Ennallo Vechina Hrudayam Serial Today Episode యశోద గాయత్రీ చేతికి కట్టు కడుతూ నీ కోపం నీ కోపం వెనక బాధ కూడా నాకు అర్థమైంది.. ఈ ఇంటి కోడలిగా వచ్చావు అంటే ఈ ఇంటి బాధ్యతలే కాదు ఇంటి పరువు బాధ్యతలు కూడా నీవే అమ్మ ఎవరికీ ఒక మాట అనే అవకాశం ఇవ్వకూడదు. ఆప పిల్లకి కోపం శాపం అమ్మ ఇదంతా నేను నీకు ఓ అమ్మలా చెప్తున్నా అర్థం చేసుకో అని చెప్పి యశోద వెళ్లిపోతుంది.
బ్యాగులు సర్దేసిన తల్లీకూతుళ్లు..
రమాప్రభ, ఊర్వశిలు బ్యాగ్‌లు రెడీ చేసి వెళ్లిపోవడానికి బయటకు వస్తారు. పెద్దాయన చూసి చూడనట్లు వదిలేస్తారు. త్రిపుర ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇక్కడ మాకేం పరువు మిగిలింది ఉండటానికి అని రమాప్రభ అంటుంది. దానికి పెద్దాయన పరువు అని ఒకటి ఉంటుందని నీకు తెలుసా రమాప్రభ అని అంటారు. దానికి రమాప్రభ మీరు మీ మనవరాలిని పెద్దింటికి కోడలు చేశారు నా కూతురు అన్యాయం అయిపోయింది అంటుంది. దానికి పెద్దాయన ఇది కలి కాలం ఎప్పటి ఖర్మ అప్పుడే అనుభవించాలి అంటారు. రమాప్రభ త్రిపురతో పీటల మీద నుంచి నా కూతురిని గెంటేశావ్ ఇప్పుడు నీ ఇంట్లో నుంచి మమల్ని గెంటేయవు అని గ్యారెంటీ ఏంటి అని అంటుంది. దాంతో పెద్దాయన మంచి నిర్ణయం తీసుకున్నావ్ వెళ్లిపోండి అంటారు. త్రిపుర ఆపుతుంది. ఊర్వశికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అంటుంది. వెళ్లే వాళ్లని ఆపొద్దని పెద్దాయన అంటారు.
లక్షలు కట్టకపోతే మరణ శిక్షే..
ఇంతలో లాయర్ ఇంటికి వస్తారు. మనం మీ అమ్మని విడిపించడానికి 30 లక్షలు కట్టి విడిపించడానికి స్టే తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఆ స్టే గవర్నమెంట్ కొట్టేసిందని వెంటనే ఆ డబ్బు కడితే మీ అమ్మని విడిపించుకోవచ్చు లేదంటే మీ అమ్మకి మరణ శిక్ష వేస్తారని అంటారు. త్రిపుర, పెద్దాయన షాక్ అయిపోతారు. ఊర్వశి, రమాప్రభ నవ్వుకుంటారు. త్రిపుర కుప్పకూలిపోతుంది. ఒక్క సారి మీ అమ్మతో మాట్లాడించమని లాయర్‌ని వేడుకుంటుంది.
నీకు ఉరి తీస్తారు..
జైలులో ఉన్న గంగ అక్కడ లాయర్‌ని నన్ను ఎప్పుడు విడుదల చేస్తారు నాదేశం వెళ్లిపోవాలి నా పిల్లలకు పెళ్లి చేయాలి అంటుంది. దాంతో లాయర్ గంగతో నిన్ను విడిపించడం కుదరదు. నీలా నకిలీ పాస్ పోర్ట్ మీద వచ్చిన వాళ్లని ఉరి తీయాలని ఇక్కడి గవర్నమెంట్ నిర్ణయించిందని చెప్తారు. గంగ షాక్ అయి ఏడుస్తుంది. త్రిపుర బాల ఇంటికి వెళ్తుంది. లాయర్ కాల్ చేసి గల్ఫ్ జైలర్‌తో మాట్లాడా ఆయన ఎప్పుడైనా కాల్ చేస్తారు మాట్లాడు అని అంటారు. త్రిపుర గాయత్రీకి విషయం తెలీకూడదని అనుకుంటుంది.
నేను నిన్ను విడిపిస్తానమ్మా..
త్రిపురకు గల్ఫ్ నుంచి కాల్ వస్తుంది. తల్లినిచూసి త్రిపుర ఏడుస్తుంది. గంగ కూడా ఏడుస్తుంది. త్రిపుర ఫోన్‌లో మాట్లాడటం బాల చూస్తాడు. త్రిపుర తల్లికి ధైర్యం చెప్తుంది నేను విడిపిస్తా అని అంటుంది. రెండు రోజుల్లో ఎలా విడిపిస్తావమ్మా అని గంగ చెప్పి నా గురించి మీరు కష్టాల పాలు కావొద్దు నన్ను ఇలా వదిలేయండి అంటుంది. 30 లక్షలు నేను ఏర్పాటు చేస్తాను అని త్రిపుర అంటుంది. త్రిపుర మాటలు బాలతో పాటు గాయత్రీ కూడా వింటుంది. గాయత్రీ షాక్ అయిపోతుంది. సుందరి వాళ్ల అమ్మ ఎక్కడో జైలులో ఉన్నారను అనుకుంటా అని బాల అనుకుంటాడు. 30 లక్షలు కావాలంట అని పాపం అనుకుంటాడు.
త్రిపురని ప్రశ్నించిన గాయత్రీ..
గాయత్రీ అక్క దగ్గరకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుతుంది. తెలిసిన వాళ్లు అని త్రిపుర అంటుంది. నీ కళ్లు ఎర్రగా ఉన్నాయ్ ఎందుకు ఏమైందని అని అడుగుతుంది. త్రిపుర గాయత్రీ దగ్గర నిజం దాస్తుంది. త్రిపుర గుడికి వెళ్లి సాయం చేయమని వేడుకుంటుంది. ఇంతలో అక్కడ స్వామీజీలా ఉన్న తన బావ గిరిని త్రిపుర చూస్తుంది. గిరి కూడా త్రిపురని చూసి నా ఆలోచనలు నా బుద్ధి నా ఈ స్థితికి కారణం అని నేను చాలా తప్పులు చేశాను నన్ను క్షమించు త్రిపుర అంటాడు. కన్నీరు పెట్టుకుంటాడు. నా మీద నమ్మకం కుదరడం లేదు కదా నా గతం అంత నీచమైనది అందుకే నువ్వు నమ్మడం లేదని అంటాడు. తనకు యాక్సిడెంట్ అయిందని చావు వరకు వెళ్లడం వల్ల చేసిన పాపం తెలిసిందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!