Godavari Serial Today May 18th: 'గోదావరి' సీరియల్: శంకర్ కోసం చెల్లినే ఎదురించిన సింహాద్రి! మురళీ, నందుల నిశ్చితార్థం జరుగుతుందా!
Godavari Serial Today may 18th జాను తోటలో కొబ్బరితో విసరడం అది సూర్యకి తగలడం భువన గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Godavari Serial Today Episode శంకర్ తన భార్య, కూతుళ్లని తోటకి తీసుకొచ్చి ఇదంతా మనదే మనం కొన్నాం అని సర్‌ఫ్రైజ్ చేస్తాడు. అందరూ చాలా సంతోషపడతారు. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అండీ అని శారద అడిగితే వచ్చినరోజే చెప్తే ఎక్కడ విన్నావ్.. ఎన్నో ఏళ్లుగా నిద్ర కరువు అయిపోయినట్లు పడుకున్నావ్ అంటాడు. నాన్న ఈ తోటలో కొబ్బరి, మామిడి అంతా మనదేనా అని కిన్నెర అడిగితే అవునమ్మా మొత్తం మనదే.. నేను ఎప్పుడూ దుబాయ్‌లో ఉంటాను.. ఎప్పుడో నాలుగేళ్లకి ఒకసారి వస్తాను అని మీరు చాలా బాధ పడతారు కదా.. కానీ మీ భవిష్యత్ కోసమే ఇదంతా.. మీకు అందమైన జీవితం ఇవ్వడం కోసం మీ నాన్న పడ్డ కష్టం అమ్మా ఇది అని శంకర్ అంటాడు.
శంకర్ మాటలకు అందరూ ఎమోషనల్ అయిపోతారు. మనం ఇందులో ఓ పెద్ద ఇళ్లు కట్టుకోవాలి.. అందరికీ ఒక్కో గది కట్టుకుందాం.. పెళ్లి అయినా తర్వాత కూడా మీరు పండగలకు ఇక్కడికి వస్తూ సందడిగా ఉండాలి.. చెప్పాలి అంటే నా ప్రాణం కూడా ఇక్కడే పోవాలి.. ఇప్పటి వరకు మీరే మా ప్రపంచం ఇప్పుడు ఇది కూడా మన ప్రపంచంలోకి చేరింది అని శంకర్ అంటాడు. నలుగురు అక్కా చెల్లెళ్లు తోట చూద్దాం అని వెళ్తారు. శంకర్ తన భార్యకి తోట చూపిస్తాడు. సూర్య జానుని చూడటానికి తుఫానుని తీసుకొని అక్కడికి వస్తాడు. బాబుగారు మీ అమ్మగారితో వచ్చి ఆవిడ కళ్లు కప్పి ఇదంతా అవసరమా అని అడుగుతాడు. ప్రేమలో ఇవన్నీ తప్పవురా.. పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి అని అంటాడు. అయితే ఆ మాట మీ అమ్మ గారిని చూసి చెప్పండి అని తుఫాను అంటే సూర్య నిజంగానే భువన వచ్చిందని భయపడతాడు. తీరా చూస్తే అక్కడ తన తల్లి లేకపోవడంతో నన్నే భయపెడతావా అని తుఫానుని అడుగుతాడు. అమ్మగారి పేరు చెప్తేనే ఇంత భయపడుతున్నారు.. ఇక మీ అమ్మగారిని ఎలా ఒప్పించి జానుని పెళ్లి చేసుకుంటారు అని అడుగుతాడు. జాను మీద నాకు ఉన్న ప్రేమే అమ్మని ఒప్పించేలా చేస్తుందని అంటాడు. జానుతో మాట్లాడాలి అని వెళ్తాడు.
నందు జాను వాళ్లతో నాన్న ఈ తోట కొనే కంటే సిటీలో పెద్ద ఇల్లు కొంటే బాగుండేది అని అంటుంది. తర్వాత కిన్నెర కోరికతో నలుగురు అక్కాచెల్లెళ్లు.. కొబ్బరి పుచ్చెలతో ఆడుకుంటూ ఉంటారు. జాను పుచ్చె విసరడంతో అది వెళ్లి సూర్య తలకి తగిలిపోతుంది. సూర్య తలకి రక్తం వస్తుంది. ఇంతలో భువన వచ్చి కంగారు పడుతుంది. భువన జానుని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఇంతలో శంకర్ వచ్చి భువనగారు అని ఆపుతాడు. నీ కూతురి మీద చేయి ఎత్తినందుకే నీకు అంత కోపం వస్తే నా కొడుకుకి దెబ్బ తగిలింది నాకు ఎంత కోపం రావాలి.. అయినా ఇలా కొబ్బరి కాయతో ఆటలు ఏంటే బుద్ధి లేకుండా అని అంటుంది. భువన గారు జరిగిన దానికి సారీ అని శంకర్ అంటే సారీ ఏంటి సారీ అయినా నీకు ఆడపిల్లలను పెంచడమే చేతకాదు.. అయినా నీకు ఆడపిల్లలను పెంచడం ఎలా తెలుస్తుంది.. దగ్గరుండి నువ్వు పెంచితే కదా.. పిల్లలను వదిలేసి సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కడో ఉంటున్నావ్,.. తండ్రి భయం లేకపోతే పిల్లలు ఇలాగే తయారవుతారు అని అంటుంది. భువనగారు సంస్కారంతో మాట్లాడండి.. మా నాన్నతో అలా మాట్లాడే అర్హత మీకు లేదు అంటుంది. పదే పదే నాదే తప్పు అంటే బాగోదు అని అంటుంది.
