Trending
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 10th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఫస్ట్‌నైట్ జరిగిందా లేదా తెలుసుకోవడానికి టెస్టా..?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర ఏం తప్పు చేయలేదని నిరూపిస్తానని లక్ష్మీ మనీషాకి చెప్పడం మిత్రతో తాళి కట్టించుకుంటానని మనీషా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా లైఫ్ నాశనం చేసేశానని మిత్ర చాలా బాధ పడతాడు. తన వల్ల మనీషా తల దించుకోవాల్సి వచ్చిందని మనీషాని అలా వదిలేయలేనని అందుకే ఇంటికి తీసుకొచ్చానని మిత్ర బాధ పడతాడు. మనీషా ఈయన్ని అలా నమ్మించింది. దాన్ని ఎలా అయినా పట్టుకోవాలి.
లక్ష్మీ: సరే అండీ ఇప్పుడే చేయాలి అనుకుంటున్నారు.
మిత్ర: ఏం తెలీదు లక్ష్మీ నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయ్.
మనీషా: ఆంటీ మిత్రకు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మిత్ర ఇప్పటిలో ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పడు. మిత్ర చెప్పకుండా లక్ష్మీ చెప్పదు. నేను ఎవరికీ చెప్పను.
దేవయాని: మరి ఈ విషయం అందరికీ ఎలా తెలుస్తుంది.
మనీషా: మీరు ఉన్నారు కదా. విషయం మీకు తెలుసు కదా.
దేవయాని: కరెక్టే ఇంత పెద్ద విషయం చెప్పడానికి నాకు మాత్రమే అర్హత ఉంది. వెళ్లి రచ్చ రచ్చ చేస్తాను చూడు.
రాజేశ్వరిదేవి: రాత్రి ఏం జరిగింది మిత్ర ఏమైనా చెప్పాడా.
దేవయాని: మనీషా నాకు మొత్తం చెప్పింది ఏం జరిగిందో నేను చెప్తా.
లక్ష్మీ: రాత్రి అది రాత్రి ఆయనకు ఫ్రెండ్స్ జ్యూస్‌లో మందు కలిపి ఇచ్చారంట. డ్రింక్ చేసిన విషయం నాకు తెలిస్తే నేను బాధ పడతాను అని రాత్రి రాలేదు. తెల్లారి వచ్చి బాధ పడుతున్నారు.
దేవయాని: అసలు విషయం చెప్పవేంటి లక్ష్మీ అది ఎందుకు దాస్తున్నావ్. ఆ విషయం తప్ప లక్ష్మీ మితగా అన్నీ చెప్తుంది. అదేంటో నేను చెప్తా.
లక్ష్మీ: మీరు ఇప్పుడు విషయం చెప్తే ఆ రోజు బీరువాలో హారం నగల కొట్టులోకి ఎలా వెళ్లిందో అది చెప్పాల్సి వస్తుంది. లక్ష్మీ బెదిరించడంతో దేవయాని చెప్పకుండా ఆగిపోతుంది.
జాను: అక్క మనీషా ఇంక అమెరికా వెళ్లదా ఇక్కడే ఉండిపోతుందా.
లక్ష్మీ: లేదు తను వెళ్లిపోతుంది. అంతే కదా చిన్నత్తయ్య గారు. నేను వెళ్లి మనీషాతో మాట్లాడుతా. మనీషా: ఏంటి లక్ష్మీ చప్పట్లు కొడుకుతున్నావ్.
దేవయాని: నీ తెలివిని మెచ్చుకుంటున్నా మనీషా. మా ఆయన నిన్ను గతంలో ప్రేమిస్తే ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావ్. రాత్రి మీ మధ్య ఏం జరిగలేదని నాకు తెలుసు.
మనీషా: నీకు ఎలా తెలుసు నువ్వేమైనా చూశావా.
లక్ష్మీ: ఆయన భార్యని నాకంటే ఆయన గురించి ఎవరికి బాగా తెలుసు. మగాడిని కన్న తల్లి కన్నా కట్టుకున్న భార్యకే ఎక్కువ తెలుస్తుంది. ఒకప్పుడు జున్ను మిత్ర కొడుకు కాదు డీఎన్‌ఏ టెస్ట్‌కి సిద్ధమా అని అడిగావ్. ఇప్పుడు నువ్వు టెస్ట్‌కి సిద్దమా. కూల్ డ్రింక్‌లో ఆయనకు నువ్వు మత్తు మందు కలిపి ఇవ్వగలవు కానీ నీ వేలు కూడా ఆయన తాకలేరు.
మనీషా: ఒప్పుకుంటా మిత్ర నా వేలు కూడా తాకలేదు. కానీ నేను చెప్పిందే నిజం అని నమ్మాడు. దాన్ని నేను ఇంకా ఎక్కువ చేస్తా. మిత్రను ఇంకా ఇంకా నమ్మిస్తాను. ఏం చేస్తావ్ నన్ను టెస్ట్ చేయమని మిత్రతో చెప్పిస్తావా.
లక్ష్మీ: ఛీ నాది నీ లాంటి బుద్ధి కాదు. కాస్త టైం పట్టినా నిజం నిరూపిస్తా.
మనీషా: ఈలోపు నేను మిత్రతో తాళి కట్టించుకుంటా.
దేవయాని: మనీషా ఎందుకు లక్ష్మీ దగ్గర నిజం ఒప్పుకున్నా తన నమ్మకం ఇంకా పెరిగిపోతుందికదా.
మనీషా: మిత్ర బలహీనుడైపోయాడు కదా ఆంటీ ఆ లక్ష్మీ ఏం చేయలేదు.
మిత్ర ఫంక్షన్ వద్దని వివేక్‌కి గట్టిగా చెప్తాడు. ఆ విషయం వివేక్ చెప్తే మిత్ర గారి గిల్ట్ పొగొట్టడానికి అయినా మనం ఈ ఫంక్షన్ గ్రాండ్‌గానే చేయాలని మనందరికి ఆయన ముఖం చూపించాలి.. ఫంక్షన్‌కి వచ్చిన అతిథులతో ఆయన కలిసిపోవాలి.. ఫంక్షన్ సక్రమంగా జరగాలి ఆయన్ని నేను ఒప్పిస్తాను అని లక్ష్మీ అంటుంది. దేవమాని మనీషాతో మిత్ర దగ్గరకు వెళ్లి నువ్వు పెళ్లి రోజు చేసుకో అని చెప్పు అప్పుడు మిత్ర నీది ఎంత మంచి మనసు అనుకొని 10 రోజుల్లో అవ్వాల్సిన మీ పెళ్లి రెండు రోజుల్లో అయిపోతుందని అంటుంది. మిత్ర దగ్గరకు మనీషా వెళ్తుంది. ఈ రోజు నీ పెళ్లి రోజు సాయంత్రం ఫంక్షన్ చేసుకో అని చెప్తుంది. వద్దని మిత్ర అంటే తప్పు చేసింది మనం అయితే లక్ష్మీకి శిక్ష ఎందుకు అంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Aalso Read: సత్యభామ సీరియల్: ఇంకా లేదేంటా అనుకుంటే వచ్చేసిందిగా సంధ్యకి సవతి.. అమ్మాయిలంతా ఇలాంటి వెదవలకే పడతారేంట్రా!