Chinni Serial Today Episode మధుకి మ్యాడీనే మహి అని తెలిసిపోవడంతో మహితో తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుంటుంది. సత్యంబాబు ఇంటికి, స్కూల్‌ ఇలా అన్నీ ప్లేస్‌లు తిరిగి చివరకు పానీ పూరీ తిని అన్ని చోట్లా సెల్ఫీలు తీసుకుంటారు.

Continues below advertisement

మధు రాత్రి మ్యాడీ కోసం బట్టలు కుడుతుంది. చిన్నప్పుడు నువ్వు ఎక్కువ కుర్తాలు వేసుకునేవాడివి నీ కోసం ఇలా మొదటి సారి కుర్తా కుట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని అనుకుంటుంది. చంటి చూసి ఏంటి అక్కా అర్థరాత్రి బట్టలు కుడుతున్నావ్ అంటే మీ అక్క రాత్రి నుంచి బట్టలు కుడుతుంది అని స్వరూప చెప్తుంది. నా కోసం రాత్రంతా కష్టపడి బట్టలు కుడుతున్నావా అని చంటి అడిగితే నీకు కాదురా మ్యాడీ కోసం అని మధు చెప్తుంది. 

మధు పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని కుర్తా చూసి మహి  ఈ కుర్తాలో నువ్వు పెళ్లి కొడుకులా ఉంటావ్ అని అనుకుంటుంది. తర్వాత మ్యాడీ గదికి వెళ్లి పెళ్లి కూతురు బొమ్మ పట్టుకొని నువ్వే నేను నేనే నువ్వు నువ్వు కేవలం పెళ్లి కూతురు బొమ్మవి నేను మాత్రం మహి పక్కన ఉంటే పెళ్లి కూతుర్ని.. మహి తన ఫ్యామిలీతో సంతోషంగా కలిసిపోయిన తర్వాత నేనే చిన్ని అని మహికి చెప్తా అని అనుకుంటుంది. 

Continues below advertisement

మ్యాడీ నిద్ర లేని ఏంటి మధు నువ్వు ఇక్కడ అంటే నిన్ను నిద్ర లేపి నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా అని చెప్తుంది. ఏంటి గిఫ్ట్ అని మ్యాడీ అడిగితే ఈ డ్రస్ అని డ్రస్ చూపిస్తుంది. ఇంతలో చంటి వచ్చి ఈ అమెరికా అబ్బాయి కోసం ఈ ఇండియా అమ్మాయి తెల్లార్లు డ్రస్ కుట్టిందని చెప్తాడు. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మధు మ్యాడీతో తలంటి స్నానం చేయిస్తా త్వరగా రా అని పిలుస్తుంది. 

స్వరూప బట్టలు తీసుకెళ్తూ అందులో నుంచి మధుకి సంబంధించిన ఓ చున్నీ పడేస్తుంది. అందులో చిన్నప్పుడు మ్యాడీ ఇచ్చిన వాచ్ ఉంటుంది. మ్యాడీ ఈ చున్నీ తీయబోయే టైంకి చంటి వచ్చి నేను తీస్తా అమెరికా అబ్బాయ్ అని అంటాడు.  చంటీ తీసుకొని వెళ్లిపోతాడు.

లోహిత రెడీ అయితే వరుణ్ చూసి ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావ్ అని దీపావళి శుభాకాంక్షలు చెప్తాడు. లోహిత డల్ అయిపోతే వరుణ్ ఏమైందని అడుగుతాడు. ఇది మనకు మొదటి పండగ అయితే మీ ఇంట్లో చేసుకోవాలి లేదంటే మా ఇంట్లో చేసుకోవాలి కానీ ఇలా ఎక్కడో జరుపుకుంటున్నాం.. నా వల్లే నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావ్ అని లోహి అంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా త్వరలోనే మనం మన ఇంటికి వెళ్తాం మ్యాడీ బావ మనల్ని తీసుకెళ్తాడని వరుణ్ అంటాడు. 

మ్యాడీకి తలంటి స్నానం చేయిస్తామని మధు, చంటిలు వెంటపడితే మ్యాడీ వద్దని పరుగులు తీస్తుంటాడు. లోహిత, వరుణ్ అది చూస్తారు. మ్యాడీ మొత్తం పరుగులు పెడుతుంటే మధు, చంటి పట్టుకొని లాక్కొచ్చి స్నానం చేయిస్తారు. మధు తలకు ఆయిల్ రాసి ఒళ్లంతా నలుగు పెట్టి కుంకుడు కాయలతో తలస్నానం చేయిస్తుంది. ఛీ అనుకుంటూ లోహిత వెళ్లిపోతుంది. మ్యాడీ కళ్లు ఎర్రగా ఉండటంతో కళ్ల ఉప్పు బుగ్గలో పెట్టుకో ఎరుపు తగ్గిపోతుందని మ్యాడీకి చెప్తుంది. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని మ్యాడీ అంటాడు. మధు తనలో తాను నా ఫ్రెండ్ నా లవర్‌ నా మహి అందరూ ఒక్కరే అయినందుకు నేను చాలా లక్కీ అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.