సింహాద్రి భువనతో చెల్లమ్మా ఆగు నా ఫ్రెండ్ కుటుంబం ఏంటో నాకు తెలుసు.. జాను ఏంటో అంతకంటే బాగా తెలుసు.. వెళ్లమ్మా అని అంటాడు. నిరూపించావ్ అన్నయ్యా.. రక్తం పంచుకొని పుట్టిన ఈ చెల్లి కంటే ముక్కూ ముఖం తెలియని నీ ఫ్రెండ్ ఎక్కువ అని నిరూపించావ్.. గుర్తు పెట్టుకుంటా దీన్నే కాదు నిన్ను కూడా అని వెళ్లిపోతుంది. రేయ్ సింహాద్రి ఏంట్రా ఇది.. నా కోసం మీ చెల్లితో మనస్ఫర్థలు తెచ్చుకుంటావా అని శంకర్ అడుగుతాడు. నా చెల్లే కాదురా.. నా ఫ్రెండ్ తప్పు లేకుండా ఎవరు ఏమన్నా నేను ఊరుకోను.. చివరకు దేవుడితో కూడా పోరాడుతా అని సింహాద్రి అంటాడు.
ALSO READ: కార్తీకదీపం సీరియల్: దీప, కార్తీక్‌లను విడదీసేసిన జ్యోత్స్న! 2 వారాలు జ్యో, దీపలకు కొత్త బాధ్యతలు!
శంకర్ నారాయణతో ఊరి పెద్దలతో మాట్లాడుతూ ఉంటారు. 5 ఎకరాలు తీసుకున్నావ్ అంట కదా అని అంటే అవును రెండు మూడు రోజుల్లో సింహాద్రి రిజస్టేషన్ చేయించేస్తాడు అని శంకర్ చెప్తాడు. దానికి వాళ్లు కీడు ఎంచి మేలు ఎంచమని అంటారు.. నువ్వు దుబాయి వెళ్లి సంపాదించినది అంతా నీ ఫ్రెండ్‌కే ఇస్తావు.. తోట కూడా ఆయనే కొన్నాడు.. అమ్మింది ఎవరో కూడా తెలీదు.. ఇవాళ రేపు అయిన వాళ్లనే నమ్మలేని రోజు.. అలాంటిది నీ కష్టార్జితం మొత్తం నీ ఫ్రెండ్ చేతిలో పెట్టడం కరెక్టేనా అని అడుగుతాడు. నాఫ్రెండ్‌కి మోసం చేయడం తెలీదు.. వాడు నా కోసం ప్రాణం అయినా ఇస్తాడు.. అలాంటి వాడు నా డబ్బు, ఆస్తి తీసుకుంటాడా చెప్పు అని అంటాడు. డబ్బు కోసం ఎవరైనా మారిపోతారు అని వాళ్లు అంటారు. నా ఫ్రెండ్ నాకు ఎప్పటికీ మోసం చేయడు అని శంకర్ అంటాడు. నమ్మకం ఉండొచ్చు కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు అని అనుకుంటారు.
భువన సూర్యకి ఫస్ట్ ఎయిడ్ చేసి జానుని తిడుతుంది. అమ్మా నువ్వు చిన్న చిన్న వాటికే ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్.. ఎందుకమ్మా నువ్వు అందరితో చక్కగా ఉంటావ్ తన మీద మాత్రం అంత కోపం ఎందుకు అని అడుగుతాడు. ఆ పిల్ల నాకు నచ్చలేదు.. దాని మాట ప్రవర్తన ఏం బాలేదు.. అది ఎవడిని పెళ్లి చేసుకుంటుందో కానీ వాడు వాడి ఇల్లు నాశనం అయిపోతావ్ అని భువన అంటుంది. అమ్మా జాను గురించి ఇలా ఆలోచిస్తుంది.. నేను మాత్రం జానుకి బాగా కనెక్ట్ అయిపోయా అని సూర్య అనుకుంటాడు. శారద కిచెన్‌లో టిఫెన్ చేస్తుంటే జాను తండ్రిలా మాట్లాడి టిఫెన్ తీసుకురమ్మని అంటుంది. శారద తెచ్చి చూసే సరికి అక్కడ జాను ఉంటుంది. ఇంతలో శంకర్ వచ్చి నాలా నటిస్తావా అని చెవి మెలేస్తాడు. ఇంతలో మురళీ వాళ్లు తాంబూలాలు తీసుకోవడానికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















