Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఎవరికీ తెలీకుండా జాను, వివేక్‌ల పెళ్లి జరగడం తనకు ఇష్టం లేదని లక్ష్మీ అంటుంది. మరోవైపు ఇంటిళ్లపాది లక్ష్మీకి సపోర్ట్ చేస్తున్నారని దొంగతనంగా తన చెల్లిని నీ కోడలిని చేయాలనుకుంటుందని మనీషా దేవయానికి నూరిపోస్తుంది. మరోవైపు అందరూ లక్ష్మీని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పెళ్లి జరగకపోతే మరెప్పుడూ జరగదని అంటారు. చిన్నత్తయ్యకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగితే ఆవిడ వల్ల జాను జీవితాంతం ఇబ్బంది పడుతుందని లక్ష్మీ పెళ్లికి ఒప్పుకోదు. మిత్ర జానుని బాగా చూసుకుంటాడని అందరూ భరోసా ఇస్తారు.
ఎవరు ఎన్ని చెప్పినా లక్ష్మీ మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను అని దేవయానికి ద్రోహం చేయనని అంటుంది. మరోవైపు దేవయాని ఆ లక్ష్మీ తనకే ద్రోహం చేస్తుందా అనుకొని పెళ్లి జరగకుండా చేస్తానని అంటుంది. ఇక లక్ష్మీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని ఇప్పుడే జానుని ఇంటికి తీసుకెళ్లిపోతానని అంటుంది. మరోవైపు దేవయాని కూడా ఈ పెళ్లిని ఆపేస్తా నని వివేక్‌ని ఇంటికి తీసుకెళ్లి పోతానని అంటుంది. ఆ మాటలు వివేక్ వినేసి పరుగులు తీస్తాడు. మరోవైపు లక్ష్మీ పరుగులు తీస్తుంటే లక్ష్మీని ఆపడానికి ఆమె వెనక మిత్రతో పాటు అందరూ పరుగులు తీస్తారు.
దేవయాని మనీషాలు కూడా పరుగులు పెడతారు. పంతులు పెళ్లికి అన్నీ సిద్ధం చేస్తుంటే జాను మరో చోట దేవుడికి దండం పెట్టుకుంటుంది. సంజన తాళి తీసుకెళ్లి పరుగున వివేక్‌కి అందిస్తుంది. వివేక్ తాళి తీసుకొని పరుగులు పెడుతూ జాను దగ్గరకు వెళ్తాడు. అమ్మవారికి దండం పెడుతున్న జానుని పిలిచి తాను తేరుకునే లోపు హడావుడిగా తాళి కట్టేస్తాడు. అదంతా చూసిన పంతులు హోమంలో మంట పెట్టి మంత్రాలు చదువుతాడు. అందరూ అక్కడికి చేరుకునే సరికి వివేక్ జాను మెడలో తాళి కట్టేస్తాడు. జాను తాళి చూసి షాక్ అయిపోతుంది. మిత్ర వాళ్లు సంతోషించగా దేవయాని, మనీషా, లక్ష్మీలు షాక్ అయిపోతారు.
దేవయాని: ఎంత పని చేశావ్ రా. నేను చెప్తున్నా వినకుండా దీని మెడలో ఎందుకు తాళి కట్టావ్‌రా.
వివేక్: నాకు వేరే దారి లేదమ్మా. నేను ఇంకా లేట్ చేస్తే నువ్వు జానుని ఏమైనా చేస్తావ్. లేదంటే నాకు వేరే పెళ్లి చేస్తావ్ అందుకే తన మెడలో తాళి కట్టేసా. ఇప్పుడు నువ్వు తనని ఏం చేయలేవ్.
లక్ష్మీ: తప్పు చేశావ్ వివేక్ చాలా పెద్ద తప్పు చేశావ్ నువ్వు ఇలా చేస్తావని ముందే ఊహించి ఉంటే అసలు జానుని తెచ్చేదాన్ని కాదు.
మనీషా: ఆపు నీ నాటకాలు ఈ పెళ్లి ప్లాన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు..
అరవింద: లక్ష్మీకి ఏం తెలీదు మనీషా..
దేవయాని: అంటే మీకు తెలుసా అక్క.
జయదేవ్: మేం సాయం చేశాం అంతే.
సంజన: అవును అమ్మ ఇందులో ఎవరికీ సంబంధం లేదు నేను అన్నయ్యనే ఇలా చేశాం.
దేవయాని: నోర్ముయ్ అని సంజనను కొడుతుంది. లక్ష్మీతో చేతులు కలిపి నాతోనే నాటకాలు ఆడుతున్నారా.. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఈ దరిద్రాన్ని నాకు కోడలిని చేశారు.
మనీషా: ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ అంతా నువ్వే లక్ష్మీ.
మిత్ర: ఇందులో తన ఇన్వాల్వ్ మెంట్ ఏం లేదు మనీషా తనకి ఇప్పుడే తెలిసింది అందుకే పరుగున వచ్చింది.
తనకు సంబంధం లేదు అని లక్ష్మీ ఎంత చెప్పినా మనీషా, దేవయాని వినరు. నిన్ను ఎప్పటికీ క్షమించనని దేవయాని అంటుంది. వదినకు ఏం తెలీదని నేను సంజన ఇదంతా చేశామని వివేక్ అంటాడు. దానికి దేవయాని నా కడుపున మీ ఇద్దరూ చెడపుట్టారని తిడుతుంది. దేవయానికి అరవింద ఓదార్చి ఆశీర్వదించమని అంటే దేవయాని ఒప్పుకోదు. కోడలు నాకు ఇష్టం లేదని అంటుంది. జానుతో వివేక్ సంతోషంగా ఉంటాడని మిత్ర చెప్తే మనీషాతో నువ్వు ఆనందంగా ఉంటావ్ కదా కానీ ఎందుకు లక్ష్మీని వదిలేసి మనీషాని చేసుకోలేదని అడుగుతుంది. ఎవరి ఇబ్బందులు వాళ్లకి ఉంటాయని అంటుంది. వివేక్, సంజనలతో మీరు నా పిల్లలు కాదు నా శత్రువులు అని అంటుంది. దానికి వివేక్ అవునమ్మా నీ కడుపున పుట్టినందుకు మేం కూడా బాధ పడుతున్నాం అని అంటాడు. ఆ మాటలకు దేవయాని షాక్ అయిపోతుంది. జాను ఇంట్లో కోడలిగా అడుగుపెడితే తాను పెట్రోల్ వేసుకొని చనిపోతా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ పెళ్లితో జాను సుఖపడుతుందా చిన్నత్తయ్యతో జీవితాంతం నరకం చూస్తుందని లక్ష్మీ ఏడుస్తుంది. నా చెల్లి జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తుంది. జాను కూడా ఏడుస్తుంది. జానుని బాగా చూసుకుంటానని వివేక్ అంటాడు. అందరూ లక్ష్మీని ఓదార్చుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: దీపక్ ఇద్దరి పెళ్లాల కొట్లాట.. కారులో రాజు, రూపలను సూర్యప్రతాప్ చూసేస్తాడా!