Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ ఇంజనీర్‌తో మాట్లాడుతుంటుంది. మనీషా వచ్చి బైనాక్యూలర్‌లో లక్ష్మీ ఉన్న పరిసరాలు చూసి లక్ష్మీకి ఏం కాకపోవడంతో సరయుకి కాల్ చేస్తుంది. మనీషా సరయుకి కాల్ చేస్తుంది. లక్ష్మీకి ఇంకా ఏం కాలేదు ఎందుకని అంటుంది. దానికి సరయు ఒకసారి ప్రయత్నించా తప్పించుకుంది మరోసారి ప్రయత్నిస్తానని చెప్తుంది. లక్ష్మీ మీద రాళ్లు పడేలా చేస్తానని చెప్తుంది. అలా చేస్తే లక్ష్మీ చచ్చిపోతుందని అలా అయితే మిత్రకు కూడా ప్రమాదమని ఈ ప్లాన్ ఇక్కడే ఆపేయ్ అని చెప్తుంది. సరయు మాత్రం మాట వినకుండా ఫోన్ కట్ చేసేస్తుంది.
సరయు లక్ష్మీ కచ్చితంగా చనిపోవాలని డ్రైవర్‌కి చెప్తుంది. మిత్ర కూడా అక్కడ ఉన్నాడు మిత్రకి ఏమైనా జరిగితే అని మనీషా పరుగులు తీస్తుంది. లక్ష్మీ కూడా మిత్రని చూస్తుంది. డ్రైవర్‌ని సరయు కంగారు పెడుతుంది. మిత్ర కోసం ఒకవైపు నుంచి మనీషా, మరోవైపు లక్ష్మీలు పరుగులు పెడతారు. ఇక లక్ష్మీ మిత్రను తోసేస్తుంది. లక్ష్మీకి మీద రాళ్లు పడటం చూపించలేదు కానీ ఎస్ అంటూ సరయు గెంతులేస్తుంది. మరోవైపు వివేక్ పిల్లల్ని మధ్యలోనే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తారు. మనీషా సరయుతో ఎంత పని చేశావ్ సరయు ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు ఇది పెద్ద కేసు అవుతుందని కంగారు పడుతుంది.
అరవింద, జయదేవ్‌లు ఇంటికి పోలీసులు వస్తారు. ఇన్విస్టిగేషన్ తొందరగా పూర్తి చేయమని అరవింద వాళ్లు పోలీసులతో మాట్లాడుతారు. పిల్లలు కంగారుగా పరుగున వచ్చి అమ్మా, నాన్నలకు ఏమైనా అయిందా ఎవరికి ఏమైంది చెప్పండని అడుగుతారు. పిల్లలు ఇద్దరూ అమ్మా నాన్న అని అరుచుకుంటూ పైకి వెళ్తారు. అక్కడ లక్ష్మీ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. తలకు చేతికి కట్లు కట్టి ఉంటాయి. ఏం కాలేదని సైట్ విజిటింగ్‌కి వెళ్తే చిన్న యాక్సిడెంట్ అయిందని నాన్న నన్ను కాపాడారని లేదంటే పెద్ద ప్రమాదం జరిగుండేదని లక్ష్మీ చెప్తుంది. జున్ను తండ్రికి థ్యాంక్స్ చెప్తాడు. మిత్ర తనకు పునర్జన్మ ఇచ్చాడని లక్ష్మీ అంటుంది. దానికి అరవింద మిత్రకు నేను జన్మని ఇస్తే నువ్వు పునర్జన్మ ఇచ్చావని అంటుంది. ఈ రోజు కూడా నువ్వే మిత్రని కాపాడుంటావని అంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు జీవితాంతం కాపాడుకుంటూ ఉండాలని అంటుంది. ఇద్దరి మధ్యలోకి ఏ ఆపద రాకూడదని అరవింద అంటుంది. ఇంతలో మనీషా అక్కడికి వస్తుంది.
అరవింద: ఏమీ తెలీనట్లు ఎంత బాగా నటిస్తున్నావ్ మనీషా. లక్ష్మీకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు బాగా తెలుసు. నీ కంగారే చెప్తుంది నువ్వు చేయించావని ఆ అవసరం నీకు మాత్రమే ఉంది ఎందుకంటే మిత్రతో నీ పెళ్లి ఆగిపోయింది. మిత్ర లక్ష్మీకి దగ్గరవుతున్నాడు.
మనీషా: ఆంటీ ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు. ఇది నేను చేయలేదు ఆ సరయు చేసింది.
అరవింద: సరయుతో నువ్వే చేయించావ్ నువ్వు తను కలిసే చదువుకున్నారని తెలుసు. ఇద్దరూ కలిసి కంపెనీ లేపేయాలి అనుకున్నారు అది కుదరక లక్ష్మీని లేపేయాలి అనుకున్నారు. ఇదంతా నువ్వే చేశావని ఆధారాలతో సహా మిత్ర దగ్గర ఫ్రూప్ చేస్తా. యాక్సిడెంట్ గురించి కూడా చెప్పేస్తా. మిత్రతో నిన్ను గెంటించేస్తా. నీ పాపం పండింది మనీషా.
జాను వివేక్‌లు పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతారు. మిత్ర కూడా వెళ్లిపోతుంటే లక్ష్మీ తనని చూసుకోడానికి ఉండమని అంటుంది. పనోడిలా పని చేయమంటే పతిదేవుడిలా చేయమని అంటుంది. లక్ష్మీ మిత్రకు మంచి నీళ్లు తాగించమని అంటుంది. మిత్ర దూరంగా ఉండి తాగిస్తే లక్ష్మీ మిత్రతో లక్కీకి ఎలా తాగిస్తారో అలా తాగించండి అని అంటే మిత్ర లక్ష్మీ పక్కన కూర్చొని తన భుజం మీద చేయి వేసి పట్టుకొని దగ్గరకు తీసుకొని నీరు తాగిస్తాడు. లక్ష్మీ పైన నీరు పడితే కొంగుతో పెదవులు తుడుస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.