Ennallo Vechina Hrudayam Serial Today Episode గిరి మారిపోయాడని గిరిని పెళ్లి చేసుకోమని రమాప్రభ త్రిపురతో చెప్తారు. పెద్దాయన కూడా నీ ఇష్టమే అనడం పక్షవాతం వచ్చిన రత్నమాల త్రిపురని ప్రాధేయపడటంతో త్రిపుర పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. గిరి పంతులుతో మాట్లాడి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పారని గిరి చెప్తాడు. అందరూ రేపే పెళ్లి చేసేద్దామని  అనుకుంటారు. డబ్బులు లాయర్‌కి ఇచ్చి వస్తానని పెద్దాయన వెళ్తారు. 

బాలా ఇంట్లో ఉన్న బంగారం డబ్బు తీసుకొని తన సుందరికి సాయం చేయాలి అని అన్నీ ఓ బ్యాగ్‌లో పెట్టుకొని సైకిల్ మీద వెళ్తాడు. పని మినిషి అది చూసి ఇంత ఉదయం బాలు బాబు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటుంది. ఇక త్రిపురని రమాప్రభ, ఊర్వశి పెళ్లి కూతురిలా తయారు చేస్తారు. గిరి పెళ్లి కొడుకులా తయారవుతాడు. గిరి తన మనిషితో నేను పూర్తిగా మారిపోయాను కాబట్టే నా త్రిపుర నాకు దక్కిందని అనుకుంటాడు. కొంచెం టైం ఉండుంటే పెళ్లి టిప్పు టాప్‌గా చేసేవాళ్లం అన్నా అని అంటే త్రిపురని బంగారంలా చూసుకుంటా అదే చాలు అని గిరి అంటాడు. 

పెద్దాయన త్రిపుర దగ్గరకు వెళ్లి గిరి మారిపోవడం నీకు ఇలా పెళ్లి అవడం సంతోషంగా ఉంది అంటారు. త్రిపుర, పెద్దాయన గాయత్రీకి విషయం చెప్పాలి అనుకుంటే రమాప్రభ వద్దని అంటుంది. గాయత్రీ నమ్మదు అని గాయత్రీ నోటి కొచ్చినట్లు అంటుంది గాయత్రీ ఏమైనా అంటే రత్నామాల ప్రాణాలు పోతాయని తర్వాత తీరికగా వెళ్లి చెప్దాం అంటుంది. పెద్దాయన సరే అంటారు. గిరి రెడీ అయ్యాడో లేడో చూస్తానని రమాప్రభ వెళ్తే వెనకాలే ఊర్వశి వెళ్లి ఏం చేస్తున్నావ్ అమ్మ నువ్వు త్రిపుర పెళ్లికి పెద్ద దిక్కు నువ్వే అన్నట్లు ప్రవర్తిస్తున్నావేంటి నీ కూతురిని అంత అన్యాయం జరిగింది అది మర్చిపోయావా అంటుంది. 

రమాప్రభ ఊర్వశితో త్రిపుర మనకు చేసిన దానికి కౌంటరే ఇది అని అంటుంది. నీకు అర్థమయ్యేలా చెప్తానని ఫ్లాష్ బ్యాగ్ చెప్తుంది. రమాప్రభ గిరికి ఫోన్ చేసి మీ గంగ అత్తకి రెండు రోజుల్లో ఉరి శిక్ష వేస్తారు. ఇప్పుడు మీ త్రిపురకు డబ్బు చాలా అవసరం ఏం చెప్పినా చేస్తుంది జాగ్రత్తగా దాన్ని నీ దారిలోకి తెచ్చుకో అని అంటుంది. దాంతో గిరి మారిపోయినట్లు నటిస్తాడు. ఇక రత్నమాల పక్షవాతం గురించి ఊర్వశి అడిగితే ఎదుటి వాళ్లకి పక్షవాతం వచ్చినట్లు చేస్తుంది కానీ తనకి పక్షవాతం ఏంటే అని అంటుంది. నా పగ చల్లారి అంటే త్రిపుర గిరిని పెళ్లి చేసుకొని నరకం అనుభవించాలి అక్కడ గాయత్రీని నాగభూషణం వాళ్లతో కలిసి నరకం  చూపిస్తాం అప్పుడే నా పగ చల్లారుతుందని రమాప్రభ చెప్తుంది. 

యశోద గదిలోకి వెళ్లి నగలు, డబ్బులు లేకపోవడం గుర్తించి అందరికీ విషయం చెప్తుంది. అందరూ నోరెళ్ల బెడతారు. ఇంతలో అనంత్ వచ్చి అన్నయ్య కూడా ఊరిలో లేడు అని చెప్తాడు. పని మనిషి వచ్చి బ్యాగ్‌తో సైకిల్ మీద వెళ్లాడని చెప్తుంది. అందరూ కంగారు పడతారు. వాసుకి మాత్రం బాల బ్యాగ్ తీసుకొని వెళ్తాడు అంటే బాల సుందరి అయిన త్రిపుర డబ్బు తీసుకొని రమ్మంటే తీసుకొని వెళ్లుంటాడని అంటుంది. మేం అలాంటి పని ఎప్పటికీ చేయమని గాయత్రీ అంటుంది. బాల మీ అక్క మాట మాత్రమే వింటాడు కాబట్టి డబ్బూ బంగారం తీసుకురమ్మని చెప్పుంటుందని నాగభూషణం అంటాడు. మా అక్క తెమ్మని చెప్పుంటుందని నిరూపించి ఏమైనా చేయండి అంటుంది. 

బాల కోసం వెతకడానికి బయల్దేరుతారు. వాసుకి వాళ్లు త్రిపుర ఇంటికి వెళ్లమని అంటారు. గాయత్రీ సరే వెళ్దాం పదండి అని అంటుంది. బాల డబ్బులు తీసుకొని త్రిపుర ఇంటికి వెళ్తాడు. నాటకాల వాళ్లకి సుందరి గురించి అడుగుతాడు. నా సుందరి కోసం డబ్బులు నగలు తీసుకొచ్చానని వాటిని చూపిస్తాడు. తనకు చాలా అవసరం అంట తనకు ఇవ్వాలి అంటాడు. ఇలా డబ్బు, నగలు బయటకు చూపించకూడదు అని చెప్తారు. త్రిపుర రామగిరి వెళ్లిందని చెప్తారు. అక్కడికి వెళ్లి ఇస్తానని బాల అంటాడు. 

గిరిని తాతయ్య దగ్గరుండి పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. త్రిపురని ముస్తాబు చేసి పీటల మీదకు తీసుకొచ్చి గిరి పక్కన కూర్చొపెడతారు. రత్నామాల, రమాప్రభ సైగలు చేసుకుంటారు. గిరి త్రిపుర తనని చూసేటప్పుడు బుద్ధిమంతుడిలా ఉంటాడు. మా అమ్మ కోసం పెళ్లికి ఒప్పుకున్నావ్ కదా తిప్పు నీ రుణం తీర్చుకుంటానని అంటాడు. మనసులో ఈ పెళ్లి అయిన తర్వాత నిన్ను ఎలా బానిసను చేసుకుంటానో నీకు తెలీదు అనుకుంటాడు.  రత్నమాల మనసులో కాసేపట్లో అది నీ చేతికి చిక్కుతుందిరా తాళి కట్టిన తర్వాత మీ అందరికీ నా విశ్వరూపం చూపిప్తా అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!