Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్ను, లక్కీలు ఆంజనేయస్వామిని పిలిచి తమ తల్లి మొక్కు తీర్చిందని మేం చాలా సంతోషంగా ఉన్నామని చెప్తారు. అంతా నీవల్లే అయింది థ్యాంక్యూ అని ఆంజనేయ స్వామిని అంటారు. దాంతో స్వామి నేను ఏం సాయం చేయలేదు అంతా మీ అమ్మ సంకల్పబలమే అని అంటారు. తల్లి సంకల్పం గొప్పదని శత్రువుల్ని చిరునవ్వుతో క్షమించి మీ అమ్మ నా తల్లి సీతమ్మని తలపిస్తుందని ఆంజనేయస్వామి అంటారు. ఇక లక్కీ తన తల్లి గురించి అడుగుతుంది. దాంతో స్వామి మీ అమ్మ గురించే చెప్పానని అంటారు.
నేను స్పష్టంగా చెప్పాను మీరే అర్థం చేసుకోవడం లేదని ఆంజనేయస్వామి చెప్పి వెళ్లిపోతారు. ఇక దీక్షితులు గారు ధ్యానం చేస్తుంటారు. ధ్యానంలో ఆయనకు బస్సు యాక్సిడెంట్ అయినట్లు కనిపిస్తుంది. మళ్లీ ప్రమాదం జరగబోతుంది మళ్లీ నందన్ వంశానికి ప్రమాదమని వాళ్లు బయటకు వెళ్లకూడదని మళ్లీ వెళ్తే అదే ప్రమాదం జరుగుతుందని లక్ష్మీని హెచ్చరించమని దీక్షితులు గారు తన శిష్యుడితో చెప్తారు. మిత్ర ఇంటికి కాల్ చేస్తే ఎవరూ ఎత్తరు. దాంతో స్వామీజీ మళ్లీ మళ్లీ కాల్ చేయమని అంటారు. ఇక మిత్ర ఇంటికి పార్థసారధి గారు వస్తారు. జయదేవ్ ఆయన్ను ఆహ్వానిస్తారు. జాను, లక్ష్మీలను పిలుస్తారు. జాను, లక్ష్మీలు తాతయ్యని చూసి మురిసిపోతారు. సంతోషంగా మాట్లాడుతారు. పిల్లలకు ఆయన మా తాతయ్య అని చెప్తుంది లక్ష్మీ. పార్థసారధి గారు జున్నుని చూసి మిత్రలా ఉన్నాడని లక్కీని చూసి లక్ష్మీలా ఉందని అంటారు.
మనీషా: పెద్దాయన మీ కళ్లు కనిపించడం లేదా తను లక్ష్మీలా ఉండటం ఏంటి. ఆ పాపని మిత్ర దత్తత తీసుకున్నాడు.
మిత్ర: మనీషా నీకు బుద్ధి ఉందా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా.
పార్థసారధి: క్షమించండి బాబు పాప లక్ష్మీలా ఉంటే తన కూతురే అనుకున్నా.
జయదేవ్: పర్లేదు అండీ లక్కీని చూసిన చాలా మంది లక్ష్మీ కూతురే అనుకుంటారు.
లక్కీ: నేను పార్వతి అమ్మ కూతుర్ని తాతయ్య కానీ ఇప్పుడు నా అమ్మానాన్నలు వీళ్లే.
మనీషా: ఇంతకీ తమరు హఠాత్తుగా ఎందుకు వచ్చారు.
పార్థసారథి: మా అన్నయ్యగారి మనవరాళ్లని చూసి ఓ కబురు చెప్దామని వచ్చా అమ్మా జాహ్నవి నీకు పెళ్లి అయిందంటి చెప్పలేదు.
మాకే చెప్పలేదు దొంగ పెళ్లి చేసుకున్నారని దేవయాని అంటే కాదు గుడిలో చేసుకున్నామని జాను చెప్పి వివేక్‌ని పరిచయం చేస్తుంది. ఇక పార్థసారథి ఊరిలో ఉత్సవాలు జరుగుతున్నాయని మనవరాళ్లతో పూజ చేయిస్తానని అంటారు. అందరినీ పిలుస్తారు. మిత్ర బాబు వస్తారా అని అంటే లక్ష్మీ మిత్ర చేతిలో చేయి వేసి పట్టుకొని వస్తామని అంటుంది. పార్థసారథిగారు వెళ్లిపోయిన తర్వాత మిత్ర గదిలోకి వెళ్తే లక్ష్మీ కూడా వెళ్లి మీతో చనువుగా ఉన్నందుకు తప్పుగా అనుకోవద్దు తాతయ్య గారు ఫీలవుతారని అలా చేశానని అంటుంది. ఇక మిత్ర నేను ఊరు రాను నువ్వు నటించినట్లు నేను మీ ఊరిలో నేను నటించలేను అంటాడు. ఇక మిత్ర ఆఫీస్‌లో చాలా పని ఉంది అంటే దానికి లక్ష్మీ నేను మీకు లీవ్ ఇస్తానని అంటుంది. ఇక మిత్ర జున్ను మాత్రమే వస్తాడు లక్కీ రాదు అని అంటాడు. దాంతో లక్ష్మీ లక్కీ నాకు కూడా కూతురే నాతో వస్తుందని అంటుంది. మిత్ర మాత్రం నువ్వు సరిగా చూసుకోవు పాప రాదు నేను రాను అని లక్ష్మీ పొమ్మంటాడు. జున్ను, లక్కీలు అదంతా వింటారు.
జున్ను లక్కీతో నాన్న రావాలి నువ్వు రావాలి ఏం చేద్దాం అనుకొని ఆంజనేయస్వామిని తలచుకుంటారు. స్వామితో విషయం చెప్తారు. దాంతో స్వామి మీ నాన్నని నువ్వే ఒప్పిస్తావని లక్కీతో చెప్తారు. లక్కీ, జున్నులు సంతోషంతో ఆంజనేయస్వామితో స్వామీ మీకు ఒకటి ఇవ్వాలని ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. స్వామి పులకించిపోతారు. మరోవైపు దేవయాని వివేక్‌ని పిలిచి నువ్వు వెళ్లొద్దని అంటుంది. ఇంతలో జాను వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రి హగ్ చేసుకోగానే క్రిష్ ఎమోషనల్.. మామ కాని మామ అసలు రంగు బయట పెట్టడానికి సత్య ప్లాన్!