Chinni Serial Today Episode మధు, స్వప్న పరీక్షల కోసం పెన్నులు కొంటూ ఉంటే ఓ అబ్బాయి వచ్చి నాన్న హాస్పిటల్‌లో ఉన్నారు అమ్మతో మాట్లాడాలి అర్జెంట్ అంటూ మధు ఫోన్ తీసుకుంటాడు. ఓ నెంబరుకి డైల్ చేసి తర్వాత డిలీట్ చేస్తాడు. చూస్తే ఇదంతా ఎవరో కావాలనే మధుని ఏదో విషయంలో టార్గట్ చేసినట్లు అర్థమవుతుంది.

Continues below advertisement

నాగవల్లి కాలేజ్‌కి వచ్చి శ్రేయకి లంచ్ బాక్స్ ఇచ్చి మ్యాడీ కోసం తీసుకొచ్చా..  ఎలా అయినా మ్యాడీకి తినమని చెప్పు వాడు తినకపోతే నేను తినను అని చెప్పు అని ఇస్తుంది. మీరు ఇంత ప్రేమతో తీసుకొస్తే బావ ఎందుకు తినకుండా ఉంటాడు అత్తయ్యా అని శ్రేయ బాక్స్ తీసుకొని వెళ్తుంది. 

మధు నాగవల్లిని చూసి దగ్గరకు వెళ్తుంది. టీవీలో వచ్చిన న్యూస్‌ చూసి మీరు అంకుల్ బాధ పడుంటారని నాకు తెలుసు సారీ అంటీ అని అంటుంది. నాగవల్లి కోపంగా చూస్తుంది. నేను నిజంగా మ్యాడీని మిమల్ని కలపాలి అనుకొని వచ్చా కానీ మీడియా వస్తుంది అని అనుకోలేదు అంటుంది. మేం నీకు ఏం ద్రోహం చేశామనే నువ్వు మమల్ని పట్టుకొని పీడిస్తున్నావ్ అని నాగవల్లి అంటుంది. మ్యాడీని మీ ఇంటికి వెళ్లిపోమని అంటే తను వరుణ్‌ వాళ్లు వస్తేనే ఇంటికి వస్తా అంటున్నాడు మీరు అర్థం చేసుకొని ఒక మెట్టు దొగొచ్చు కదా ఆంటీ అంటుంది. వాడికే అంత ఉంటే నాకు ఇంకెంత ఉండాలి అని నాగవల్లి అంటుంది. వాడి మొండితనం వెనక నువ్వు ఉన్నావు అని సంగతి నాకు బాగా తెలుసు.. పైకి రాయభారం చేస్తూనే వాడికి బాగా ఎక్కించుంటావ్,, అందుకే వాడు అలా ప్రవరిస్తున్నాడు అని నాకు తెలుసు.. నా జీవితంలో ఉన్న అతి పెద్ద ఏకైక శత్రువు నువ్వే.. మ్యాడీని మాకు దూరం చేసిన నిన్ను అతి త్వరలోనే మట్టి కరిపిస్తా చూస్తూఉండు అని వార్నింగ్ ఇస్తుంది.

Continues below advertisement

మధు ఫోన్ వాడిన  అబ్బాయి నాగవల్లి పీఏకి కాల్ చేసి మధు నెంబరు తీసుకున్నా మీరు చేయాల్సిన పని చేయండి అని అంటాడు. ఇక మధు, మ్యాడీని కలిసి హాల్‌ టికెట్ తీసుకుందాం వెళ్దాం పద అని తీసుకెళ్తుంది. మ్యాడీ లోహితను కూడా పిలుస్తాడు. ముగ్గురు అందరితో పాటు ఫీజు కట్టడానికి వెళ్తారు. చందు అందరి దగ్గర ఫీజు తీసుకోవడం చూసిన లోహిత అన్నని చూసి షాక్ అయిపోతుంది. దాంతో మధు వాళ్లతో తర్వాత కడతాను అంటుంది. ఏం కాదులే అని మ్యాడీ, మధులు లోహితను తీసుకెళ్తారు.

