అన్వేషించండి

Godavari Serial Today May 19th: 'గోదావరి' సీరియల్: మురళీ గుండె ముక్కలు చేసిన నందు! అక్క శాపనార్థాలు.. ఘోర అవమానం.. శంకర్ తట్టుకోగలడా!

Godavari Serial Today may 19th: మురళీని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు అని నందు అందరితో చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Godavari Serial Today Episode జాను చెప్పడంతో మురళీకృష్ణ తన తల్లిని కొంతమంది ముత్తయిదువులను తీసుకొని తాంబూలాలతో ఇంటికి వెళ్తాడు. మురళీనే స్వయంగా లంగావోణి కుట్టి తీసుకొస్తాడు. శారద దాన్ని నందుకి ఇచ్చి నీ కోసం మీ బావ ఎంతో ఇష్టంతో కుట్టాడు.. కట్టుకొని రా అని పంపిస్తుంది. నందు జాను దగ్గరకు వెళ్లి నీతో పని ఉంది రా అని లోపలికి పిలుస్తుంది. శంకర్ తన అక్కతో నేనే పంతులుకి కబురు పెట్టి నిశ్చితార్థం గురించి మాట్లాడాలి అనుకున్నా ఇంతలో నువ్వే తాంబూలాలతో వచ్చేశావ్ అక్క అని అంటాడు. మురళీతో ఏంట్రా అప్పుడే నీకు పెళ్లి కల వచ్చేసింది అని అంటాడు. మురళీ మామయ్య మాటలకు సిగ్గు పడతాడు.

నందు మురళీ ఇచ్చిన డ్రస్ విసిరి కొడుతుంది. అక్క డ్రస్ ఎందుకు విసిరి కొట్టావ్ అని జాను అడిగితే నేను మినిమమ్ రెండు మూడు వేలు పెట్టి సిటీలో బ్లౌజ్‌లు కుట్టించుకుంటానే.. అలాంటిది వాడు కుట్టిన లంగావోణీ వేసుకోవాల్సిన ఖర్మ నాకేంటి అని నందు అంటుంది. మర్యాదగా మాట్లాడు అక్క బావని పట్టుకొని వాడు వీడు ఏంటి.. బావ తెచ్చిన లంగావోణి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకేదైనా వేసుకో.. ముందు అయితే రెడీ అవ్వు అని జాను అంటుంది. ఏంటి రెడీ అయ్యేది.. ఎవరిని వచ్చారు వాళ్లు.. నన్ను అడిగి వచ్చారా. అంతా వాళ్లిష్టమేనా.. బావకి అర్థమయ్యేలా చెప్పమని చెప్పాను.. ఏం చెప్పావు నువ్వు అని నందు అంటుంది. తాంబూలాలు తీసుకురమ్మని నేనే చెప్పాను.. నువ్వు బావని చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది..

బావ మంచోడు అని ఇలా చెప్పాను అని జాను అంటుంది. మంచోడు  అయితే ఏం చేసుకోవాలి.. మంచితనాన్ని కూర వండుకొని తినమని అంటావా.. అమెరికా వెళ్లాలి అనుకున్న నేను ఇక్కడే జాకెట్లు కుట్టుకుంటున్నా బావని చేసుకొని ఆ జాకెట్లకి గుండీలు కుట్టుకొని ఇక్కడే కూర్చొవాలా నేను.. బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే మీకు అర్థం కావడం లేదా అని నందు అంటుంది. మన స్థాయి స్థోమత అర్థం చేసుకోకుండా అమెరికా అంటావ్ ఏంటి అని జాను అంటుంది. నాకు సంబంధం చూసేది.. నాకు పెళ్లి చేసేది నాన్న.. నువ్వు నాకు చెప్తావేంటి.. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని నందు జానుకి చెప్తుంది. 

ALSO READ: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ప్రిపరేషన్‌ని అడ్డుకోవాలని విజయానంద్ ప్లాన్! ఇంటికి దూరంగా ఉంటామని తల్లితో చెప్పిన సిద్ధూ!

నందుని తీసుకొని జాను ఇంకా రాలేదు ఏంటా అని శారద గదిలోకి వెళ్తుంది. జాను నందుని బతిమాలడం చూసి ఏం జరుగుతుందే ఇక్కడ అని అడుగుతుంది. నేను నాన్నతో మాట్లాడాలి అని నందు అంటే నువ్వు ఇంకా ఆమెరికా అమెరికా అని ఎగురుతున్నావా.. నువ్వు ఇలాగే ఉంటే.. ఊరుకునేది లేదు.. నువ్వు బయటకు రాకు గదిలోనే ఉండు అని జానుని తీసుకొని వెళ్లిపోతుంది. నందు రాలేదేంటి అని శంకర్ అడిగితే  నందు సిగ్గు పడుతుంది.. మనం తాంబూలాలు మార్చేసుకుందాం.. అని శారద అంటుంది. మురళీ తల్లి వెళ్లబోతే శారద ఆపి ముందు తాంబూలాలు మార్చుకుందాం అని అంటుంది. తాంబూలాలు మార్చుకునే టైంకి నందు వచ్చి ఆగండి అని తాంబూలాలు కిందకి విసిరి కొడుతుంది. ఏంటే నువ్వు చేసిన పిచ్చి పని అని బామ్మ అంటుంది. దానికి నందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంటే మీకు ఎవరికీ అర్థం కావడం లేదా.. నేను ఈ పెళ్లి చేసుకోను.. నాకు మురళీ బావ ఇష్టం లేదు అని చెప్తుంది. మురళీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. 

శారద నందుని లాగిపెట్టి కొట్టి ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. నీకు బావ అంటే ఇష్టం లేకపోవడం ఏంటి నందు అని శంకర్ అడుగుతాడు. నాకు నిజంగానే మురళీ బావ ఇష్టం లేదు నాన్న.. ఆ విషయం మీకు చెప్తాను అంటే అమ్మ, చెల్లి అడ్డుకుంటున్నారు.. నేను మురళీ బావని పెళ్లి చేసుకోను నాన్న అని అలకనంద చెప్తుంది. నందు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా.. అని మురళీ అడుగుతాడు. చెప్పాను కదా ఇష్టం లేదు అని నేను నిన్న కూడా నీకు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాను నీకు అర్థం కాలేదా అని నందు అడుగుతుంది. చిన్నప్పటి నుంచి నీకు నాకు పెళ్లి అనుకున్నారు కదా నందు అని మురళీ అంటే నువ్వు అనుకున్నావ్.. మీ అమ్మ అనుకుంది.. మా అమ్మానాన్న అనుకున్నారు.. ఈ ముసలిది అనుకుంది.. కానీ నేను అనుకోలేదు.. మీరు అనుకున్నారు కానీ నా ఇష్టం మీకు ఎవరికీ అవసరం లేదా.. వీళ్లందరి సంగతి వదిలేయ్.. నేను నిన్ను చేసుకుంటా అని నువ్వు ఎలా అనుకున్నావ్ బావ.. నువ్వు ఒక టైలర్‌వి నిన్ను చేసుకొని నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనుకున్నావ్,, నన్ను బైక్ మీద తీసుకెళ్లగలవు కానీ కారులో తిప్పలేవు.. గుడులకు సినిమాలకు తీసుకెళ్లగలవు కానీ షాపింగ్‌లకు బ్యూటీ పార్లర్‌లకు తీసుకెళ్లలేవు.. ఏ ఆడపిల్ల అయినా మంచి ఉద్యోగస్థున్ని.. ఆస్తి పరుడుని చేసుకోవాలి అనుకుంటుంది కానీ జాకెట్లు, లంగాలు కుట్టుకునే నీలాంటి వాడిని చేసుకోవాలి అనుకోదు అని నందు మురళీని దారుణంగా అవమానిస్తుంది. 

ALSO READ: ఇల్లాలు పిల్లలు: రామరాజు ముఖం మీద డబ్బు విసిరి కొట్టిన సాగర్! నర్మదని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోతాడా!

జాను నందుతో అక్క నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పు అంతే కానీ బావని అవమానించేలా మాట్లాడితే పెద్ద దానివి అని కూడా చూడను అని జాను అంటుంది. అసలు ఇదంతా నీ వల్లేనే అని నందు జానుని లాగి పెట్టి కొడుతుంది. నందు ఏం చేస్తున్నావ్ అమ్మా అని శంకర్ అడిగితే నేను చేయడం కాదు నాన్న మొత్తం చేసింది జానునే.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని బావకి అర్థమయ్యేలా చెప్పవే అంటే అలాగే అని ఇప్పుడు వాళ్లు తాంబూలాలు తెచ్చేలా చేసింది..మగరాయుడు మగరాయుడు అని మీరు నెత్తిన పెట్టుకున్నారు కదా.. అందుకే దీనికి ఇంత తల పొగరు అని నందు అంటుంది. ఇందులో జాను తప్పేముందు నందు తనని అనొద్దు.. నీకు నిజంగానే నేను అంటే అని మురళీ అంటే ఇష్టం లేదు అని ఎన్ని సార్లు చెప్పాలి.. ఇంకెలా చెప్పాలి అని నందు అరుస్తుంది. రేయ్ అది నువ్వు ఇష్టం లేదు అని అంత చెప్తున్నా ఇంకా దాన్ని బతిమాలుతున్నావ్ నీకు బుద్ధిలేదారా.. పౌరుషం లేదారా.. చిన్నప్పుడు నుంచి అలకనంద నీ పెళ్లాం అని వాడికి చెప్పింది నువ్వు అని శాంతి తల్లి మీద అరుస్తుంది. నీ కూతురు బుద్ధి మంతురాలు అనుకున్నా కానీ ఇంత పొగరుబోతు అనుకోలేదురా నేను.. నా కొడుకుకి నీ కూతురికి పెళ్లి చేస్తా అని నాకు మాటిచ్చావ్‌రా. మాట మీద నిలబటం అంటే ఇదేనా అని శాంతి ఏడుస్తుంది. ఇంత మంచి మనసు ఉన్న నా కూతురిని ఎలా మోసం చేయాలి అనిపించిందిరా.. నా కొడుకుని బాధ పెట్టిన మీరంతా మట్టి కొట్టుకుపోతారురా.. నాశనం అయిపోతారురా అని శాంతి అంటుంది. మురళీ తల్లిని తీసుకొని వెళ్లిపోతాడు.

శంకర్ కుప్పకూలిపోతాడు. శంకర్ ఏడుస్తుంటే నందు తప్ప మిగతా అందరూ ఏడుస్తూ శంకర్‌ దగ్గర కూర్చొంటారు. శంకర్ రాత్రి అయినా ఏడుస్తూ   విషయమే గుర్తు చేసుకుంటాడు. బామ్మ, శారద శంకర్ దగ్గరకు వెళ్లి అది చిన్ని పిల్ల దానికి మనమే చెప్పాలి.. మురళీ కూడా దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.. మీ అక్క కూడా బాధ పడుతుంది.. మాటలతో నందు వినకపోతే నాలుగు తగిలించి అయినా ఒప్పిద్దాం అని అంటారు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని శంకర్ అంటాడు. మరోవైపు భువన సైట్లో ఉంటే కొంత మంది లేటుగా వస్తారు. మీరు గంట లేటుగా వచ్చారు.. నేను ఇప్పుడు మాట్లాడను అని వెళ్లిపోతుంటే వాళ్ల భువనని ఆపి ఏంటి ఎక్ట్రాలు చేస్తున్నావ్.. మేం వచ్చింది వెంచర్ గురించి కాదు నీ ప్రొపర్టీస్ గురించి మాట్లాడటానికి అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 18: ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 18th: నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
Nuvvu leka Neanu Lenu Serial Today June 18th:నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను: నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
Podarillu Serial Today June 18th:మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
పొదరిల్లు: మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget