ఆమె 'గోదావరి' సీరియల్‌లో అలకానంద అలియాస్ నందు పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె మంచి ఆదరణ పొందుతోంది.
Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
Ghanta Mounica: గోదావరి సీరియల్‌లో అలకనందగా అలరిస్తుంది మౌనిక. ఆమె వ్యక్తిగత జీవితం, కెరీర్, రెమ్యూనిరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

- గంటా మౌనిక 'గోదావరి' సీరియల్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
- బీటెక్ పూర్తిచేసిన మౌనిక రీల్స్‌తో బుల్లితెరపై అవకాశాలు దక్కించుకుంది.
- లక్షల్లో ఫాలోవర్లు, రోజుకు వేలల్లో పారితోషికంతో ఆమె సంపాదన.
Ghanta Mounica: తెలుగు బుల్లితెర నటీమణులలో గంటా మౌనిక.. తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. 'గోదావరి' సీరియల్‌లో అలకానంద అలియాస్ నందుగా మౌనిక అలరిస్తుంది. మౌనికకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. గంటా మౌనిక కెరీర్, చదువు, రెమ్యూనిరేషన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
గంటా మౌనిక నిజ జీవితానికి తెరపై పాత్రకు దాదాపుగా ఎలాంటి పోలిక లేదు. బీటెక్ చేసిన ఆమె ఎంతో అమాయకంగా, సులభంగా మోసపోయే యువతిగా సీరియల్స్ నటించింది. తెర వెనుక, మౌనిక చాలా ఉత్సాహంగా, ధైర్యవంతురాలైన వ్యక్తి. జెమిని టెలివిజన్‌లో 2023లో స్టార్ట్ అయిన 'స్రవంతి' అనే డైలీ సీరియల్‌తో కెరీర్ ప్రారంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన 'గంగోత్రి' సీరియల్‌లో నటనలో మరో మెట్టు ఎక్కింది.
వ్యక్తిగత విషయాలు
గంటా మౌనిక ఏపీకి చెందిన అమ్మాయి. 2020లో బీ.టెక్ పట్టా పొందారు. గతంలో హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో పనిచేసింది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు నటన, డ్యాన్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేవి. కాలేజీ రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకుని సెలబ్రిటీగా మారింది.
Also Read: కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!
సీరియల్స్
మౌనిక మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించింది. ఆ పాపులారిటీతో బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. తెలుగులోని ప్రముఖ ఛానల్స్ స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే లుక్స్, సహజమైన నటనతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలైనా, పాజిటివ్ పాత్రలైనా చక్కగా పండించగలరని పేరు తెచ్చుకుంది.
Also Read: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
సోషల్ మీడియా ఫాలోయింగ్
ఇన్‌స్టాగ్రామ్(_mounicaa_21)లో మౌనికకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. నిరంతరం ట్రెండింగ్ సాంగ్స్‌కు రీల్స్ చేయడం, ట్రెడిషనల్ అండ్ మోడరన్ అవుట్‌ఫిట్స్‌లో ఫొటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. యూట్యూబ్‌లో కూడా హోమ్ టూర్స్, వ్లాగ్స్, బ్యూటీ టిప్స్ వంటి వీడియోలతో మౌనిక యాక్టివ్‌గా ఉంటుంది.
రెమ్యూనిరేషన్
సాధారణంగా బుల్లితెరపై క్రేజ్ ఉన్న హీరోయిన్లకు రోజువారీ పారితోషికం ఇస్తారు. మౌనిక సీరియల్‌లో తన పాత్ర ప్రాధాన్యతను బట్టి రోజుకు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు ఛార్జ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్. కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా, ఆమెకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్ల పలు బ్రాండ్స్, శారీస్, జ్యువెలరీ షాప్స్ ప్రమోషన్స్ చేస్తారు. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లేదా రీల్ ప్రమోషన్‌కు బ్రాండ్‌ను బట్టి వేలల్లో తీసుకుంటారని ప్రచారం.
Also Read: 'నిండు మనసులు' సీరియల్ సిద్ధు గురించి ఈ విషయాలు తెలుసా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
ఘంటా మౌనిక ఏ సీరియల్‌లో నటిస్తోంది?
మౌనిక విద్యాభ్యాసం, మునుపటి వృత్తి ఏమిటి?
ఆమె బీ.టెక్ పట్టా పొందారు. గతంలో హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో పనిచేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు నటన, డ్యాన్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేవి.
ఘంటా మౌనిక నటన రంగంలోకి ఎలా ప్రవేశించారు?
కాలేజీ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ ద్వారా పాపులర్ అయ్యింది. జెమిని టెలివిజన్‌లో 2023లో ప్రారంభమైన 'స్రవంతి' సీరియల్‌తో ఆమె కెరీర్ మొదలైంది.
ఘంటా మౌనిక సీరియల్స్‌కు రోజువారీ పారితోషికం ఎంత?
ఆమె సీరియల్‌లో తన పాత్ర ప్రాధాన్యతను బట్టి రోజుకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు ఛార్జ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా కూడా ఆమె సంపాదిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు






















