Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా లక్ష్మీ దగ్గరకు వెళ్లి జానుకి పిల్లలు పుట్టరు అని ఆ విషయం వివేక్ దాచాడని అంటుంది. లక్ష్మీ నమ్మదు మనీషా మీద కేకలేస్తుంది. ఇంతలో వివేక్ అక్కడికి వస్తాడు. వివేక్ రా లక్ష్మీ కన్ఫ్యూజన్లో ఉంది నువ్వు కాస్త క్లారిటీ ఇవ్వు అని అంటుంది.
మనీషా: ప్రాబ్లమ్ నీలోనా లేక జానూలోనా. జానులోనే అని నేను చెప్తున్నా కానీ లక్ష్మీ నమ్మడంలేదు.వివేక్: జానులో లోపం ఏంటి. నాలోనే ప్రాబ్లమ్ ఉంది కదా.మనీషా: మీ అమ్మ దగ్గర కవర్ చేసినట్లు నా దగ్గర చేయకు నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు ఇందాక వెళ్లిన మెడికల్ షాప్‌కి వెళ్లి తీసుకున్న ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకున్నా. అప్పుడే జాను కోసం నువ్వు చేస్తున్న త్యాగం, మీ అమ్మకి చేస్తున్నా మోసం అన్నీ బయట పడ్డాయి. లక్ష్మీ: ఏంటి వివేక్ మనీషా చెప్పింది నిజమా ప్రాబ్లమ్ జానుకా.వివేక్: సారీ వదిన ఈ విషయం జానుకి తెలిస్తే తట్టుకోలేదు అందుకని. మనీషా: మీ అమ్మకి తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. జానుని మెడ పట్టుకొని గెంటేసి విడాకులు ఇప్పించి నీకు మరో పెళ్లి చేస్తుంది కదా. జాను గుండె బద్దలై సూసైడ్ చేసుకుంటుంది కదా. వివేక్: జాను కోసం నిజం దాచాను. మా అమ్మని మోసం చేశాను అయినా రెండు మూడు నెలల్లో క్లియర్ అయిపోతుంది కదా అదేం తప్పు కాదు కదా.మనీషా: నీకు కాదు కానీ నాకు అదే ఇప్పుడు ఆయుధం. నాకు తెలిసిన ఈ నిజాన్ని నేను ఇప్పుడే ఆంటీతో చెప్తా.లక్ష్మీ: మనీషా వద్దు ఆ పని చేయొద్దు.మనీషా: ఎందుకు చెప్పొద్దు ఆంటీ జానుని గెంటేస్తుందనా లేక జాను చనిపోతుందనా. జాను ఏమైపోతే నాకు ఏంటి. లక్ష్మీ: ఏయ్ నువ్వు ఆడపిల్లవేనా ఇలా మాట్లాడుతావేంటి. మనీషా: నేను మీలాంటి ఆడపిల్లనే మిత్రని ప్రాణంగా ప్రేమించాను. ఆ మిత్ర ప్రాణాల కోసం నువ్వు భార్య అయినా సహించాను కానీ నువ్వు ప్రతీసారి నన్ను ఓడిస్తున్నావు. ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. అందుకే మనిషి అన్నవారు తన కోసం యుద్ధం చేస్తారు. లక్ష్మీ: సరే నీకు ఇప్పుడు ఏం కావాలి. దేవయాని అత్తయ్యకు నువ్వు చెప్పకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పు.మనీషా: నాకు నీ ఐదోతనంలో భాగం కావాలి. నీ పసుపు కుంకుమలలో పాలు పంచాలి. నీ మాంగల్యంలో నాకు మరో ముడి వేయించాలి.వివేక్: అసలేం మాట్లాడుతున్నావ్ మనీషా మా అన్నయ్యని ఇవ్వమని వదిననే అడుగుతున్నావ్.మనీషా: రేపటిలో నిర్ణయించుకో నీ మాంగల్యమా చెల్లి జీవితమా. లక్ష్మీ బాధ పడుతుంటే వివేక్ సారీ చెప్తాడు. దానికి లక్ష్మీ వివేక్‌తో నువ్వే మా చెల్లి గురించి గొప్పగా ఆలోచిస్తున్నావ్ నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. మా అమ్మా కాళ్ల మీద పడి ఒప్పిస్తానని వివేక్ అంటే అది కుదరదు వివేక్ అని లక్ష్మీ అంటుంది. మీ అమ్మకి తెలిస్తే జానుని కొట్టి మెడ పట్టుకొని గెంటేస్తుందని జాను చచ్చిపోతుందని చెప్తుంది. వివేక్ భయపడతాడు. ఉదయం లక్ష్మీ ఎదురుగా మనీషా వచ్చి దేవయానిని పిలుస్తుంది. జాను, వివేక్‌లు హాస్పిటల్‌కి వెళ్లారు కదా అసలు నిజం ఏంటి అంటే ప్రాబ్లమ్ వివేక్‌లో లేదు జాను అనబోతే లక్ష్మీ మనీషాని ఆపుతుంది. ఇంతలో మనీషా జాను కూడా తన ప్రయత్నం చేయాలి అని జానుతో పూజలు చేయించమని చెప్తున్నా అని మనీషా కవర్ చేస్తుంది. పిల్లలు కచ్చితంగా పుట్టాలి అని పిల్లలు పుట్టని కోడలు ఉంటే ఏం చేస్తారు అని అంటుంది. మనీషా ఇంకా ప్రశ్నలు అడుగుతుంటే లక్ష్మీ తన చేతిలో ఉన్న కాఫీ మనీషాకి ఇచ్చి మిత్రకు ఇవ్వమని చెప్తుంది. దేవయాని షాక్ అయిపోతుంది. గిల్లుకొని చూసుకుంటుంది. మనీషా ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పిందని అది తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మనీషా మిత్రకు కాఫీ ఇస్తుంది. మనీషా మిత్రతో నీ ప్రేమ నాకు దక్కకపోయినా నా బిడ్డకు దక్కుతుంది. నేను అప్పుడప్పుడు నా బిడ్డని చూడటానికి రావొచ్చి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!