Janaki Kalaganaledhu August 16th: గోవిందరాజులు ఇంటి డాక్యుమెంట్లు తీయడంతో జ్ఞానంబ వచ్చి నిర్ణయం చెప్పడానికి పిల్లలకు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చాము కదా ఎందుకు అప్పుడే పేపర్లు బయటకు తీశారు.. పిల్లల మీద నమ్మకం లేదా అని అంటుంది. ఎందుకు లేదు పూర్తిగా నమ్మకం ఉంది నీ ఇల్లు నువ్వే తాకట్టు పెట్టుకో అంటారని పూర్తిగా నమ్మకం ఉంది అని అంటాడు.


పిల్లలను సరిగ్గా పెంచేలేమని బాధపడుతుంది. వెన్నెల పెళ్లి తరువాత కాశీకి వెళ్దాం ఈ ఇంట్లో ఉండాలని లేదంటుంది. దాంతో గోవిందరాజులు పిల్లల్ని కని పెంచడమే మన బాధ్యత.. వాళ్ల దగ్గర మనం ఏవి ఆశించకూడదు. పిల్లల మనసులో కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కదా.. ఈ నాన్న వల్ల అవన్నీ కావని తెలిసి కోరికలను త్యాగం చేశారు కదా అని అంటాడు.


వాళ్లకు కావాల్సింది మనం ఇవ్వనప్పుడు మనకు కావలసింది వాళ్ళ దగ్గర ఆశించకూడదని అంటాడు. వాళ్ళ జీవితాలు వాళ్ళవి.. వాళ్ళ అవసరాల వాళ్లవి ఆశించే హక్కు మనకు లేదని అంటాడు. దాంతో జ్ఞానంబ మరి అలాంటప్పుడు కలిసి ఉండటం దేనికి అనడంతో ప్రేమలు పంచుకోవడం కోసమని అంటాడు. డబ్బుల వల్ల బంధాలు దూరమవుతాయి కాబట్టి మనమే ఆ బంధాలను కాపాడుకోవాలని అంటాడు.


రామ ఇళ్ళు అమ్మనివ్వడు.. పెళ్లి బాధ్యత తనే చూసుకుంటాడు అనడంతో.. వెంటనే గోవిందరాజులు ఒక్కడి మీద ఎందుకు భారం వేయాలని అంటాడు. ఇప్పటికే ఇంట్లో గొడవలు అవుతున్నాయని వెన్నెల బాధపడుతుందని అంటాడు. ఇక జ్ఞానంబ రేపు ఉదయాన్నే ఎవరిని పిలవకండి ఇల్లు అమ్మేయమని   చెబుతుంది. గోవిందరాజులు కూడా సరే అంటాడు.


ఇక ఉదయాన్నే జానకి తన మరిది వాళ్ళతో వెన్నెల పెళ్లి బాధ్యతల గురించి అడుగుతుంది. వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ఇక వాళ్ళు ఇళ్ళు అమ్మడమే సరైనది అంటారు. దాంతో జానకి ఇళ్ళు గురించి, దాని విలువ గురించి, కుటుంబ ప్రేమ గురించి మాట్లాడుతుంది. రామ కూడా ఇక వాళ్ళు పట్టించుకోరని అంటాడు. ఇక జానకి కుటుంబం గురించి గొప్పగా చెబుతుంది.


ఇళ్ళు పోగొట్టుకుంటే ముక్కలు అవుతాము అని అంటుంది. అలా అవ్వటం మీకు ఇష్టమేనా అంటుంది. రామ కూడా.. తను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు అందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో చెబుతుంది అని అంటాడు. అంతేకాకుండా తను పెళ్లి విషయంలో ఒక్కడిని బాధ్యతలు తీసుకోవడం తనకు మించిన భారమని.. అని అమ్మానాన్నల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు.


వెన్నెల గురించి కూడా మాట్లాడుతూ మనం ఇలా ప్రవర్తిస్తే తను ఏమవుతుంది అనటంతో వెంటనే జానకి తను చచ్చిపోతాను అన్నదని వెన్నెల గురించి చెబుతుంది. ఇటువంటివి జరగకూడదు అంటూ కొన్ని విలువైన మాటలు చెప్పి బాధ్యత తీసుకోవాలని చెబుతుంది. ఈ ఇంటిని అమ్మకుండా కాపాడుకుందాం. మన బంధాన్ని కుటుంబాన్ని నిలబెట్టుకుందాం.. మీ ముగ్గురు కలిసి మీ చెల్లెలికి పెళ్లి చేయండి.. మీ అమ్మ నాన్నలను సంతోషంగా ఉంచండని అంటుంది. ఇక నేను ఎక్కువ బ్రతిమాలను మీ ఇష్టం మీ నిర్ణయం మీరు తీసుకోండని జానకి అంటుంది.


దాంతో విష్ణు, అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోగా జానకి ఇక ఏమైనా జరగనివ్వండి.. దేవుడిపై భారం వేద్దామని రామతో అంటుంది. ఇక గోవిందరాజు దంపతులు జరిగిన విషయాలు తలుచుకుంటారు. అప్పుడే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళ అక్కడికి వస్తారు. వెన్నెల కూడా వచ్చి బాధపడుతుంది. ఇక అందరూ కాసేపు మౌనంగా ఉండగా రామ తల్లితో మాట్లాడుతాడు.


