Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రని కొట్టడానికి చేయెత్తిన జయదేవ్.. అడ్డుకున్న లక్ష్మీ.. మనీషాతో సవాల్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర మనీషా జీవితం నాశనం చేసేశాడని మిత్ర ఫ్రెండ్స్ జయదేవ్ వాళ్లతో చెప్పడం జయదేవ్ మిత్రని కొట్టడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీతో కలిసి కేక్ కట్ చేస్తుందే మిత్ర ఫ్రెండ్స్ వచ్చి సూపర్ మిత్ర నువ్వు మంచి ఫ్రెండ్ అనుకుంటే ఇంత మంచి యాక్టర్ అనుకోలేదు.. ఏం జరగనట్లు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావ్ అని ప్రశ్నిస్తారు. మనీషా బాధ కంటే లక్ష్మీ సంతోషమే నీకు ముఖ్యం కదా అంటారు.
జయదేవ్: ఏంటమ్మా మీరు పిలవని ఫంక్షన్‌కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు.
అంజలి: మేం మిత్ర ఫ్రెండ్స్ అంకుల్. నిన్న రాత్రి మిత్ర ఏం చేశాడో మీకు తెలీదు అనుకుంటా.
లక్ష్మీ: ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఫ్రెండ్స్: మీరు మీ ఆయన బాగుంటే చాలా లక్ష్మీ గారు మనీషా అన్యాయం అయిపోయినా పర్లేదా.
జాను: ఇప్పుడు ఈ మనీషాకి ఏం అన్యాయం జరిగింది.
అంజలి: మనీషాకి ఇక్కడ కాదు గెస్ట్ హౌస్‌లో అన్యాయం జరిగింది.
లక్ష్మీ: జాను పిల్లలకు లోపలకు తీసుకెళ్లు.
సిరి: మిత్ర మనీషాకి తీరని అన్యాయం చేశాడు. నిన్న రాత్రి తాగిన మత్తులో మిత్ర మనీషా జీవితం నాశనం చేశాడు. అందరూ షాక్ అయిపోతే మిత్ర తలదించుకుంటాడు.
వివేక్: అబద్ధం ప్రాణం పోయినా మా అన్నయ్యా అలాంటి పని చేయడు.
జయదేవ్: వాళ్లు చెప్పేది నిజమా మిత్ర నిజంగా నువ్వు తప్పు చేశావా.
వివేక్: వాళ్లు చెప్పేది అబద్ధం అని చెప్పు అన్నయ్య.
దేవయాని: ఏం మాట్లాడవేంటి మిత్ర అంటే నువ్వు నిజంగా తప్పు చేశావ్. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. అందుకేనా మిత్ర ఉదయం నుంచి నువ్వు ఎవరితో మాట్లాడనిది. మనీషా మనసులో అంత బాధ పెట్టుకొని మౌనంగా ఉండిపోయావా. మిత్ర నీకు అన్యాయం చేసినా వాళ్ల పెళ్లి రోజు జరగాలి అని పెద్ద మనసుతో ఒప్పించావా. నీది ఎంత మంచి మనసు మనీషా. ఇలాంటి అమాయకురాలిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది మిత్ర. నిన్ను నమ్మి ఈ ఇంట్లో ఉన్నందుకు మనీషాకి ఇంత ద్రోహం చేస్తావా. చేసిందంతా చేసి ఏం తెలియనట్లు నీ భార్యా పిల్లలతో చిందులేస్తావా. నువ్వు అసలు మనిషివేనా.
లక్ష్మీ: ఆపండి. అనవసరంగా నిందలు వేయొద్దు. ఆయన మీ పెద్ద కొడుకు అని మర్చిపోవద్దు.
జయదేవ్: మిత్ర అంత పెద్ద తప్పు చేసి ఏం తెలియనట్లు ఉన్నావ్ అసలు నువ్వు మనిషివేనా నిన్ను అని కొట్టడానికి వస్తే లక్ష్మీ అడ్డుకుంటుంది.
లక్ష్మీ: కొన్ని సార్లు మాట్లడకపోవడానికి కారణాలు ఉంటాయి. మీ అందరికీ ఈయన మీద నమ్మకం లేకపోయినా భార్యగా నాకు నమ్మకం ఉంది. ఈయన నా మెడలో కట్టిన మంగళ సూత్రం మీద నాకు నమ్మకం ఉంది. ఈ తాళిని ఎగతాళి చేసే పని ఈయన ఎప్పటికీ లేదు.
సిరి: ఆ మాట మిత్రకు చెప్పమని చెప్పండి.
లక్ష్మీ: మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు వెళ్లండి ఇది మా ఇంటి సమస్య.
రాజేశ్వరి దేవి మనీషా ఫ్రెండ్స్‌ని తరిమేస్తుంది. మిత్ర గదిలోకి వచ్చేస్తాడు. లక్ష్మీ వెనకాలే వచ్చి మీరు ఏం తప్పు చేయలేదు చేశానని అనుకుంటున్నారు అని అంటుంది. నాకు నిజం తెలియకపోయినా మనీషాకి తెలుసుకదా చనిపోతున్న మనీషాని నేను తీసుకొచ్చానని అంటాడు. లక్ష్మీ మిత్రతో మీరు ఏం తప్పుచేయలేదని నేను నమ్ముతున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. మిత్రకి భోజనానికి పిలిస్తే మిత్ర రాడు. ఇక జయదేవ్ వాళ్లు లక్ష్మీకి నిజం తెలిసినా ఎందుకు చెప్పలేదు అంటే అది అబద్ధం అని అందుకే చెప్పలేదని అంటుంది. మనీషా కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చింది తప్పు జరిగిందని మనీషా చెప్తుందని ఆయన కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారని అంటుంది. మిత్ర, మనీషా ప్రేమించుకున్నారు కదా అలా ఏమైనా తప్పు అయిందా అంటే అలా ఏం కాదని భార్యగా తాను నమ్ముతున్నా అని మీరు నమ్మండి అని లక్ష్మీ చెప్తుంది. మనీషా అన్నయ్యని ఎలా అయినా దక్కించుకోవాలని ఇలా చేసినట్లుందని జాను, వివేక్‌లు చెప్తారు.
మనీషా, దేవయాని నవ్వుకొని మిత్ర ఇక తన మెడలో తాళి కట్టేస్తాడని అనుకుంటుంది. లక్ష్మీ రావడంతో మనీషా ఏడుస్తూ పడుకున్నట్లు నటిస్తుంది. లక్ష్మీ జాను, వివేక్‌లు పిలుస్తున్నారని దేవయానిని పంపేస్తుంది. మనీషా దగ్గరకు వెళ్లి బెడ్ దిగమని చెప్తుంది. మనీషా లక్ష్మీ మనీషాని లాగిపెట్టి కొడుతుంది. ఆయన ఫ్రెండ్‌వేనా నువ్వు ఆయన ఫ్రెండ్స్ ముందు బయట వాళ్ల ముందు ఎలా మిత్ర తల దించుకునేలా చేస్తావని అంటుంది. నీ ఆట అయిపోయింది మనీషా ఇక నిన్ను ఇంటి నుంచి గెంటేస్తా చూడు అని అంటుంది. మరోవైపు వివేక్ హోటల్‌కి వెళ్లి డబ్బు ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు. పెన్ డ్రైవ్ ఇచ్చి అందులో ఎక్కించమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కోడలికి విషం ఇస్తే కొడుకు నొప్పులు పడుతున్నాడేంటి? విజయాంబికకు ఇది షాకే!