Chinni Serial Today Episode: చిన్ని దినకర్‌కి తను చెప్పినట్లు చేయమని అంటుంది. సార్ వాళ్లకి నిజం తెలిస్తే ఈ దినకర్‌కి దినం పెట్టేస్తారు.. నేను చేయను మేడం అని దినకర్ చిన్నితో చెప్తాడు. చిన్ని మాత్రం వదలదు.. నువ్వు మీ బాస్ సుద్దపూసలు కాదు కదా.. నేను ఫోకస్ పెట్టి మీ గురించి బయట పెడితే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. దాంతో దినకర్ చిన్ని కాళ్ల కింద పడిపోయి మీరు చెప్పినట్లు చేస్తా మేడం అని బతిమాలుతాడు. 

Continues below advertisement

మ్యాడీ ఆలోచిస్తూ ఉంటే చిన్ని వచ్చి నేను రావడం లేదని ఆలోచిస్తున్నారా.. అని అంటుంది. దినకర్ వచ్చినప్పుడు నీ ఓవర్‌యాక్షన్ భరించా అని ఇప్పుడు భరిస్తా అనుకుంటున్నావా అని మ్యాడీ అడుగుతాడు. అవును భరించాలి భర్త అంటేనే భరించడం కదా అని అంటుంది. మ్యాడీకి మందులు ఇస్తుంది. సడెన్‌గా మ్యాడీకి ఎక్కిళ్లు వస్తాయి. మంచి నీరు తాగినా తగ్గకపోవడంతో నువ్వే తిడుతున్నావ్ కదా అని మ్యాడీ అంటే మిమల్ని చేసుకున్నందుకు నన్ను నేను తిట్టుకుంటా కానీ మిమల్ని తిట్టను అని అంటుంది. ఎక్కిళ్లు ఆగటానికి ఏదో ఒకటి చేయ్ అని మ్యాడీ అంటే మధు షాక్ ఇవ్వాలని మ్యాడీని ముద్దు పెడుతుంది. దాంతో మ్యాడీ తిడతాడు. అయితే నా ముద్దు నాకు తిరిగి ఇచ్చేయ్ అని మధు అడుగుతుంది.

చిన్ని చెప్పినట్లు దినకర్ కోయిదొరలా గెటప్ మార్చి ఇంటికి వస్తాడు. చిన్నికి కాల్ చేస్తే రెండు నిమిషాలు ఆగి వచ్చేయ్ అని చెప్తుంది. నాగవల్లి, శ్రేయ, లోహిత మాట్లాడుతూ ఉంటే చిన్ని కాఫీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. ఇంతలో ప్రమీల గుడి నుంచి అర్చన చేయించుకొని వచ్చా ఇక నుంచి అంతా మంచే జరుగుతుందని అంటుంది. శనిగ్రహం ఇంట్లో ఉంటే ఏం మంచి జరుగుతుందని లోహిత సెటైర్లు వేస్తుంది. అప్పుడే దినకర్ కోయి దొరలా ఎంట్రీ ఇస్తాడు. నీలాంటి వాళ్లని చాలా మందిని చూశాం వెళ్లు అని లోహిత అంటే లోహిత కాళ్లలో చిన్ని కాలు పెట్టి పడేస్తుంది. దినకర్ కోయి దొరలా మాట్లాడుతూ ఇంటి బిడ్డకి పెద్ద గండం తప్పింది.. మరో గండం కూడా వస్తుంది అని అనడంతో నాగవల్లి లోపలికి తీసుకెళ్తుంది. ఇంటికి ఇంటి వారసుడికి అరిష్టం ఉంది.. దాని వల్లే గండాలు మీద గండాలు వస్తున్నాయి అని చెప్తాడు. అందరూ షాక్ అయి చూస్తారు. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే వెంటనే శుభకార్యాలు జరగాలి అని అంటారు. ఏం చేయమని అంటారు కోయిదొర అని నాగవల్లి అడిగితే రేపు శ్రీరామనవమి సందర్భంగా మ్యాడీ, చిన్నిల చేత సీతారాముల కల్యాణం జరిపించమని అంటారు. తర్వాత నల్లపూసలు వేయించమని చెప్తారు. 

Continues below advertisement

మ్యాడీ మనసులో దీనికి మమ్మీ ఒప్పుకోదు.. మమ్మీ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని అనుకుంటాడు. నాగవల్లి మాత్రం రేపే ఆ కార్యక్రమం చేయిస్తా అని అంటుంది. దానికి చిన్ని నేను ఒప్పుకోను అని అంటుంది. కోడలిగా ఇంట్లోకి వచ్చావ్ మ్యాడీ ఆయుష్షు కోసం చేయవా అని అంటుంది నాగవల్లి. నేను చేయడం లేదు అనడం లేదు నా గడువు పూర్తయిన తర్వాత నా పుట్టింటి వాళ్ల సమక్షంలో జరిపిస్తా అని అంటుంది. దానికి నాగవల్లి నీ పుట్టింటి వాళ్ల సమక్షంలో జరిపిస్తా అని నాగవల్లి అంటుంది. అయితే సరే అని చిన్ని అంటుంది. మ్యాడీ వద్దని అంటాడు. దేవా కూడా మ్యాడీకి ఇష్టం లేదు కదా వదిలేయ్ అంటే లేదు జరగాల్సిందే అని నాగవల్లి అంటుంది.  

మ్యాడీ ఒప్పుకోను అంటే నాగవల్లి మ్యాడీని పక్కకి తీసుకెళ్లి.. కొన్ని తప్పిపోవాలి అంటే కొన్ని ఒప్పుకోవాలి అంటుంది. తన మెడలో తాళి కట్టినందుకు నేను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో అర్థం చేసుకో మమ్మీ అని అంటాడు. ఆ చిన్ని కోసం ఆలోచించకు నాన్న 30 రోజుల గడువులో కొన్ని రోజులు అయిపోయావి.. ఇంకా కొన్నే ఉన్నాయి,, అవి అయిపోతే ఆ చిన్ని మన ఇళ్లు వదిలేసి వెళ్లిపోతుంది. తన గురించి అంత ఎక్కువ ఆలోచిస్తున్నావ్ అంటుంది. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను నాన్న.. ఏ కారణం చేత అయినా నిన్ను నష్టపోవడానికి నేను రెడీగా ఉండలేను.. తను చెప్పినట్లు చేస్తే గండం పోతుందని కోయి దొర చెప్పారు. కదా అందుకే నేను ఒప్పుకున్నా అని నాగవల్లి అంటుంది. నీ జాతకంలోని దోషం పోవడానికి ఎవరు ఎలాంటి పరిహారం చెప్పినా నేను మనసా వాచా ఖర్మనా నమ్మి చేస్తాను నాన్న.. కనకపోయినా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అని అంటుంది. దాంతో మ్యాడీ ఒప్పుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.