మా సంతోషం కోసం మిమ్మల్ని కన్నాం.. మా బాధ్యతగా మిమ్మల్ని పెంచాం.. మీలో ఉన్నది మా రక్తం కాబట్టి ఆ బంధాన్ని జీవితాంతం కోరుకుంటున్నాం.. అంతకు మించి మనమధ్య ఎటువంటి రుణాలబంధం లేదని మీ నాన్నగారు నాకు అర్థమయ్యేటట్టు చెప్పారని అంటుంది. దాంతో రామ బాధపడుతూ ఎందుకు మన మధ్య ఎటువంటి గీత గీస్తున్నావు అని అంటాడు.


దాంతో గోవిందరాజులు మన మధ్య ఆ గీత ఉందని నాకు నిన్ననే తెలిసిందని.. ఆలోచించాను కాబట్టి అటువంటి గీత అవసరమని నాకు కూడా అనిపించిందని అంటాడు. ఇక దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదని.. ఎప్పటిలాగే మనం కలిసి ఉందామని అంటాడు. దాంతో రామ ఇల్లు అమ్మేస్తే మనం ఒక దగ్గర ఉండటం సాధ్యమవుతుందా అని అంటాడు.


ఇక జానకి విష్ణు వైపు చూడటంతో వెంటనే మల్లిక తనేంది తన భర్త వైపు చూస్తుంది.. మనసు మార్చాలని చూస్తుందా అని అనుకుంటుంది. ఇక రామ ఈ ఇల్లు అమ్మకూడదు అని అంటాడు. ఇక చెల్లి పెళ్లి గురించి మీరేమీ ఆలోచించకండి ఎవరు కలిసి వచ్చిన రాకున్నా ఆ బాధ్యత నాది అని అంటాడు. కానీ గోవిందరాజు దంపతులు మాత్రం ఒక్కడి మీద భారం వద్దని అంటారు.


జ్ఞానంబ.. మీ తమ్ముడు గురించి ఈ ఇంటి గురించి చాలా అప్పులు చేసే ముందు వాటి నుంచి బయటపడమని అంటుంది. వెంటనే గోవిందరాజులు నేను ఒకటి చెప్పింది ఒప్పుకుంటే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను అని రామతో అంటాడు. అదేంటి అని రామ అనటంతో తనకు అనుకోకుండా మూడు ఎకరాలు కలిసి వచ్చింది అని అంటాడు. దాన్ని నీ పేరు మీద రాయాలనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటావు కదా అని అంటాడు.


వెంటనే మల్లిక అలా ఎలా కుదురుతుంది. బావగారు ఒప్పుకున్న మేము ఒప్పుకోము. కోర్టు వరకు వెళ్తాము అని అంటుంది. రామ కూడా అందరికీ సమానంగా పంచాల్సిందే అని అంటాడు. వెంటనే గోవిందరాజులు ఆస్తులే కాదు బాధ్యతలు కూడా సమానంగా పంచుకోవాలి అని అంటాడు. నిజంగా ఆస్తి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి అని అనటంతో.. వెంటనే మల్లిక.. దగ్గర ఆస్తి లేకున్నా గాలిలో బాణం వేశాడు. అనవసరంగా తొందరపడ్డాను అని అనుకుంటుంది.


ఇక జానకి కూడా తన మరిది వాళ్ళను మీ నిర్ణయాలు మీరు చెబితే మనం కలిసి ఉండటమో విడిపోవటమో తెలిసిపోతుందని అంటుంది. ఇక మల్లిక మా ఆలోచనలు ఎందుకు మారుతాయి అనడంతో.. మారుతాయి అని అంటాడు విష్ణు. వెంటనే అందరూ ఆశ్చర్యపోగా మల్లిక ఏవండీ అని కోపంగా ఉంటుంది. ఇది మగాళ్ళకు సంబంధించిన విషయం.. నువ్వు కనిపించుకోకు.. నేను మాట్లాడతాను నువ్వు విను.. నీకు నచ్చిన నచ్చకపోయినా నాకు సంబంధం లేదు అనడంతో దెబ్బకు మల్లిక సైలెంట్ అవుతుంది.


ఇక రామతో చెల్లె పెళ్లి బాధ్యత నేను పంచుకుంటాను అని అంటాడు. నన్ను కూడా ఈ ఇంటి మనిషిగా.. నోరున్న మనిషిగా.. లెక్క వేసుకోండి అని అనటంతో గోవిందరాజు దంపతులు సంతోషపడతారు. అఖిల్ కూడా పెళ్లి పెళ్లి విషయంలో బాధ్యత తీసుకుంటాను అనటంతో జ్ఞానంబ సంతోషపడుతుంది.


 


also read it : Trinayani August 15th: నెలవంకలో సుమన, నయనిలకు కనిపించిన భవిష్యత్తు.. విశాలాక్షితో పందెం కాసిన సుమన?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial