Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ కేసు కోర్టుకు వెళ్తుంది. పార్వతి తరుఫున సరయు, మనీషాలు ఫేమస్ లాయర్ చాణక్యని ఏర్పాటు చేస్తారు. అతన్ని చూసి అందరూ పార్వతి కేసు గెలిచేస్తుందని అనుకుంటారు. ఇక లక్ష్మీ మిత్ర తరఫున అర్జున్‌ని రంగంలోకి దించుతుంది. అర్జున్ బిజినెస్‌లోకి రాకముందు లాయర్ అని అందరికీ చెప్తుంది. ప్రాక్టీస్ లేని లాయర్ కేసు ఓడిపోతాడని మనీషా వాళ్లు అర్జున్‌ని అవమానిస్తారు.
కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. లాయర్ చాణక్య పార్వతిని ప్రశ్నిస్తారు. తనని ప్రియుడు మోసం చేయడంతో లక్కీ పుట్టగానే వదిలేశానని చెప్తుంది. ఇక ఆ రోజు ఉన్న నర్స్‌ని కోర్టులోకి తీసుకొస్తారు. ఆమె కూడా ఆరోజు పార్వతి వచ్చిందని నొప్పులతో బాధపడుతుంటే డెలివరీ చేశామని తర్వాత తాను పారిపోయిందని చెప్తుంది. తర్వాత పార్వతి రెండు మూడు సార్లు వచ్చినా మిత్ర గారికి దత్తత ఇచ్చిన విషయం చెప్పలేదని నర్స్ చెప్తుంది. జడ్జి అర్జున్ని ఏమైనా క్రాష్ ఎగ్జామినేషన్ చేస్తారా అని అడిగితే అర్జున్ ఏం లేదు అని చెప్తాడు.
దాంతో పార్వతి తరుఫు లాయర్ పార్వతికి బిడ్డని ఇవ్వాలని కోరుతాడు. దాంతో అర్జున్ లక్కీ పాప పార్వతి బిడ్డ కాదు అని అనుమానాలు ఉన్నాయని చెప్తాడు. ఆధారాలు ఉన్నాయా అని జడ్జీ అడిగితే వాటి కోసం ఒక్క రోజు గడువు ఇవ్వమని చెప్తాడు. దాంతో జడ్జీ అర్జున్ వాళ్లకి ఒక్క రోజు గడువు ఇస్తాడు. లక్ష్మీ వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. ఇక మనీషా, దేవయాని, సరయులు టెన్షన్ పడతారు. ఇక లాయర్ చాణక్య బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతారు. ఈరోజే తీర్పు రావాల్సింది కానీ రేపు వస్తుందని పాప కచ్చితంగా పార్వతికే దక్కతుందని లాయర్ అర్జున్ నల్లకోటు వేసుకొని తెల్లముఖం వేశాడని అంటారు. అర్జున్ నోరు తెరవలేకపోయాడని అవమానిస్తారు. మీడియా కూడా అర్జున్‌ని అవమానించేలా మాట్లాడుతారు.
ఇక సరయు తీర్పు లక్ష్మీ వాళ్లకి అనుకూలంగా వస్తే పాపని ఎత్తుకుపోమని కొంత మంది రౌడీలను కోర్టు దగ్గర ఉంచుంటుది. తీర్పు రాకపోవడంతో వాళ్లకి సైగ చేసి వెళ్లిపోమని చెప్తుంది. ఇక మనీషా, దేవయానిలు ఈ కేసుకి అర్జున్ కరెక్ట్ కాదని వేరే లాయర్‌ని చూసుకుందామని అంటారు. దేవయాని మనీషాని చాటుగా తీసుకెళ్లి మంచి లాయర్‌ని పెట్టమన్నావ్ కేసు గెలిస్తే ఎలా అంటుంది. దానికి మనీషా సరయు పెట్టిన ఢిల్లీ లాయర్ ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే అంటుంది. ఇక మిత్ర జయదేవ్‌తో ఈ కేసు నుంచి అర్జున్‌ని తప్పించమని మంచి లాయర్ని పెట్టమని తండ్రితో చెప్తాడు. అర్జున్ మంచి లాయర్ అని మనం కేసు గెలుస్తామని లక్ష్మీ చెప్తాడు. కానీ మిత్ర నమ్మడు వివేక్ జానులు కూడా అర్జున్ వద్దని అంటారు. దాంతో లక్ష్మీ అర్జున్ దగ్గరకు వెళ్లి ఈ కేసు వదిలేయమని చెప్తుంది. అర్జున్ వదలను అని అంటాడు.
ఈ కేసు నీ గురించి ఆలోచించి ఉండిపోయాను అని అర్జున్ అంటాడు. ఎందుకు అని లక్ష్మీ అడిగితే ఈ కేసు నీతో మొదలైందని మున్నార్‌లోనే లక్కీ, జున్నులు పుట్టారని నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్నావని నిన్ను డెలివరీకీ తీసుకెళ్లింది కూడా మిత్రనే నేను మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాలి అప్పుడు మిత్ర నిన్ను ఇంకా అసహ్యించుకుంటాడని అంటాడు. భాస్కర్ ఇంట్లో ఉన్నట్లు నువ్వు ఒప్పుకుంటే రేపు కోర్టులో మరోరకంగా ఉంటుందని దానికి నువ్వు ఒప్పుకుంటే చాలని అంటాడు. మిత్రకి లక్కీని దగ్గర చేయడానికి నువ్వు ఈ నిజం బయట పెట్టడానికి ఒప్పుకొని మిత్ర కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అలా అయితే చెప్పు కేసు తీసుకుంటా లేదంటే వదిలేస్తా అంటాడు. దీంతో లక్ష్మీ ఏం చేయాలా అని ఆలోచనలో పడుతుంది. ఇక ఇంటి దగ్గర లక్కీ ఏడుస్తుంటే జున్ను వెళ్లి కేసు గెలిచామా ఏమైంది అని అడుగుతాడు. దాంతో లక్కీ నేను ఆ పార్వతి అమ్మతో వెళ్లిపోతానని అంటున్నారని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్ ఇంట్లో లక్ష్మీని చూసేసిన సహస్ర ఫ్యామిలీ.. విహారి పెళ్లి విషయం బయట పడిపోతుందా!