Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, జానుతో పాటు అందరూ పొలం దగ్గరే ఉంటారు. లక్ష్మీ చాలా సంతోషిస్తుంది. ఇంతలో నర్శింహ కొందరు రౌడీలతో అక్కడికి వస్తాడు. ధాన్యం ఎక్కడికి తీసుకెళ్తారురా అని ఊరి జనాన్ని ప్రశ్నిస్తారు. పొలాలు, భూములు, ధాన్యం అన్నీ నావే అని ఎవరైనా అందులో ఒక్క గింజ తీసినా ప్రాణాలు తీసేస్తా అని బెదిరిస్తాడు. ఇక లక్ష్మీతో చూడటానికి గృహలక్ష్మీలా ఉన్నావ్ లక్ష్మీ బాంబ్‌లా పేలుతావంట నీ గురించి చాలా విన్నాను.. నేను ఎవరో తెలుసా ఇక్కడి గవర్నమెంట్ నాది నన్ను ఎదిరిస్తావా అని అడుగుతాడు. చిటికె వేస్తే చస్తావ్ అంటాడు.


జాను: ఏయ్ మా అక్క జోలికి రావొద్దు.
నర్శింహ: ఎవరు తల్లీ నువ్వు ఈ అక్క చిట్టి చెల్లెవా. జాను అంటే నువ్వేనా నీ కోసం మా వాళ్లు చెప్పారు. ఇప్పుడు ఈ అక్క కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యావ్ కానీ ఇంతకు ముందు ఇదే అక్కతో ఆస్తి కోసం గొడవలు పడ్డావంట. అలాంటి నువ్వు మీ అక్కకి అండగా నిలుస్తున్నావా చూడటానికి కామెడీగా లేదూ. నువ్వు పొలం కోసం మీ అక్కతో గొడవ పడొచ్చు. ఈ పొలాలు, ఇళ్లు, ఊరు ఇవన్నీ డబ్బులిచ్చి కొన్ని నేను అవి తీసుకోకూడదా. వాటిని కూల్చేసి ఫ్యాక్టరీ కట్టుకోకూడదా
లక్ష్మీ: కట్టుకో కానీ ఊరు కూల్చి కాదు ఊరికి దూరంగా కట్టుకో. వాళ్లని బెదిరించి కాదు వాళ్ల మనసు గెలిచి కట్టుకో. 
నర్శింహ: ప్రాణం మీద బతుకు మీద ఆశ ఉంటే పక్కకి తప్పుకో. లేదంటే తప్పిస్తా. ఏ ఊరి జనానికి అండగా ఉన్నావో ఆ జనం చూస్తుండగా నీ పరువు తీసి పంపిస్తా.
లక్ష్మీ: ఏదీ నా ఒంటి మీద చేయి వేసి చూడు.
నర్శింహ: నాకు అంత సీన్ లేదు అనుకున్నావా.
మిత్ర: నర్శింహ లక్ష్మీ మీద చేయి వేయబోతే మిత్ర చేయి పట్టుకుంటాడు. ఏంట్రా చూస్తున్నావ్ నీ వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నా ఐ డోంట్ కేర్. తను నా భార్య. ఈ ఊరి కోసం నిలబడుతుంది. తన కోసం నేను నిలబడుతున్నా. తనని టచ్ చేయాలి అంటే ముందు నన్ను టచ్ చేయాలి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లు లేదంటే నిల్చున్న చోటే పాతరేస్తా.


నర్శింహ మనీషాని చూపించి లక్ష్మీ మీ భార్య అయితే ఈవిడ ఎవరు? ఎక్స్ గల్ఫ్రెండా లవరా లేక సహజీవనం చేస్తున్నారా అని అడుగుతాడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని మిత్రని అవమానిస్తాడు. ఓ ఆడపిల్లని మోసం చేస్తున్నావ్ అలాంటి నువ్వు ఊరికి న్యాయం చేస్తావా నువ్వు పాతాళంలో ఉన్నావ్ అని అవమానిస్తాడు. వివేక్ నోరు జారితే మర్యాదగా ఉండదని అంటే తల్లికీ పెళ్లానికి మధ్య నలిగిపోయే చిన్న పిల్లాడివి నువ్వు పక్కకెళ్లు అని అంటాడు. ఎవరు అడ్డు వచ్చినా ఫ్యాక్టరీ అడదు అని చెప్పి వెళ్లిపోతాడు.



పెద్దాయన దగ్గరకు జాను వెళ్తుంది. తాతయ్య అని పిలుస్తుంది. నన్నా అమ్మా అని పార్థసారధి గారు అడుగుతారు. దాంతో జాను ఏడుస్తుంది. నీ దృష్టిలో గుమస్తాగా మిగిలిపోతానేమో అంటే జాను ఏడుస్తూ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తుంది. తాతయ్య దగ్గరకు వెళ్లి అక్కని గొడవలోకి వెళ్లమని నేను చెప్తే వినడం లేదని మీరు చెప్పండి అంటే లక్ష్మీ నిర్ణయం తీసుకుంది ఎవరు చెప్పినా వినదు అని అంటారు. దానికి జాను ఇప్పుడిప్పుడే అక్కా బావ దగ్గర అవుతున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేం సిటీకి వెళ్లిపోతాం అక్కకి చెప్పండి అంటే మనం ఉన్నాం కదా ఏం కాదని అంటారు. జాను అక్క గురించి దిగులు పడటం పిల్లలు వింటారు. వాళ్ల దగ్గరకు వెళ్లి పిన్నీ నీకు అమ్మ అంటే అంత ఇష్టమా అమ్మ నవ్వుతూ ఉండాలి అనుకున్నావా ఇంకా నీకు అమ్మ అంటే ఇష్టం లేదు అనుకున్నాం అని సారీ చెప్తారు.


జాను ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుంది. అమ్మ అంటే పిన్నికి అంత ప్రేమా తాతయ్య అని పిల్లలు తాతని అడిగితే మీ పిన్నికి అక్క అంటే ప్రాణం అని జాను బంగారం అని చెప్తారు. ఇక రాత్రి లక్ష్మీ దగ్గరకు ఊరి జనాలు వచ్చి పండగకు వచ్చిన మీకు మా కష్టాలు వద్దమ్మ అని అంటే మీరు నా ఫ్యామిలీనే మీ సమస్య నా సమస్య అని అంటుంది. ఇక తాతయ్య లక్ష్మీ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తే మీ తాతయ్య గుర్తొస్తున్నాడని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!