మధు చందుని విష్ చేసి మాట్లాడుతుంది. ముగ్గురి డబ్బులు మధు ఇస్తుంది. మధు, మ్యాడీ, లోహిత సంతకాలు పెడతారు. లోహిత ముఖానికి బుక్ అడ్డంగా పెట్టుకొని సంతకం పెడుతుంది. చందు చూసి లోహితను ప్రశ్నించాలి అనుకుంటాడు. కానీ లోహిత కాలేజ్‌లో తనని చెల్లి అని చెప్పొద్దని అన్న విషయం గుర్తు చేసుకొని చందు ఆగిపోతాడు.

మధు, మ్యాడీ వాళ్లు గ్రౌండ్‌లో ఆడుకుంటూ వంటే ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ పిలుస్తున్నారని మధుని పిలుస్తారు. ప్రిన్సిపల్ కోపంగా ఉన్నారని కూడా చెప్తాడు. మధు చాలా భయపడుతుంది. ఏం కాదులే అని మ్యాడీ తీసుకెళ్తాడు. అందరూ వెళ్తారు. మంచి స్టూడెంట్‌వి కాలేజ్ పరువు నిలబెడతావు అనుకుంటే నువ్వు ఇలా కాలేజ్ పరువు తీసేలా స్కామ్‌లు చేస్తావు అనుకోలేదు అని ప్రిన్సిపల్ అంటారు. మధు మ్యాడీ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏమైంది సార్ మధు అలాంటిది కాదు అని మ్యాడీ అంటాడు.

ప్రిన్సిపల్ మధు పోన్ తీసుకొని లక్ష, ఒకసారి రెండు లక్షలు నీ అకౌంట్‌కి క్రెడిట్ అయ్యావి అని మెసేజ్‌లు చూపిస్తారు. మధు మ్యాడీ ఇద్దరూ షాక్ అయిపోతారు. నాకు ఏం తెలీదు సార్ అని మధు అంటుంది. సెమిస్టర్‌లో మంచి మార్కులు వేయిస్తా అని మధు కొంత మంది పిల్లల దగ్గర డబ్బు తీసుకుంది.. పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. యూనివర్సిటికీ కూడా కంప్లైంట్ ఇచ్చారు అని అంటుంది.

సంజు ఈ విషయం లోహిత, శ్రేయలకు చెప్తాడు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. అందరూ ప్రిన్సిపల్ రూంకి వెళ్తారు. మధు అలా చేయదు సార్ ఎవరో మధుని ఇరికించారని మ్యాడీ అంటాడు.  ప్రిన్సిపల్ నమ్మరు. మధుకి హాల్‌టికెట్ ఇవ్వను అని చెప్తారు. ఇక నుంచి నువ్వు మా కాలేజ్ స్టూడెంట్ కాదు అని అంటారు. మధు ఏడుస్తూ వెళ్లిపోతుంది. మ్యాడీ వెనకాలే వెళ్తాడు. మధు తప్పు చేసిందని సంజు అంటే మధు నిర్దోషి అని సాయంత్రంలోపు నిరూపిస్తా అని మ్యాడీ అంటాడు.

మ్యాడీ మధుని ధైర్యం చెప్తాడు. సాయంత్రంలోపు నీ హాల్‌ టికెట్ నీ దగ్గర ఉంటుందని అంటాడు. శ్రేయ నాగవల్లికి కాల్ చేసి విషయం చెప్తుంది. నాగవల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. లోహి, శ్రేయ గెంతులేస్తారు. నాగవల్లి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో దేవా ఇంటికి వస్తాడు. దేవా చేతికి గాయం చూసి నాగవల్లి కంగారు పడుతుంది. ఏమైందని అడిగితే ఆఫ్‌ టికెట్ బాలరాజు దగ్గరకు వచ్చాడని అంటాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.