Chinni Serial Today Episode స్వప్న మధుతో నువ్వే చిన్ని అని మ్యాడీకి చెప్పేయ్ అంటుంది. మధు రేపు చెప్తా అది కూడా స్పెషల్‌గా చెప్తా అని అంటుంది. లోహిత మొత్తం చాటుగా విని షాక్ అయిపోతుంది. ఇక మధు మ్యాడీతో నువ్వు చిన్ని మీద చాలా ప్రేమగా మాట్లాడావు.. ఎమోషనల్ అయ్యావు.. ఈ టైంలో నువ్వు బైక్ డ్రైవ్‌ చేయడం కరెక్ట్‌ కాదు నేను డ్రాప్ చేస్తా అని మధు అంటుంది. 

Continues below advertisement

మధు మ్యాడీని డ్రాప్ చేస్తుంది. మధు, మ్యాడీని చూసి శ్రేయ నాగవల్లిని పిలుస్తుంది. నాగవల్లి చూసి కోపంతో రగిలిపోతుంది. మధు దగ్గరకు వెళ్లి ఎంత ధైర్యమే నీకు మళ్లీ నా కొడుకుతో తిరుగుతున్నావ్ డోస్ సరిపోలేదా.. నేను ఏదైనా ఒక్కసారి చెప్తా.. రెండో సారి సర్లేఅని చూస్తా మూడో సారి మాత్రం చంపేస్తా అని అంటుంది. మ్యాడీ నా ఫ్రెండ్ మ్యాడీ చిన్ని కోసం ఆలోచించి డల్‌గా ఉన్నాడు అందుకే ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశా అని అంటుంది. నా మీద కోపాన్ని మీరు తగ్గించుకుంటే నేను చేసేది మంచో చెడో మీకు అర్థమవుతుందని మధు అంటుంది. మీ బెదిరింపులకు నేను భయపడను.. ఎలా అయినా చిన్నిని మ్యాడీ ముందు ఉంచుతా అర్థం చేసుకోండి అని మధు చాలెంజ్ చేస్తుంది. 

మ్యాడీని దేవా ఆపి చిన్ని గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. మీరు పెట్టిన గడువుకి ఒక్క క్షణం ముందు అయినా చిన్ని నా దగ్గరకు వస్తుందని నాకు నమ్మకం ఉందని మ్యాడీ అంటాడు. ఇక మ్యాడీ పెద్దమ్మతో కలిసి ఇంట్లో జరిగే పూజకు సంబంధించి సామాగ్రి తీసుకురమ్మని అంటాడు. ప్రమీల మధుని పిలిచావా అని అడుగుతుంది.లేదు అని మ్యాడీ అంటాడు. మీ ఇద్దరి స్నేహం చూస్తే చిన్ననాటి చిన్ని గుర్తొస్తుంది. అలాంటి తనని పిలవకపోవడం ఏంటి నాన్న అని అంటుంది. 

Continues below advertisement

మధు దేవుడికి దండం పెట్టుకొని లోహి మారాలి.. తాను మహి త్వరగా కలవాలి అని కోరుకుంటుంది. ఇంతలో మధు తమ్ముడు గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొచ్చి మధుకి ఇస్తాడు. రాత్రి తిను అక్క ఈరోజు ఉపవాసం కదా అని అంటాడు. ప్రసాదం ఉపవాసం ఉన్నా తినొచ్చు అని తండ్రి చెప్పడంతో మధు తింటుంది.ఇంతలో అక్కడికి మ్యాడీ  పెద్దమ్మతో కలిసి వస్తాడు. ప్రమీల మధు ఫ్యామిలీని పూజకి పిలుస్తుంది. మధు వస్తుందని మధు తల్లిదండ్రులు చెప్తారు. 

నాగవల్లి ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. అందరూ మ్యాడీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో మధుని తీసుకొని మ్యాడీ వాళ్లు వస్తారు. అది చూసి శ్రేయ షాక్ అయిపోతుంది. వసంత, నాగవల్లి వాళ్లకి చూపిస్తుంది. నాగవల్లి మధుని చూసి కోపంతో ఉంటుంది. మ్యాడీ, మధు ఇద్దరూ ఇంట్లో ఒకేసారి కుడి కాలు పెట్టి వస్తారు. శ్రేయ మధుని చూసి నిన్ను ఎవరు పిలిచారు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ప్రమీల ఆంటీ వాళ్ల పిలిచారు అని మధు అంటుంది. నాగవల్లి కోపంగా చూస్తుంది. ఇక శ్రేయ కోపంతో వెళ్లిపోతుంది. నాగవల్లీ కోపంగా వస్తే వచ్చింది కదా ఏమైనా పనులు ఉంటే చూసుకోమని చెప్పు అని అంటుంది. మధు వెళ్తుంది. మ్యాడీ రెడీ అవ్వడానికి వెళ్తాడు. 

నాగవల్లి ప్రమీలతో నీతో మాట్లాడాలి రా అక్క అనిపిలుస్తుంది. మధుని నీకు ఎవరు పిలవమని చెప్పారు అని అంటుంది. దాని ఇంటికి వెళ్లి తీసుకురావడం ఏంటి. అంతగా పిలవాలి అంటే ఫోన్ చేస్తే సరిపోయేది కదా అంటే మ్యాడీ వినలేదు దగ్గర్లోనే ఇళ్లు ఉందని అంటుంది. ఇక నుంచి నాకు చెప్పకుండా ఏం పనీ చేయొద్దని నాగవల్లి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.