Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా లక్కీ పుట్టుక గురించి తెలీకూడదు అని మున్నార్ హాస్పిటల్‌ని తగలబెట్టేసిందని లక్ష్మీ అరవిందతో మనీషా గురించి చెప్తుంది. మనీషా మాత్రం లక్ష్మీ తనని ఇంటి నుంచి పంపేయడానికి లక్కీని దేవతని చేయాలని చూస్తుంది. మిత్ర ప్రాణాల కంటే ఈ ఇంట్లో కోడలిగా చలామణి అవ్వాలని ఉంది ఆంటీ అని అంటుంది. 

ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నా కొడుకుని కాపాడుకునే ప్రయత్నం నేను ఆపను అని చెప్పి అరవింద వెళ్లిపోతుంది. మనీషా మనసులో లక్కీ పుట్టిన హాస్పిటల్ తగలబెట్టా.. భాస్కర్‌ని తరిగికొట్టా ఇంక నువ్వేం చేయలేవే పిచ్చి లక్ష్మీ అని మనీషా అనుకుంటుంది. మిత్ర భాస్కర్ కోసం కనుక్కోమని కొందరికి చెప్తాడు. ఆయన మిత్రకు కాల్ చేసి సమాచారం ఇస్తాడు. మిత్ర వెంటనే విషయం లక్ష్మీకి చెప్పాలి అనుకుంటాడు. ఇంతలో లక్ష్మీ రావడంతో లక్కీ తల్లి గురించి భాస్కర్‌కి మాత్రమే తెలుసు ఆయన అడ్రస్ దొరికిందని మిత్ర లక్ష్మీతో చెప్తాడు. 

వివేక్‌ కూడా లక్ష్మీకి కాల్ చేసి తన ఫ్రెండ్ ద్వారానే మిత్ర అడ్రస్ తెలుసుకున్నాడని చెప్తాడు. నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తుంది. ఇక లక్ష్మీ మిత్రని హగ్ చేసుకుంటుంది. ఇప్పుడే వెళ్దామని లక్ష్మీ, మిత్ర ఇద్దరూ లక్కీ మదర్ కోసం తెలుసుకోవడానికి వెళ్తారు. ఇక మనీషా టెన్షన్ పడుతుంటే సరయు మనీషాతో నా మనుషులను పంపాను భార్యభర్తల్ని చంపేయమని చెప్తానని అంటుంది. వాళ్లు చనిపోయే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు అని మనీషా అంటుంది. మిత్ర తనకు దక్కిన తర్వాత నందన్ కంపెనీలను నువ్వు తీసుకొని నీకు నచ్చినట్లు చేసుకో అని సరయుతో మనీషా చెప్తుంది. 

సరయు మనుషులు భాస్కర్ ఇంట్లోకి దూరుతారు. భాస్కర్‌కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పమని ఆమెను భయపెడతారు. ఇక మిత్ర వాళ్లు వివేక్ అందరూ అక్కడికి వస్తారు. భాస్కర్ ఫొటో చూపించి ఇళ్లు కోసం వెతుకుతారు. రౌడీలు బెదిరించడంతో భాస్కర్ పరుగున ఇంటికి వస్తాడు. లక్ష్మీ వాళ్లు వచ్చి భాస్కర్ ఇంటి డోర్ కొడతారు. రౌడీలు భాస్కర్ భార్యని తీసుకొని బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోతారు. మిత్ర వాళ్లు డోర్ కొడుతూనే ఉంటారు. వివేక్ వచ్చి డోర్ తీసి భాస్కర్ వాళ్లు పారిపోయినట్లున్నారని అంటాడు. ఇక భాస్కర్ తప్పించుకోవడానికి ఏదో కారు అనుకొని మిత్ర వాళ్ల  కారు డిక్కీలో దాక్కుంటాడు. ఇక లక్ష్మీ వాళ్లు ఇంటికి బయల్దేరుతారు. 

సరయు, మనీషా దగ్గరకు భాస్కర్ భార్యని తీసుకొస్తారు. ఇది ఒక్కర్తే ఎందుకు అంటే ఇంతలో అక్కడికి మిత్ర వాళ్లు వచ్చారని చెప్తారు. భాస్కర్ భార్య ఫోన్ నుంచి కాల్ చేస్తే భాస్కర్ కాల్ లిఫ్ట్ చేయడు. నా భర్త ఏం నిజం చెప్పడు మమల్ని వదిలేయండి అని భాస్కర్ భార్య బతిమాలుతుంది. నిజం చెప్తే మీ ఇద్దరి ప్రాణాలు తీసేస్తానని అంటుంది. భాస్కర్ మిత్రకు దొరికితే ఏం చేయాలో అది చేస్తానని మనీషా అంటుంది. మనీషా దేవయానికి కాల్ చేసి లక్ష్మీ, మిత్రలు ఇంటికి వచ్చారా అని అంటుంది. లేదు అనగానే వాళ్లకి భాస్కర్ దొరికిపోయినట్లు ఉన్నాడు నేను వచ్చేలోపు మీరే మ్యానేజ్ చేయండి అంటుంది. దేవయాని నోరెళ్లబెడుతుంది. ఇంతలో అక్కడికి జాను కాకరకాయ జ్యూస్ తీసుకొస్తుంది. బలవంతంగా కాకర కాయ జ్యూస్ తాగించేస్తుంది. ఇక లక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. లక్ష్మీ డిక్కీలో షర్ట్ చూస్తుంది. ఎవరిది అని అడుగుతుంది. మిత్ర, వివేక్ డిక్కీ ఓపెన్ చేస్తారు. అందులో భాస్కర్ ఉంటాడు. భాస్కర్ ఎలా వచ్చాడని అనుకుంటారు. భాస్కర్ కళ్లు తిరిగి పడిపోయి ఉంటే లోపలికి తీసుకెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!