Gruhalakshmi September 26th: హనీ ఇక నుంచి స్కూల్ కి వెళ్ళడానికి వీల్లేదంటూ ధనుంజయ్ పాప ముందే తన పుస్తకాలు కాల్చి బూడిద చేస్తాడు. బుక్ కాలిపోతున్నట్టు మీ మనసుల్లో తులసి ఆలోచనలు కూడా కాలి బూడిద కావాలని హనీకి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలకి సామ్రాట్ బాబాయ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. స్కూల్ కి వెళ్ళడం తనకి ఇష్టం లేదని హనీ సర్ది చెప్పడానికి చూస్తుంది. ఇంట్లో తులసి హనీ కోసం కోణం బొమ్మలన్నీ సర్దుతూ ఉంటే నందు వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ప్యాక్ చేయడం కుదరడం లేదు కాస్త హెల్ప్ చేయవచ్చు కదా అంటుంది. కానీ నందు మాత్రం అర్థం చేసుకుంటావని మళ్ళీ మళ్ళీ చెప్పేందుకు చూస్తాడు. పరంధామయ్య హనీ దగ్గరకి వెళ్తానని అంటాడు. తన మాటకి అనసూయ కూడా వత్తాసు పలికి తాను వెళ్తానని అంటుంది. ఇక ఆపుతారా మీ డ్రామా అని తులసి గాలి తీసేస్తుంది.


తులసి: నన్ను ఆపడానికి మీరు వెళ్తానని అంటున్నారు. ఆ ఇంటికి వెళ్ళకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు. ఏం దాస్తున్నారు? నిజంగా మీకు ఎవరికైనా నాతో రావాలని అనిపిస్తే రండి. నన్ను మాత్రం వెళ్లనివ్వకుండా ఎవరు ఆపలేరు


Also Read: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!


డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉండగా విక్రమ్, జానూ క్లోజ్ గా ఉంటారు. చేయి నొప్పిగా ఉందని నటిస్తుంది. తినడానికి ఇబ్బందిగా ఉందని అన్నం తినిపించమని అడుగుతుంది. ఆ మాటకి దివ్యకి కాలుతుంది. విక్రమ్ జానూకి ఫుడ్ తినిపిస్తుంటే కావాలని తన వేలు కోరుకుంటుంది. అది చూసి దివ్యకి రసం తీసుకెళ్ళి బసవయ్య చేతి మీద ఒలకబోస్తుంది. జానూ తినను అంటూ మరింత ఓవర్ యాక్షన్ చేస్తూ విక్రమ్ తో బతిమలాడించుకుంటుంది. దివ్య బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతే రాజ్యలక్ష్మి వెళ్ళి మంట పెడుతుంది. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. తర్వాత కథ రంజుగా ఉంటుంది. సినిమా చివరి వరకు చూస్తావా పారిపోతావా? అంటుంది. క్లైమాక్స్ లో గెలుపు హీరోదే అప్పుడు మీ నవ్వు ఆగిపోతుంది.. నా నవ్వు మొదలవుతుందని దివ్య ధీటుగా సమాధానం ఇస్తుంది. దీని గురించి అత్తా కోడళ్ళు కాసేపు వాదించుకుంటారు.


హనీ జీవితం నాశనం అయిపోతుందని పెద్దాయన బాధపడుతూ ఉండగా తులసి వస్తుంది. తనని చూసి కంగారుపడతాడు. రత్నప్రభ వచ్చి మాటలు మొదలుపెడుతుంది. రత్న ఏం గొడవ పడుతుందో ఏమోనని భయపడతాడు. హనీని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చానని చెప్తుంది. హనీ అని పిలవగానే తాను పరిగెత్తుకుంటూ వస్తుంది. తన కోసం తెచ్చిన బొమ్మలు అన్నీ ఇస్తుంది. స్కూల్ కి వెళ్లలేదా అని అడుగుతుంది.


రత్నప్రభ: వెళ్లలేదు మాన్పించాను


తులసి: అదేంటి? తను ఇప్పుడిప్పుడే మాన్పిస్తే కష్టం కదా


రత్నప్రభ: మాకు హనీ అలవాటు అవాలి కదా. ఇప్పుడిప్పుడే తను మనుషులకి అలవాటు పడుతుంది. అందుకే కొద్ది రోజులు తనని స్కూల్ మాన్పించి అలవాటు చేసుకుంటున్నాం


తులసి: మంచి ఆలోచన అలా అయితే నాకు కూడ దిగులు ఉండదు


ధనుంజయ్: హనీని లోపలికి పంపించేస్తాడు. సామ్రాట్ కి చాలా దగ్గర వాళ్ళం మేము


రత్నప్రభ: మీరు పదే పదే ఈ ఇంటికి రావొద్దు


తులసి: నేను వస్తే మీకు ఏంటి ఇబ్బంది


ALso Read: రాజ్‌ ని ఓడించిన కళావతి - కళ్యాణ్ ని చితక్కొట్టిన అప్పు- స్వప్న కిడ్నాప్!


రత్నప్రభ: మీరు వస్తే మీకోసం ఆలోచిస్తూ హనీ మాకు దగ్గర అవడం లేదు. తనకి ఎప్పటికీ పరాయి వాళ్ళం అవాల్సి వస్తుంది.


తులసి: హనీ నాకు దగ్గర అవడం కంటే మీకు దగ్గర అవడం మంచిదనేసి బాధగా వెళ్ళిపోతుంది.


విక్రమ్ గదిలోకి రాగానే దిండు విసిరి కొడుతుంది. ఏమైందని అడుగుతాడు. దివ్య కోపంగా చీప్ పనులు చేస్తున్నావని అరుస్తుంది. మరదలకి ముద్దలు కలిపి పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీస్తుంది.


విక్రమ్: నేను సరిగా మాట్లాడటం లేదని చేయి కట్ చేస్తుంది. మరి నువ్వు నా పెళ్ళానివని చెప్పుకుంటున్నావ్ కానీ నా మాట వినకుండా గడప దాటి వెళ్లిపోయావ్


దివ్య: జానూ నిన్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి దగ్గర అవుతుంది. ఈ ప్రవర్తన ఏదో ఒకరోజు గుది బండగా మారుతుంది


విక్రమ్: నిన్నే పట్టించుకోని వాడిని నీ సలహాలు ఎలా పట్టించుకుంటాను . నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు