Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర మొక్క తీరుకోవడానికి వెళ్లడంతో తమ ప్లాన్ పక్కాగా అమలు చేయడానికి ఇదే మంచి టైం అని వాసుకి బాలకి సైగ చేసి పానకం ఇస్తానని బయటకు పిలుస్తుంది. బాల పూజ దగ్గర నుంచి వాసుకి దగ్గరకు వెళ్తాడు. బాలకు గతం గుర్తు రావాలని త్రిపుర మొక్కుకొని 108 కొబ్బరి కాయలు కొట్టే కార్యక్రమం చేస్తుంది.
పానకం ప్లాన్ ఫలిస్తుందా..
వాసుకి బాలని తీసుకొచ్చి ఓ చోట కూర్చొపెడుతుంది. ఫణి అక్కడికి వస్తాడు. పానకం గురించి బాల అడిగితే కొంచెం సేపు ఆగమని బాల కోసం స్పెషల్ పానకం వస్తుందని అంటుంది. ఇంకా పూజ అవ్వలేదు పానకం ఇవ్వడం లేదు కానీ నేను నీ కోసం పానకం తీసుకొస్తున్నా అని చెప్పి వాసుకి చెప్తుంది. ఓ అమ్మాయి పానకం తీసుకొస్తుంది. ఆ పానకంలో వాసుకి విరుగుడు మందు కలిపేస్తుంది. బాల పానకం తాగుతుంటే కాస్త దూరంలో త్రిపుర కొడుతున్న కొబ్బరి కాయ వచ్చి తగిలి పానకం పడిపోతుంది. ఇంతలో యశోద పిలవడంతో బాల వెళ్లిపోతాడు.
తల్లీకొడుకుల మాటలు వినేసిన రమాదేవి..
వాసుకి, ఫణి ఇద్దరూ ప్లాన్ ఫెయిల్ అయిందని మాట్లాడుతూ ఉంటే రమాదేవి వినేస్తుంది. ఇక కెమెరా పెన్ గురించి అడుగుతుంది. త్రిపుర ఇంట్లో మొత్తం వెతికినా దొరకలేదని ఫణి చెప్పడంతో రమాదేవి షాక్ అయిపోతుంది. ఎలా అయినా ఆ పెన్ దక్కించుకుంటానని ఫణి అంటాడు.
అనంత్ పర్స్‌లో గాయత్రీ ఫొటో..
బాలకు అనంత్ పర్స్ దొరుకుతుంది. కాసేపు దాచేసి అనంత్‌ని ఏడిపిస్తా అనుకొని బయటకు వెళ్తాడు. అనంత్ పర్స్‌లో గాయత్రీ ఫొటో చూస్తాడు. బాల అటూ ఇటూ చూస్తాడు. అనంత్ పర్స్‌లో గాయత్రీ ఉందేంటి అనుకుంటాడు. చెప్తా అని అక్కడికి వెళ్తాడు. త్రిపురకి విషయం చెప్పాలని అనుకుంటే త్రిపుర బాలకి సైలెంట్‌గా ఉండి పూజ చూడమని అంటుంది.
అమ్మా అది వచ్చేసిందే ఇప్పుడెలా..
ఊర్వశి తల్లితో అమ్మా అది వచ్చేసింది ఇప్పుడెలా అని అంటుంది. దానికి రమాదేవి ఎలా అయినా నీ పెళ్లి నేను చేస్తానని అంటుంది. పంతులు కంకణాలు కట్టుకోవాలని చెప్తారు. కాబోయే జంట కూడా కంకణాలు కట్టుకోమని చెప్తారు. అందరికీ కంకణాలు పంచుతారు. తల్లీకూతుళ్లు చాలా టెన్షన్ పడతారు. అనంత్‌కి పంతులు కంకణం ఇచ్చి ఊర్వశికి ఇస్తారు. గాయత్రీ, అనంత్‌లు షాక్ అవుతారు.
అనంత్ ప్రేమించింది గాయత్రీని ఊర్వశిని కాదు..
బాల అది చూసి పంతులుగారు కంకణం అక్కడ కాదు గాయత్రీకి ఇవ్వమని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. బామ్మ బాలతో తప్పు నాన్న అలా అనకూడదు అంటే బాల బామ్మతో అనంత్ ప్రేమించింది గాయత్రీని ఊర్వశిని కాదు అని బాల చెప్తాడు. అందరూ షాక్ అయి లేచి నిల్చొంటారు. బాల సాక్ష్యంగా అనంత్ పర్స్‌లో గాయత్రీ ఫొటోని చూపిస్తాడు. అనంత్ అందరితో నేను ప్రేమించింది గాయత్రీని గాయత్రీ కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్తాడు. త్రిపుర గాయత్రీతో అనంత్ చెప్పింది నిజమా అని అడుగుతుంది. గాయత్రీ అవును అని రామ గిరిలో ఉన్నప్పుడు నుంచే ప్రేమించుకుంటున్నామని అంటుంది.
అక్కాచెల్లెళ్ల మీద రమాదేవి తిరుగుబాటు..
అక్కాచెల్లెళ్లు బాగా నటించారని రమాదేవి త్రిపురని తిడుతుంది. నా కూతురు అనంత్‌ని ప్రేమిస్తే ఇప్పుడు భలే ప్లేట్ తిప్పేస్తున్నావ్ అని అంటుంది. అనంత్ రమాదేవితో ఆంటీ నేను గాయత్రీనే ప్రేమించానని అంటాడు. త్రిపుర చెల్లి గాయత్రీ కదా అని అంటాడు. త్రిపుర అనంత్‌తో ఉగాది రోజు మీరు ఊర్వశితో మాట్లాడారు కదా అంటే నేను గాయత్రీతోనే మాట్లాడాను అంటుంది. తాను చాలా సార్లు గాయత్రీ కోసమే ఇంటికి వచ్చానని అంటాడు. ల్యాప్ టాప్ కొనిచ్చావ్ కదా అని రమాదేవి అంటే నా వల్ల ల్యాప్టాప్ పోయిందని ఊర్వశి గోల చేస్తే కొనిచ్చానని అంటాడు.
అనంత్, గాయత్రీలకు పెళ్లి చేద్దాం..
బాల బామ్మతో అనంత్ నిజాలే చేప్తాడు. అనంత్ గాయత్రీలకు పెళ్లి చేద్దామని బాల అంటాడు. దానికి రమాదేవి మరి నా కూతురు ఏమైపోవాలి అని అడుగుతుంది. మీ బామ్మ గారు ఇచ్చిన మాట ఏంటి అని అడుగుతుంది. తన కూతురి పరిస్థితి ఏంటి అని ఏడుపు అందుకుంటుంది. నా కూతురికి మంచి సంబంధం దొరికిందని అల్లుడికి మందు పెట్టి ఇలా మాట్లాడిస్తున్నారు కదా అని రమాదేవి త్రిపురని తిడుతుంది. త్రిపురని తిడుతుంటే బాల అడ్డుకుంటాడు. నా సుందరి చాలా మంచిదని అంటాడు.
మీరే అత్యాశతో ఇలా చేశారు..
మేం నిజంగా ప్రేమించుకున్నాం మీరే అత్యాశతో ఇలా చేశారని గాయత్రీ అంటుంది. ఇద్దరి ఆడపిల్లల జీవితం ఏం చేయాలి అని బామ్మ అంటుంది. రమాదేవి పెద్దావిడ చేతులు పట్టుకొని తన కూతురికి అన్యాయం చేయొద్దని అంటుంది. అమ్మ లేకపోయినా మిమల్ని బాగా చూసుకున్నా సరే నా కూతురి మీద కుళ్లుతో అల్లుడిని ట్రాప్ చేశారని అంటుంది. త్రిపుర, గాయత్రీ ఇద్దరినీ తిడుతుంది. బాల రమాదేవిని కామ్‌గా ఉండమని అంటాడు. రమాదేవి ఊర్వశిని తీసుకెళ్లి మీరు మీ మాటకు కట్టుబడి ఉండండి అని చెప్తుంది. మాట నిలబెట్టుకోండి అని చెప్పి ఊర్వశిని తీసుకెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?