Gruhalakshmi  Telugu Serial Today Episode:  దివ్య భయపడుతూ హల్లో నిలబడి విక్రమ్‌ను పిలుస్తుంది. ఆ అరుపులకు రాజ్యలక్ష్మీ, బసవయ్యలతో పాటు ఇంట్లో వాళ్లు అందరూ వచ్చి దివ్యను ఏమైందని అడుగుతారు. ఇంతలో కంగారుగా విక్రమ్‌ పైనుంచి పరుగెత్తుకొస్తాడు. దివ్యను ఏమైందని అడుగుతాడు. ఎందుకలా భయపడుతున్నావని విక్రమ్ అడగ్గానే దివ్య పిచ్చి చూపులు చూస్తూ స్పృహ తప్పి పడిపోతుంది.


రాజ్యలక్ష్మీ: వద్దురా దివ్యను ఒంటరిగా బయటకు పంపొద్దని చెప్పాను విన్నావా? చూడు ఇప్పడు ఏమైందో చూడు.


అనగానే దివ్య సడెన్‌గా లేచి కూర్చుటుంది. తన కారు కింద పడిన అమ్మాయిని గుర్తు చేసకుంటుంది.


విక్రమ్‌: ఏమైంది దివ్య ఎందుకలా ఉన్నావు.


  దివ్య పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ.. అడ్డు తప్పుకో.. అడ్డు తప్పుకో.. అంటూ అరుస్తుంది. విక్రమ్‌ ఏమైందని అడుగుతే యాక్సిడెంట్‌ చంపేసాను అంటూ అరుస్తుంది దివ్య. నిజం చెప్తున్నాను  నేను ఒకమ్మాయిని కారుతో గుద్ది చంపేశాను అంటుంది దివ్య. విక్రమ్‌ ఎక్కడని అడగ్గానే అక్కడ మైలురాయి దగ్గర సడెన్‌గా కారుకు అడ్డొచ్చింది. స్పాట్‌లో పోయింది. అని దివ్య చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రాజ్యలక్ష్మీ మనం కూడా స్పాట్‌కు వెళ్లొద్దామని అంటుంది.


బసవయ్య: అదేమన్నా పిక్నిక్‌ స్పాటా? యాక్సిడెంట్‌ స్పాట్‌. బాడీ దగ్గర పోలీసులు అంతా హడావిడి ఉంటుంది. వెళ్లామంటే దొరికిపోతాం.


ప్రసూనాంబ: అదీ నిజయే కదా వదిన తప్పించుకునే మార్గం ఆలోచించాలి కాని ఇరుక్కుపోయే మార్గం ఎందుకు?


విక్రమ్‌: ఏంచేద్దాం అంటావు అమ్మా..


రాజ్యలక్ష్మీ: చూడు నాన్న నా అనుమానాలు నాకున్నాయి. ఇంతకంటే నన్నేమీ అడక్కు. స్పాట్‌కు వెళ్లి చూద్దాం.


బసవయ్య: అమ్మా యాక్సిడెంట్‌ ఎక్కడ జరిగిందో గుర్తు పడతావా?


దివ్య: ఆ గుర్తు పడతాను. బాడీ అక్కడే ఉంది.


అంటూ అందరూ యాక్సిడెంట్‌ స్పాట్‌కు వెళ్తారు. అక్కడ ఎటువంటి బాడీ ఉండదు. కనీసం యాక్సిడెంట్‌ అయిన ఆనవాలు కూడా కనిపించదు. దీంతో అందరూ దివ్య పిచ్చిపిచ్చిగా ఏవో మాట్లాడుతుంది అని అందరూ అనుకుంటారు. తులసి చెట్టు  ఎండిపోయింది అంది. వంటలు మారిపోయాయి అంది. ఇప్పుడు ఇలా ఇంకా మీకు అర్థం కావడం లేదా అంటూ బసవయ్య అనడంతో.. బాబాయి మాటలు నమ్మకు విక్రమ్‌.. ఇక్కడే ఆ అమ్మాయి చనిపోయింది. అంటూ మొండిగా అరుస్తుంది దివ్య. సరే ఇక్కడ ఏం లేదు కదా ఇంటికి వెళ్దాం పద అని విక్రమ్‌ అడగడంతో దివ్య తాను  ఇంటికి రానని అరుస్తూ స్పృహతప్పి పడిపోతుంది.


 మరోవైపు నంద బెడ్‌రూంలో కూర్చుని ఆలోచిస్తూ తులసి మనసు మార్చుకున్నట్లు  లేదు. తులసి ఆఫీసుకు వెళ్లాక ఎలాగైనా అమ్మను కన్వీన్స్‌ చేసి నాన్నను ఆ డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లాలి అనుకుంటాడు. ఇంతలో లాస్య అక్కడకు వచ్చి నందూని పిలుస్తుంది.


లాస్య: వాట్‌ నందు నీకింకా ఈ బద్దకం తగ్గలేదా? ఇలా అయితే ఎలా? డాక్టర్‌ ఆపాయింట్‌మెంట్‌  తీసుకున్నాం కదా మామయ్యగారిని తీసుకుని వెళ్లాలి కదా ఇంకా ఇలాగే ఉన్నావేంటి? త్వరగా రెడీ అవ్వు.


నంద: నిన్నెవరు ఇక్కడకి రమ్మన్నారు.


లాస్య: అదేంటి నందు విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్యగారిని డాక్టర్ దగ్గరకు తీసుకొస్తానని  నువ్వే కదా అన్నావ్‌.


అంటూ లాస్య అనగానే నందూ కూడా తులసిని అనసూయను కన్వీన్స్‌ చేస్తాడు. దీంతో తులసి తాను కూడా హాస్పిటల్‌కు వస్తానని చెప్తుంది. దీంతో అనసూయ సంతోషంగా ఫీలవుతుంది. లాస్య మాత్రం ఇది అక్కడకు వస్తే డాక్టర్‌ ను మేనేజ్‌ చేయడం చాలా కష్టం అని మనసులో అనుకుంటుంది. మరోవైపు దివ్యను డాక్టర్‌ టెస్ట్‌ చేస్తుంటాడు. ఏవో టాబ్లెట్స్‌ ఇచ్చి రెస్ట్‌ తీసుకోమని చెప్పి బయటకు వచ్చిన డాక్టర్‌ ఆమె జనరల్‌గా బాగానే ఉందని మెంటల్‌గా ఇబ్బంది పడుతుందని... ఇది ప్రమాదకరమైన జబ్బు మాత్రం కాదని రెగ్యులర్‌గా మెడిసిన్స్‌ తీసుకోవాలి. అని చెప్పగానే బసవయ్య అంటే దివ్యకు పిచ్చా? అనగానే విక్రమ్‌ బసవయ్య కాలర్‌ పట్టుకుని తిడతాడు. అందరూ విక్రమ్‌ను ఓదారుస్తారు. ఇంతలో దివ్య సడెన్‌గా గట్టిగా విక్రమ్‌ అంటూ అరుస్తూ నిద్ర లేస్తుంది.  విక్రమ్‌ విక్రమ్‌ అంటూ పరుగెత్తుకొచ్చి డోర్‌ దగ్గర ఉన్న విక్రమ్‌ను హగ్‌ చేసుకుంటుంది దివ్య.


విక్రమ్‌: దివ్య ఏమైంది దివ్య


దివ్య: భయమేస్తుంది విక్రమ్‌. తప్పు చేశాను. ఒక నిండు ప్రాణం తీశాను.


విక్రమ్‌: లేదు దివ్య నువ్వు ఏ తప్పూ చేయలేదు. ఎవ్వరి ప్రాణం తీయలేదు.


అనగానే ఏది అబద్దమో.. ఏది నిజమో అర్థం కావడం లేదు. అంత పిచ్చిపిచ్చిగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం నేను యాక్సిడెంట్‌ చేశాను. ఆ అమ్మాయి చనిపోయింది అంటూ దివ్య చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.