ఇంట్లో బోర్ కొడుతుందని హాస్పిటల్ కి వెళ్తానని దివ్య రాజ్యలక్ష్మిని అడుగుతుంది. కానీ కొత్త కోడలు అప్పుడే ఇంటి నుంచి బయటకి వెళ్తే ఎలా నీకు బోర్ కొట్టకుండా నేను చేస్తాను. వంటలు మొదలు పెట్టమని చెప్తుంది. వంటలు వచ్చో రావోనని ప్రసన్న అంటుంది. తులసి వంటలో ఎక్స్ పర్ట్ కదా వంట రాకుండా ఎలా ఉంటుందని రాజ్యలక్ష్మి అంటుంది. ఇప్పుడు వంట రాదని చెప్తే అమ్మని మాటలు అంటారని దివ్య మనసులో అనుకుంటుంది. మీ ఆయనకి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అది వండి పెట్టి మనసు దోచుకోమని బసవయ్య దొంగ సలహా ఇస్తాడు. ఇంటి పనుల్లో భలే ఇరికించావని సంబరపడతారు. నందు సోఫాలో కునికి పాట్లు పడుతూ ఉండటం తులసి చూసి ఎందుకో భయం, దిగులుగా ఉంటున్నారని అనుకుంటుంది. నిద్రలేపకుండానే వెళ్ళిపోతుంది. నందుకి కలలో దివ్య పొడుచుకున్నట్టు కన్పిస్తుంది. దీంతో గట్టిగా నో అని అరిచి పక్కన ఉన్న ప్లేట్ ని విసిరికొడతాడు.


Also Read: ఈ అత్తాకోడళ్ళు మాములోళ్ళు కాదు కడుపుబ్బా నవ్వించేశారు- భవానీ మనసు కృష్ణ మారుస్తుందా?


అయోమయంగా చూస్తూ ఇక్కడ ఎవరూ లేరా రాలేదా దివ్య రాలేదా ఎక్కడ ఉందని భయం భయంగా అడుగుతాడు. అది తన అత్తారింట్లో ఉందని చెప్తుంది. నాకు పిచ్చి కల వచ్చిందని కంగారుపడతాడు. మీరు దేనికో భయపడుతున్నారు ఎన్ని సార్లు అడిగినా చెప్పడం లేదు నాకు చెప్పకపోయినా పరవాలేదు మీ ఆవిడకి అయినా చెప్పమని తులసి చెప్తుంది. నీతో తప్ప ఎవరితో చెప్పలేను మనసులో ఏదో భయం దివ్యకి ఏదో అవుతుందని అంటాడు. రాజ్యలక్ష్మి ప్రవర్తన చూస్తుంటే అనుమానంగా ఉందని చెప్తాడు. అంత ఆస్తి ఉండి అల్లుడు నేల మీద కూర్చుని భోజనం చేయడం ఏంటి అతను తల్లి చేతిలో కీలు బొమ్మ అనిపిస్తుందని అంటాడు. అన్నింటికీ తులసి సమాధానం చెప్పి సర్ది చెప్తుంది. అమ్మకి కాల్ చేస్తే సలహా ఇస్తుందని వీడియో కాల్ చేస్తుంది. కొత్త కోడలిని అని చూడకుండా తనని టెన్షన్ పెడుతున్నారని అంటుంది. ఇప్పటి నుంచే వంటల డ్యూటీ నాదని చెప్పారని బుంగ మూతి పెడుతుంది.


వంట చేయడం కష్టం కాదు అది నీ బాధ్యతని తులసి కాసేపు క్లాస్ పీకుతుంది. వంటింట్లోకి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చెయ్యి నేను చెప్తాను కదా అంటుంది. దివ్య వీడియో కాల్ మాట్లాడుతుంటే చూసుకోకుండా విక్రమ్ మెల్లగా వచ్చి కౌగలించుకుంటాడు. అమ్మా అని దివ్య గట్టిగా అరుస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వచ్చి పట్టుకుంటానని జారుకుంటాడు. లాస్య వచ్చినా నందు పట్టించుకోకుండా పని చేసుకుంటాడు. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావని లాస్య అంటుంది. నాతో నువ్వు ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? పరాయి మనిషిని సొంత మనిషిలాగా చూస్తున్నారని కాసేపు వాదిస్తుంది. కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం దానికి ఇంజినీర్ రూ.10 లక్షలు అడిగాడు రెడీ చేసి పెట్టమని చెప్తాడు. డబ్బులు మొత్తం పోగొట్టాను కదా వెంటనే రాజ్యలక్ష్మి దగ్గరకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని అనుకుంటుంది.


Also Read: మనసు అడ్డు తెరలు తొలగిపోయాయి, సూపర్ ఎపిసోడ్- ఒక్కటైన యష్, వేద


దివ్య తల్లికి ఫోన్ చేసి గుత్తి వంకాయ కూర వండాలో అడుగుతుంది. తులసి కూర ఎలా వండాలో చెప్తుంది. దివ్య కిచెన్ లో రంగంలోకి దిగుతుంది. ప్రియ వచ్చి కొత్త కోడలితో వంట చేయించడం బాగోలేదని ప్రియ అంటుంది.