Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను అక్కా బావల మీద ఫైర్ అయిపోతుంది. నా భర్తని పనోడిలా బానిసలా చూస్తున్నారని అంటుంది. మీ డ్రైవర్‌గా చేసుకున్నారని కడుపునిండా తిననివ్వడం లేదని మధ్యలో పిలుస్తున్నారు. నిద్రలో ఉంటే లేపుతారు. మీ కారు చెడిపోతే ఆయన్ను రోడ్డు మీద వదిలేస్తారు. బావకి ఇలా అయితే ఊరుకుంటావా అక్కా అని లక్ష్మీని జాను నిలదీస్తుంది.
లక్ష్మీ: ఎందుకిలా మాట్లాడుతున్నావ్ జాను అసలు నీకు ఏమైంది.
జాను: మీకు ఏమైందని అడుగుతున్నాను. మనం అక్కా చెల్లెళ్లమే కానీ తోడు కోడళ్లం కూడా. వీళ్లు అన్నదమ్ములే కానీ ఆస్తిలో సమాన వాటాదారులు.
జయదేవ్: ఇప్పుడు తేడాలు అవి ఎందుకమ్మా చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావ్ మీ అక్కతో అలా మాట్లాడొచ్చా.
జాను: నేను నా భర్త గురించి మాట్లాడుతున్నాను మామయ్య గారు మధ్యలో మీరు మాట్లాడకండి. జాను వేలు చూపించి చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు.
లక్ష్మీ: జాను మామయ్య గారిని ఎదిరించి మాట్లాడుతున్నావ్ ఏంటి.
జాను: నా భర్త కోసం నేను ఎవర్ని అయినా ఎదురించి మాట్లాడుతాను. ఆయనకు ఇవ్వాల్సిన విలువ కోసం దక్కాల్సిన గౌరవం కోసం నేను పోరాడుతాను.
వివేక్: ఎవరితో పోరాడుతావు జాను ఎవరి కోసం పోరాడు తావు నాకోసమా అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్.
జాను: మాట్లాడుతాను అండీ మీకు అన్యాయం జరిగితే మాట్లాడుతాను. అది మా అక్క అయినా సరే బావగారు అయినా సరే మామయ్య గారు అయినా సరే.
వివేక్: నోర్ముయ్ నాకు ఎవరూ అన్యాయం చేయలేదు. డ్రైవింగ్ చేసినంత మాత్రాన డ్రైవర్ అయిపోను. వదిన రోజు ఇంట్లో వంట చేస్తుంది అంత మాత్రానా పని మనిషి అయిపోతుందా. అన్నయ్య కంపెనీలో కుటుంబం కోసం కష్టపడుతున్నాడు ఆయన బానిస అయిపోతాడా. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అసలు నీ బుద్ధి ఏమైంది.
జాను: మీరు మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అందరూ మంచోళ్లలా కనిపిస్తున్నారు కానీ వాళ్లు కూడా అలాగే ఆలోచించాలి.
దేవయాని: బాగా చెప్పావు. నా బాధ కూడా అదే మనకి అర్థమైంది వీడికి ఎప్పుడు అర్థమవుతుందో.
వివేక్: అసలేం అర్థం చేసుకున్నారు మీ ఇద్దరు ఇక్కడ పరాయి వాళ్లు ఎవరు ఉన్నారు అంతా మనమే కదా ఒకరి కోసం ఒకరు పని చేస్తే తప్పేముంది
జాను: ఒకరి కోసం ఒకరు పని చేస్తే తప్పు లేదు కానీ అందరి కోసం ఒకరు పని చేస్తేనే సమస్య. అది మీకు అర్థం కాదు, నడిరోడ్డు మీద మిమల్ని వదిలేశారు నాకు ఎలా ఉంటుంది.
వివేక్ జానుని తిట్టి లాక్కొని గదిలోకి తీసుకెళ్లిపోతాడు. సిద్ధాంతి గారు హెచ్చరించినట్లు కుటుంబం ముక్కలు అవుతుందా ఈ విషయం అరవిందకు తెలిస్తే తన గుండె బద్ధలైపోతుందని జయదేవ్ బాధ పడతాడు. వివేక్ జానుని తిడతాడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని తిడతాడు. నన్ను వంటి మనిషిగా పని మనిషిగా చేసేసిందని తాను ఇంటికి యజమానురాలు అయిపోయిందని జాను అంటుంది.
అరవింద అత్తయ్య తనకు ఇంటి తాళాలు ఇస్తే లక్ష్మీ తీసుకొని దేవయానికి ఇచ్చిందని అప్పుడే తన బుద్ధి తెలిసిపోయిందని జాను అంటుంది. దేవయాని మనీషా దగ్గరకు వెళ్లి కిట్టీ పార్టీకి తీసుకెళ్లి జాను విశ్వరూపం చూపించేలా చేశావ్ అని దేవయాని మనీషాని అడుగుతుంది. దాంతో మనీషా తన టార్గెట్ మిత్ర అని లక్ష్మీ, జానులు కలిసి ఉంటే కష్టమని ఇద్దరి అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ పెట్టి ఆస్తి పంపకాలు అయ్యేలా చేసి మిత్ర ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తానని మిత్రతో పాటు నేనే వెళ్తానని అంటుంది. అక్కా చెల్లెళ్లు విడిపోయిన తర్వాత జానుని తన్ని తరిమేసి వివేక్‌కి మీకు నచ్చిన పెళ్లి చేయమని అంటుంది. దేవయాని చాలా సంతోషిస్తుంది.
లక్ష్మీ చెల్లి మాటలు తలచుకొని ఏడుస్తుంది. మిత్ర కూడా బాధపడుతుంటాడు. జయదేవ్ మిత్ర దగ్గరకు వెళ్తాడు. లక్ష్మీని ఓదార్చమని జయదేవ్ చెప్తాడు. దాంతో మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. జాను నీ చెల్లి తను నీ బిడ్డలాంటిది కదా తన మాటలు పట్టించుకోవద్దని అంటాడు. దాంతో లక్ష్మీ జాను కోసం బాధ పడటం లేదని వివేక్ గురించి ఆలోచిస్తున్నాను అని వివేక్‌ని మరిదిలా కాకుండా కొడుకులా చూశానని నా బిడ్డని నేను ఎప్పుడైనా పనోడిలా చూశానా మా మాట భరించలేకపోతున్నాను అని ఏడుస్తుంది. ఈ ఇంట్లో ఇలా జరిగిందేంటి అని మిత్రని పట్టుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.