అన్వేషించండి

Gundeninda Gudigantalu Today ఫిబ్రవరి 24 ఎపిసోడ్: రహస్యం కనిపెట్టేసిన బాలు, రోహిణి ప్లాన్ ఫెయిల్ - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 24 ఎపిసోడ్

Gundeninda Gudigantalu Today ఫిబ్రవరి 24 ఎపిసోడ్: మనోజ్ కి లెటర్లు ఎవరిస్తున్నారో బాలు ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. శ్రుతిని మధ్యలో దించేసి నీతూను బైక్ పై తీసుకెళ్లాడు రవి. ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu 2025 February 24 Episode: తనకు వస్తున్న బెదిరింపు లెటర్లు బాలు రాశాడంటూ అనుమానంతో కోపంగా ఇంటికొస్తాడు మనోజ్. ఓవైపు రోహిణి సర్దిచెబుతున్నా కానీ వినడు. ఇంటికి బాడీగార్డ్ ని తీసుకొచ్చి పెద్ద హడావుడి చేస్తాడు. ఏదైనా ఉంటే ముఖాముఖీ మాట్లాడే మనస్తత్వం నా భర్తది ఇలాంటి పనులు ఆయన చేయరు అంటుంది మీనా. వాడికి కాల్ చేసి రమ్మను తేల్చుకుందాం అంటుంది..మీనా వెంటనే బాలుకి కాల్ చేసి రమ్మంటుంది. ఇదంతా బాలు పనే అయి ఉంటుందని ప్రభావతి ఫిక్సవుతుంది. ఇంటికి వచ్చిన బాలుపై ఫైర్ అవుతాడు మనోజ్. బాడీ గార్డ్ అడ్డుకోవడంతో ఉతికి ఆరేస్తాడు. నీకు నేను బెదిరింపు లెటర్లు రాశానా అంటూ మనోజ్ నిలదీస్తాడు. ఒక్క గుద్దుతో బాడీగార్డ్ కిందపడిపోతాడు. మనోజ్..భయపడిపోతాడు. ఆ లెటర్లు ఇచ్చిన వ్యక్తిని నేనే అని వాడు చెప్పాడంటే.. అప్పుడు నాకు చెప్పాల్సింది అక్కడకు వచ్చి ఒక్కటిచ్చేవాడిని అంటాడు బాలు. అసలు లెటర్లు రాస్తున్నారంటే..మీకు సంబంధించిన వీక్ పాయింట్ ఏదో వాడికి తెలిసి ఉండాలి? మీ నుంచి డబ్బులు గుంజాలని ప్లాన్ చేస్తున్నాడంటే ఏదో జరుగుతోంది అంటుంది శ్రుతి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం బయటపడుతుందని అంటుంది. ఉలిక్కిపడిన రోహిణి.. వద్దు వద్దు పోలీసులు ప్రతిసారీ షోరూమ్ కి వస్తే బిజినెస్ పాడవుతుందని రోహిణి సర్దిచెబుతుంది

బయటకు వచ్చిన మీనా-బాలు ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు? మనోజ్ గాడికి ఆ లెటర్లు ఎవరిచ్చారో వెతికి పట్టుకుంటే అప్పుడు అసలు విషయం బయటపడుతుంది అంటాడు. బాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాడంటే అంత ఈజీగా వదలడు అని కంగారుపడుతుంది రోహిణి. వెంటనే విద్యను కలిసి జరిగినదంతా చెబుతుంది.బాలుని కంట్రోల్ చేయాలంటే తన ఫోన్లో ఉన్న శివ వీడియో కొట్టేయాలి అనుకుంటుంది. అందుకు సహాయం చేయమని విద్యను రిక్వెస్ట్ చేస్తుంది. బాలు కారు బుక్ చేసుకో..ఆ కార్లో వెళుతూ..ఫోన్ కావాలని ఓసారి అడిగి తీసుకుని ఆ వీడియో నాకు పంపించు అంటుంది. ముందు భయపడిన విద్య ఆ తర్వాత సరే అంటుంది
 

మనోజ్ కి లెటర్లు ఎవరిస్తున్నారో తెలుసుకునేందుకు బాలునేరుగా గుడికి వెళతాడు. ఆలయ సిబ్బందిని క్వశ్చన్ చేయడంతో ఇటీవల  ఓ వ్యక్తి స్వామిజీ వేషంలో వచ్చి అన్నదానం, యజ్ఞాలు చేస్తానని భక్తుల నుంచి విరాళాలు సేకరించాడు..ఆలయ పెద్దలకు అనుమానం వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించగానే పారిపోయాడని చెబుతారు. దాడి చేసినప్పుడు తీసిన వీడియో చూపిస్తారంతా. ఆ వీడియో చూసి షాక్ అవుతాడు బాలు..ఇదే వ్యక్తి గతంలో యాక్సిడెంట్ కేసులో కనిపించాడని గుర్తుచేసుకుంటాడు. 

రోహిణి ప్లాన్ ప్రకారం  విద్య..బాలు కారు బుక్ చేసుకుంటుంది. బాలు ఫోన్ తీసుకునేందుకు ట్రై చేస్తుంది. అయితే బాలు రివర్స్ లో రోహిణి గురించి వరుస ప్రశ్నలు వేస్తుంటాడు. బాలు ఫోన్ తీసుకుని శివ వీడియో చూస్తుంది..పంపించుకుందాం అనుకునేలోగా మీనా నుంచి కాల్ రావడంతో ఫోన్ తీసుకుంటాడు బాలు. మనోజ్ కి లెటర్లు ఎవరు రాస్తున్నారో తెలిసిపోయిందంటూ మీనాతో మాట్లాడుతాడు..ఆ మాటలు విని విద్య మరింత కంగారుపడుతుంది.  వెంటనే రోహిణికి కాల్ చేసి ప్లాన్ ఫెయిల్ అంటూనే బాలుకి దినేష్ విషయం తెలిసిపోయినట్టుందని చెప్పేస్తుంది. 

ఇంట్లో అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు..మనోజ్ రాగానే మీనా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. కళ్లు కనిపించలేదా అనగానే.. నేను అత్తమామలకు, నా భర్తకు మాత్రమే సేవలు చేస్తానంటుంది. మనోజ్‌కు లెటర్లు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది..నాలుగు రోజుల్లో వాడిని పట్టుకుని నిజం బయటపెడతా అంటాడు బాలు. పోలీస్ కేసు పెట్టమని సత్యం సలహా ఇస్తాడు కానీ రోహిణి వద్దంటుంది. ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టను అంటాడు బాలు.  

శ్రుతి-రవి బైక్ పై వెళుతుండగా ..మధ్యలో నీతూ కారు చెడిపోయి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శ్రుతిని దించేసి నీతూను తీసుకెళ్తాడు..శ్రుతి కోపంగా మండిపోతుంది. ఈ రాత్రికి కాలరాత్రే అని భయపడతాడు రవి.  


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 16th:  మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?
పొదరిల్లు: మహా,చక్రి లాయర్‌ను ఎందుకు కలిశారు..? మహాకు నిహారిక ఇచ్చిన సలహా ఏంటి..?
Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
Nindu Manasulu Serial Today March 16th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!
Meghasandesam Serial Today march 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget