకి ఏదో లింక్ ఉందని అనుమానిస్తుంది. ఆ మాటలు విని మనోజ్ ఫైర్ అవుతాడు. బాలుకి కోపం ఎక్కువే కానీ డబ్బుకోసం గడ్డి తినే రకం కాదు, వాడి నిజాయితీపై వేలెత్తి చూపించొద్దు అంటాడు. దొంగతనం జరిగిన డబ్బుని పోలీసులు ఎప్పుడూ తిరిగి ఇవ్వరు మధ్యలోనే తినేస్తారు..బాలు మాత్రం మొత్తం తెచ్చాడంటే ఏదో ఉంది.. ఆ దొంగ ఎవరో కనక్కుని తీరుతా అంటుంది రోహిణి. ఈ మాటలు విన్న మీనా బాధపడుతుంది

శివ తనతో మాట్లాడిన మాటలు విని రగిలిపోతాడు బాలు..ఇంతలో మీనా రావడం చూసి ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. మా ఇంటికి వెళ్లాను, శివ ఆ గుణ దగ్గర ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు అంటుంది. నేను నిన్ను మీ పుట్టింటికి పంపించలేదు కదా మీ తమ్ముడు నాపై నిందలు వేస్తాడేంటని ఫైర్ అవుతాడు. మీ తమ్మడు మరోసారి నా జోలికి వస్తే రెండో చేయి కూడా విరగ్గొడతా అంటాడు. నిన్ను పంపించి వాడిని దార్లో పెట్టాలని చూస్తున్నానని మీ తమ్ముడు నాపై అంటున్నాడని చెబుతాడు. మీరు నాదగ్గర ఏదో దాస్తున్నారు అంటుంది. వాడు బైక్ దాచిన విషయమే బయటకు చెప్పకుండా దాచారు..అలాంటికి ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటుంది. అయినా ఇకపై నువ్వు మీ పుట్టింటికి వెళ్లకు అంటాడు. మీ అమ్మ, చెల్లిని కలువు కానీ మీ తమ్ముడు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లొద్దు అని చెప్పేస్తాడు.   ఏదో బలమైన కారణం లేనిదే మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరని, అసలు ఏం జరిగిందని అడుగుతుంది మీనా. అన్ని టైం వచ్చినప్పుడు నేనే చెబుతానని వెళ్లిపోతాడు బాలూ.

బాలు వెళ్లిపోయిన తర్వాత శివకు కాల్ చేసిన మీనా..బావని కలిసేందుకు వెళ్లావా అని అడుగుతుంది. మీ ఆయన్ని బావా అని పిలవను అంటాడు. ఇవాళ తిట్టడానికి కొట్టడానికి ఎవరూ దొరకలేదు అందుకే కలిశాడు అంటాడు. నువ్వు అడ్డమైన వాళ్లతో కలసి తిరిగితే ఆయనకు నచ్చదు. పెద్దవాళ్లు చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నరో వినాలి అంటుంది మీనా. ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు శివ. మీలోమీకు ఏవైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతుంది. నిన్నేమైనా అంటున్నాడా అని శివ అంటాడు. కలిస్తే ఏం చేస్తాడు అని శివ అడుగుతాడు. మళ్లీ గుణను కలిస్తే జీవితమంతా మంచంపైనే ఉండాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది మీనా. మీ ఆయన నిన్ను వెళ్లగొడితే నువ్వు ఇక్కడికి వచ్చెయ్ అంటాడు. లేదంటే నువ్వక్కడ సంతోషంగా ఉండు ఇక్కడకు రాకు మేం కూడా సంతోషంగా ఉంటాం అని కాల్ కట్ చేస్తాడు. మీనా షాక్ అవుతుంది.

శ్రుతి పక్కనే ఉండి మెసేజెస్ చేస్తుంది. హనీమూన్ వెళదాం అని శ్రుతి పట్టుబడుతుంది. నేను సైకిల్ పై నిన్ను తీసుకెళ్లడం చూశారు కదా నన్ను అవమానించేందుకు ఆ టికెట్స్ నీవాళ్లు ఇచ్చారు అంటాడు రవి. నేను ఒక్కదాన్నే వెళతాను అయితే అంటుంది శ్రుతి.  నేను సంపాదించి నిన్ను సొంతఖర్చులతో తీసుకెళ్తాను అనే నమ్మకం ఉంటే నాకోసం వెయిట్ చేయి అనేసి పడుకుంటాడు. ఫైర్ అవుతుంది శ్రుతి. ఇంతలో వాళ్ల అమ్మ కాల్ చేయడంతో మేం ఎక్కడికీ వెళ్లడం లేదు..మా ఆయన సంపాదించి తీసుకెళ్లాడట అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. 

బాలుకోసం టిఫిన్ ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తుంటుంది మీనా..అందరూ వస్తారు కానీ బాలు రాడు..మరోవైపు ప్రభావతిని డబ్బులు అడుగుతాడు మనోజ్. పాత జాబ్ వదిలేశానని చెప్పడంతో ఫైర్ అవుతుంది.