అన్వేషించండి

Godavari Serial Today May 16th: 'గోదావరి' సీరియల్: నందు మీద మురళీ పెంచుకున్న ప్రేమకి ఏడ్చేసిన జాను.. రేపే తాంబూలాలు! తోట కొన్నట్లు అందరికీ చెప్పేసిన శంకర్!

Godavari Serial Today may 16th: శంకర్‌ ఫ్యామిలీ మొత్తాన్ని తోటకి తీసుకెళ్లి కోటి విలువ చేసే తోట మనం కొన్నాం అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Godavari Serial Today Episode: జాహ్నవి మురళీకృష్ణని ఏడిపించడంతో మురళీ జాను చెవి మెలేస్తాడు. ఇంకెప్పుడూ అలా అనను అని చెప్పు అప్పుడు వదులుతా అని మురళీ అనడంతో జాను సరే అని చెప్తుంది. సూర్య దూరం నుంచి మొత్తం చూస్తాడు. తుఫాను సూర్యతో మీ గోదారి పిల్లని ఎవడో ఏడిపిస్తున్నాడు అని చెప్పడంతో సూర్య కోపంగా అక్కడికి వస్తాడు. సూర్య వచ్చే టైంకి జాను తెలిసిన అంకుల్ బైక్ ఎక్కి మార్కెట్‌కి వెళ్తుంది.  

సూర్య మురళీ దగ్గరకు వెళ్లి ఎవడ్రా నువ్వు అని అంటాడు. మాస్టర్ మురళీ కృష్ణ లేడీస్ టైలర్ అని అంటాడు. ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపించావ్ అని తుఫాను అంటే మీకు ఆ అమ్మాయి గురించి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని మురళీ అడుగుతాడు. ఆ అమ్మాయి మా బాబు గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని అంటాడు. మురళీ మనసులో నాకు తెలీకుండా వీడు జానుకి ఎప్పుడు క్లోజ్ అయ్యాడు అని అనుకుంటాడు. తుఫాను సూర్యతో మీరు ట్రై చేస్తున్న అమ్మాయికే వీడు కర్చీఫ్ వేస్తున్నట్లు ఉన్నాడు బాగా ఇచ్చిపడేయండి అని అంటాడు. దాంతో సూర్య మురళీతో ఇంకోసారి నువ్వు ఆ అమ్మాయిని ఏడిపిస్తే టైలర్ షాప్‌లో ఉండవు.. ఎమర్జెన్సీ వార్డ్‌లో ఉంటావ్ అని అంటాడు. ఇక జాను మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తూ బాయ్ బావ అని చెప్పి వెళ్లిపోతుంది. బావ అని సూర్య, తుఫాను నోరెళ్ల బెడతారు. ఆ అమ్మాయి మీ మరదలా అని సూర్య అడిగితే తను మీకు క్లోజ్ అని చెప్పారు కదా మరి తనకు బావ ఉన్నాడు అని చెప్పలేదా అని మురళీ అడుగుతాడు. సారీ బ్రో అని సూర్య అంటాడు. తనదీ ఈ ఊరే అని సూర్య పరిచయం చేసుకుంటాడు.  

ALSO READ: Bandi Bageerath Case: బాధితురాలు మైనర్ అని తేలితే భగీరథ్‌ను ఎవరూ కాపాడలేరు - సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే?

శంకర్ ఇంట్లో అందరినీ ఓ సీక్రెట్ ప్లేస్‌కి తీసుకెళ్తున్నా అందరికీ పెద్ద సర్‌ఫ్రైజ్ ఇస్తా అని తోటకి తీసుకెళ్లి తోట గురించి చెప్పాలి అనుకుంటాడు. ఇంతలో మురళీ అమ్మతో కలిసి ఇంటికి వస్తాడు. దాంతో అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. శారద నందుని కిచెన్‌లోకి తీసుకెళ్లి ఎన్నారై సంబంధం అని మీ నాన్నకి అత్తకి చెప్పకు.. నీకు మురళీకి పెళ్లి చేయాలి అని మీ నాన్న వచ్చాడు.. ఆకాశం మీద నడవకుండా నేల మీద నడు అని చెప్పి నందుతో అత్త బావలకు కాఫీ ఇవ్వు అని చెప్తుంది. నందు ఇద్దరికీ కాఫీ ఇస్తుంది. మురళీ నందునే చూస్తూ ఉంటాడు. తమ్ముడు మిమల్ని భోజనాలకు పిలవడానికి వచ్చా అని అంటే దానికి బామ్మ చల్లకి వచ్చి ముంత దాస్తావేంటే నీ కొడుకు పెళ్లి విషయం మాట్లాడటానికే వచ్చావు కదా అని చెప్తుంది. మీ తమ్ముడు వచ్చిందే మురళీ నందుల పెళ్లి చేయడానికి వదినా అని శారద అంటుంది. అవును అక్కా అని శంకర్ అంటాడు. దానికి ఆయన అక్క నువ్వు దుబాయ్ వెళ్లిన తర్వాత మా స్థాయి మారింది కదా.. అందుకే తెలుసుకోవడానికి వచ్చా అని అంటుంది. 

శంకర్ నవ్వుతూ మీ తమ్ముడు మారిపోతాడని ఎలా అనుకున్నావ్.. నాకు మురళీ లాంటి మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు అక్క. మురళీ తప్ప నా ఆలోచనలో మరొకరు లేరు.. రారు.. నువ్వేం ఆలోచించకు మంచి ముహూర్తం చూసి వాళ్ల పెళ్లి చేసేద్దాం నేను నీకు మాటిస్తున్నా అని అంటాడు. నందు మనసులో ముహూర్తాలు మాటివ్వడం వరకు వచ్చేశారు అంటే నేను చెప్తే ఎవరూ వినరు.. బావ వైపు నుంచి నరుక్కు రావాలి అని బావ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఇద్దరూ పక్కకి వెళ్తారు. అక్క ఏం మాట్లాడుతుందో అని జాను కూడా పక్కకి వెళ్లి చూస్తుంది. డైరెక్ట్‌గా చెప్తే హర్ట్ అయిపోతాడు అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాలి అని ఏఅమ్మాయి లో ఫ్రొఫైల్‌లో ఉండాలి అని అన్నీంటికీ అడ్జెస్ట్ అయి ఉండాలి అనుకోదు కదా బావ అని అంటుంది. నందు మురళీతో తనకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంటే జాను వచ్చి అక్కని పక్కకి తీసుకెళ్లి నువ్వు బావకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంటున్నావ్ అంతే కదా .. ఇప్పుడు చెప్తే పెద్ద ఇష్యూ అవుతుంది. నువ్వు చెప్తే ఫీలవుతాడు.. నేను చెప్తా వెళ్లు అని అంటుంది. బావకి అర్థమయ్యేలా చెప్పు అని అలకనందు మురళీతో బావ నువ్వు జాను క్లోజ్‌గా ఉంటారు కదా జాను చెప్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది. 

ALSO READ: నిండు మనసులు: వియ్యంకురాలికి మంజుల సపోర్ట్! ఇందిరను వదిలేసిన గణ.. తిరిగి రావడానికి కారణమేంటి?

మురళీ జానుతో నందు నాతో ఏదో చెప్తా అని నీకు చెప్పమని అంటుంది ఏంటి అని అడుగుతాడు. ఎదుటివాళ్ల  మాటలు కూడా అర్థం కాని అంత అమాయకంగా ఉంటే ఎలా బావ.. నువ్వు ఒకటి అనుకుంటున్నావ్.. అక్క మరొకటి అనుకుంటుంది.. అది నీకు అర్థం కావడం లేదు బావ అని అంటుంది. నేను అర్థం చేసుకోవాల్సింది ఒకటే జాను.. మా నాన్న చనిపోకముందు వరకు నా ప్రపంచం మరొలా ఉండేది.. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఆ టైలర్ షాప్‌ని నాన్న గుర్తుగా నాకు ఇచ్చింది.. నా తమ్ముడు కూతురు అలకనందే నీ పెళ్లాంరా అని చెప్పింది.. అందుకే చిన్నప్పటి నుంచి నందుని నా భార్యగా ఊహించుకున్నా.. నందు నా ముందు ఉంటే నేను కోరుకున్న ప్రపంచం నా ముందు ఉంటుంది. నందు నా ముందు ఉంటే నాకు మాటలు కూడా వినిపించవు.. మీ అక్కని నేను తప్పుగా అర్థం చేసుకున్నానా జాను అని మురళీ అంటాడు. మురళీ మాటలు, ప్రేమకి జాను కళ్లలో నీరు తిరుగుతాయి. లేదు బావ అక్క విషయంలో నువ్వేం ఫీలవుతున్నావో అదే కరెక్ట్ అని అంటుంది. మనసులో అక్కని బావ ప్రపంచం అనుకుంటున్నాడు కాబట్టి అక్కని బావ తప్ప ఇంకెవరూ బాగా చూసుకోలేరు అని అనుకుంటుంది. 

మురళీతో అత్త మీ పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా తాంబూలాలతో రాకుండా ఇలా వచ్చారేంటి.. నాన్న కూడా మీ పెళ్లి చేయడానికి వచ్చారు కదా.. రేపు మీరు డైరెక్ట్‌గా వచ్చేయండి అని అంటుంది. అదేంటి జాను మామయ్య ముహూర్తాలు అన్నారు కదా అంటే అదేం లేదు బావ పెద్ద వాళ్లు అలాగే చెప్తారు.. మీరు రేపు వచ్చేయండి అని అంటుంది. సరే అని మురళీ వెళ్లిపోతాడు. అక్కకి కూడా బావ అంటే ఇష్టమే కానీ అమెరికా మీద ఆశలు పెంచుకుంది.. పెళ్లి అయిపోతే బావ చూపించే ప్రేమకి అమెరికా ఆశలు మర్చిపోతుందని అనుకుంటుంది. భువన, సింహాద్రి శంకర్‌నారాయణ తోట దగ్గర ఉన్న వాళ్ల తోటకి వస్తారు. ఇంత మంచి తోట మీ ఫ్రెండ్‌కి కొనిపించావ్ అన్నయ్యా,, అదే నాకు చెప్పుంటే నేను కొని మంచి రిసార్ట్ కట్టుకునేదాన్ని కదా అంటుంది. నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం.. వాడి విషయంలో స్వార్థంగా ఆలోచిస్తా అని సింహాద్రి అంటాడు. 

ALSO READ: తన వల్లే సింధూ పురుగుల మందు తాగిందని అబద్ధం చెప్పిన గోపీ...ఇంటికి వచ్చినందకు గోపాల్‌పై సింధూ ఆగ్రహం

సూర్య కూడా అక్కడే ఉంటాడు. జాను వాళ్లు కూడా ఆ తోట దగ్గరకు వస్తుంటారు. సూర్యకి జాను వస్తున్నట్లు మనసుకి అనిపించి అలా గుండె పట్టుకొని ఉంటాడు. ఏమైంది బాబు అని తుఫాను అంటే మన మనసులో ఉన్నవాళ్లు మన దగ్గరకు రాబోతే మనసుకి తెలిసిపోతుంది. ఆ గోదావరి పిల్ల ఇక్కడికి రాబోతుందని నా మనసు చెప్తుందని అంటాడు. నందు వాళ్లు తోటలోకి వచ్చి మనం కూడా ఇలాంటి తోట కొనుక్కుందాం అని అంటే ఏంటి కొనేది ఇది ఒక కోటి రూపాయలు ఉంటుందని గౌతమి అంటుంది. శంకర్ ఫ్యామిలీ మొత్తం అది సింహాద్రి తోటే అని అనుకుంటారు. సూర్య జానుని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. సింహాద్రి శంకర్ వాళ్ల దగ్గరకు వచ్చి తోట నచ్చిందా అని అడుగుతాడు. మీ అందరికీ చెప్పిన సర్‌ఫ్రైజ్ అని చెప్పా కదా అదేంటో కాదు ఈ తోటని మనం కొన్నాం అని అంటాడు. అందరూ షాక్ అయి చాలా సంతోషపడతారు. తర్వాత ఊరి వాళ్లు శంకర్‌తో తోట కొన్నావ్,., దుబాయి నుంచి సంపాదించిన డబ్బు మొత్తం నీ ఫ్రెండ్‌కే ఇచ్చావ్ ఈ రోజుల్లో అయిన వాళ్లే మోసం చేస్తున్నారు.. మరి మీ ఫ్రెండ్‌ని ఎలా నమ్ముతున్నావ్ అని అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 17th: నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
నిండు మనసులు: ఓరేయ్ వెధవా.. ఇంత మోసం చేస్తావా..! ఒకే సాసర్‌లో ఇద్దరూ.. సో రొమాంటిక్!
Podarillu Serial Today June 17th: బాధతో బార్‌కు వెళ్లి మందు ఆర్డరిచ్చిన చక్రి...అక్కడ ఏం జరిగింది..? మందు తాగాడా లేదా..?
పొదరిల్లు: బాధతో బార్‌కు వెళ్లి మందు ఆర్డరిచ్చిన చక్రి...అక్కడ ఏం జరిగింది..? మందు తాగాడా లేదా..?
Nuvvu leka Neanu Lenu Serial Today June 17th: రాధను ఫంక్షన్‌కు తీసుకెళ్లకుండా విక్కీ ఎక్కడికి వెళ్లాడు..భర్తను నిలదీస్తే రాధకు తెలిసిన నిజం ఏంటి..?
నువ్వులేక నేను లేను: రాధను ఫంక్షన్‌కు తీసుకెళ్లకుండా విక్కీ ఎక్కడికి వెళ్లాడు..భర్తను నిలదీస్తే రాధకు తెలిసిన నిజం ఏంటి..?
Brahmamudi Serial Today June 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ నుంచి నిజం తెలుసుకోవాలనుకున్న ఐశ్వర్య – వెంకట్‌ ను అనుమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ నుంచి నిజం తెలుసుకోవాలనుకున్న ఐశ్వర్య – వెంకట్‌ ను అనుమానించిన చలపతి
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Embed widget