Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, జయదేవ్ వాళ్లు మాట్లాడుతుంటే అక్కడికి అర్జున్ వస్తాడు. సరయు విచారణ నుంచి తప్పించుకోవడానికి డ్రామాలు అడుతుందని చెప్తాడు. మనకి అనుకూలంగా తీర్పు వస్తుందని లక్ష్మీ అంటే దానికి అర్జున్ మనం నిరూపించాల్సినవి చాలా ఉన్నాయని అంటాడు. పార్వతిని సరయునే అరేంజ్ చేసుంటుందని లక్ష్మీ వివేక్‌కి ఓ ప్లాన్ చెప్పి కేసుకు సంబంధించి ముఖ్యమైన ఆధారమని సమాచారం కచ్చితంగా తీసుకురమ్మని చెప్తుంది. వివేక్ బయటకు వెళ్తాడు. 


ఇక అర్జున్ మున్నార్‌లో లక్ష్మీ ఉన్న విషయం గురించి మిత్రతో మాట్లాడమని చెప్తాడు. మిత్ర నీ వైపు ఉండటం నీకు చాలా అవసరం అని లక్ష్మీని మిత్ర దగ్గరకు అర్జున్ పంపిస్తాడు. ఇక పార్వతి జడ్జికి నిజం చెప్పేస్తానని అంటుంది. మీ పేరు కూడా చెప్పేస్తా అంటే సరయు చంపేస్తా అని అంటుంది. పార్వతి భయపడుతుంది. కేసు ఓడిపోతే జైలుకి పార్వతి వెళ్లాల్సి వస్తుందని మమల్ని ఇరికించకపోతే నీకు చాలా డబ్బులు ఇస్తామని చెప్తే పార్వతి ఒప్పుకుంటుంది. ఇక మనీషా వస్తే ఇంకా ఫీజ్ ఇవ్వాలని లాయర్ చాణక్య అడిగితే ఇంకా ఏంటి అని మనీషా నోరెళ్లబెడుతుంది. తప్పదు అని సరయు అంటే మనీషా సరే కానీ కేసు గెలిస్తే చాలు అంటుంది.  పార్వతి మనీషాతో మేడం మీరు మీరు ఒకటై అన్యాయం చేయొద్దని అంటుంది.  ఇక సరయు కేసు ఓడిపోతే పాపని ఎత్తుకుపోమని రౌడీలతో చెప్తుంది. 


లక్ష్మీ మిత్ర దగ్గరకు వెళ్లి భాస్కర్ ఇంట్లో ఉండి చెప్పనందుకు క్షమాపణ చెప్తుంది. లక్ష్మీ కారణం చెప్పబోతే మిత్ర ఆపి ఏం చెప్పొద్దని ఆపుతాడు. షేర్లు ప్రవీణ్ మిట్టల్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పమని అడుగుతాడు. అది ఒక్కటి చెప్తే చాలు అంటాడు. ఆ రోజు నువ్వు ఆ పని చేయడం వెనక కారణం చెప్పు అంటే లక్ష్మీ మనసులో చెప్పలేను అనుకొని ఇప్పుడు అవన్నీ వద్దని అంటుంది. తాను నోరు తెరిస్తే మనీషా అత్తమ్మని జైలుకి పంపిస్తుందని అనుకుంటుంది. ఇంతలో అర్జున్ రావడంతో మిత్ర అర్జున్‌తో మీ ఫ్రెండ్ ఇంకా నా దగ్గర చాలా విషయాలు దాచింది అవన్నీ నాకు తెలియాలి అంటాడు. టైం వస్తే తనే చెప్తుందని అర్జున్ అంటాడు. ఇక అర్జున్ వివేక్ తొందరగా రావాలని చెప్తాడు. కోర్టు సీన్ మళ్లీ ప్రారంభం అవుతుంది. సరయు నాటకం ఆడిందని అర్జున్ చెప్తాడు. ఇక లాయర్ చాణక్య అలా ఏం కాదని బీపీ వల్ల పడిపోయిందని చెప్తాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఆధారంగా పాపని పార్వతికి ఇవ్వాలని చెప్తాడు.


అర్జున్ ఏం ఆధారాలు చూపించలేకపోయాడని డబ్బు పలుకుబడితో మిత్ర సాధారణ మహిళలకు ద్రోహం చేసి ఆ బిడ్డను దక్కించుకోవాలని అనుకుంటున్నాడని పార్వతికి న్యాయం చేయమని కోరుకుంటారు. ఇక జడ్జి చెప్పడానికి ఏమైనా ఉందా అని అర్జున్‌ని అడిగితే అర్జున్ సైలెంట్ అయిపోతాడు. ఇంతలో అర్జున్ లక్ష్మీ చెప్పిన సాక్ష్యాలు తీసుకొస్తాడు. ఇక అర్జున్ పార్వతిని బోనులోకి పిలిపిస్తాడు. ఈ కేసు చాణక్య గారు ఫ్రీగా వాదించలేదని సరయు స్పాన్సర్‌ చేసినట్లే ఇప్పుడు ఈ పార్వతి సాధారణ మహిళ కాదని తానో లక్షాధికారని చెప్పి బ్యాంక్ స్టేట్‌మెంట్లు జడ్జికి చూపిస్తాడు. పార్వతి అకౌంట్లో సరయు పది లక్షలు వేసిందని చెప్తాడు. పాస్ బుక్‌లో పార్వతి పేరు దేవి అని పార్వతి అని దొంగ పేరు పెట్టుకొని పాప కోసం వచ్చిందని తాను ట్రైలర్ కాదు యాక్టరని ఫ్రూప్స్ చూపిస్తాడు.  మనీషా, సరయులు కంగుతింటారు. దేవీ అనే అర్టిస్ట్‌తో ఈ వేషం వేయించి బిజినెస్‌లో డౌన్ చేయడానికి సరయు ఇలా ప్లాన్ చేసిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి సుపారీ ఇచ్చిన జ్యోత్స్న.. జ్యో ముందే ఫోన్‌లో కార్తీక్, దీపల రొమాంటిక్ ముచ్చట్లు!