Chinni Serial Today Episode నాగవల్లి తన మనుషులతో ఆఫ్ టికెట్ మధుకి లెటర్ రాసినట్లు ఆఫ్ టికెట్ పార్కింగ్‌లో వెయిట్ చేస్తున్నట్లు తనని కలమని చెప్పినట్లు లెటర్ ఇప్పిస్తుంది. మధు అది చూసి షాక్ అయిపోతుంది. మధు కంగారుగా బయటకు వెళ్లడం నాగవల్లి చూస్తుంది.
దేవా, తిలక్‌తో మాట్లాడుతాడు. ఎన్నిరాజకీయాలు చేసుంటే ఈ స్థితికి వస్తావ్ అని అంటాడు తిలక్.. నువ్వు చేయలేక కదా ఇలా ఉండిపోయావ్.. అంటాడు. నీది కుళ్లు రాజకీయం అని తిలక్ అంటాడు. నాది కుళ్లు రాజకీయం అన్నావ్ అంటే నీ బుద్ధి తెలుస్తుంది.. అని దేవా అంటే త్వరలోనే నిన్ను అందరూ కొట్టా పంపేస్తారు అని తిలక్ అంటే నిన్ను తొందర్లోనే అతఃపాతాళంలోకి పంపేస్తా అనుకుంటాడు.
మధుని ఆఫ్ టికెట్ కలుస్తాడు. ఎందుకు ఇప్పుడు వచ్చావ్ అని మధు అడిగితే నువ్వు కదా చెప్పావ్.. అని ఆఫ్ టికెట్ చెప్తాడు. నేను నీతో మాట్లాడలేదు అని మధు అంటుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. నాకు తెలీకుండా నా చుట్టూ ఏదో జరుగుతుందని మధు అంటే ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో., నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు అలాంటిది ఇంటి కోడలు అయ్యావ్.. విషయం అంతా నీకు తర్వాత చెప్తా.. నువ్వు మాత్రం ఈ ఇంట్లో చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. మధుకి ఏం అర్థం కాక బిత్తరపోతుంది.
దేవాతో చాలా చాలా జాగ్రత్తగా ఉండు నిన్ను ఏమైనా చేస్తాడు అని అంటాడు. దేవా అంకుల్ చాలా మంచోళ్లు మొదట్లో మా మీద కోపం ఉన్నా ఆంటీ కోపం తగ్గించేసిందని మధు చెప్తుంది. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది చిన్ని.. దేవా చాలా దుర్మార్గుడు.. బాలరాజు అన్న మనకు కనిపించకుండా ఉండటానికి కారణం ఆ దేవానే.. అని చెప్తాడు. అంకులా అని మధు బిత్తరపోతుంది.
నాగవల్లి అంతా చాటుగా చూస్తూ తన మనుషులతో దేవా సార్ వస్తున్నారు.. నేను చెప్పినట్లు చేయ్ అని అంటుంది. మనుషులు దేవా దగ్గరకు వెళ్లి కత్తులు తీసుకొచి వచ్చి దేవాని పొడిచినట్లు నటిస్తారు. ఇంతలో మ్యాడీ వచ్చి వాళ్లని కొట్టి ఎందుకు మా డాడీని చంపాలి అనుకున్నారురా అంటే సార్‌ని చంపమని ఆఫ్ టికెట్ చిన్ని చెప్పారని అంటాడు. మధు వాళ్లు షాక్ అయి మధు ఆఫ్ టికెట్‌ని పారిపోమని అంటుంది. ఆఫ్ టికెట్ పారిపోతుంటే మ్యాడీ పట్టుకుంటాడు. మ్యాడీ ఆఫ్ టికెట్‌ని పట్టుకొని నువ్వు, చిన్ని ఎందుకు అటాక్ చేశారు అంటే నాకేం తెలీదు అంటాడు. చిన్ని ఎక్కడుందో చెప్పేవరకు కొట్టండి అని నాగవల్లి అంటే ఆఫ్ టికెట్ మధునే చిన్ని అని చెప్పకూడదు అనుకుంటాడు.
మ్యాడీ ఆఫ్ టికెట్‌ని పట్టుకొని చిన్ని ఎక్కడుందో చెప్పు అంటే మీ చిన్నప్పటి దారుణాలు చెప్పాలని నీ చుట్టూ చిన్ని తిరుగుతుంది. నేను చిన్ని నీకు ఆ నిజాలు తెలియాలి అని ప్రయత్నాలు చేస్తున్నాం అంతే కానీ మీ నాన్నని చంపాలని కుట్ర చేయలేదు అని అంటాడు. నిజాలకు అబద్ధాలకు తేడా తెలీక నువ్వు చిన్నిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అంటే ఏంట్రా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి అని ఇలా చెప్తున్నావా.. నా మీద అటాక్ చేసే అంత ధైర్యం ఉందా నీకు అని దేవా కొట్టే టైంకి ఆఫ్ టికెట్ పారిపోతాడు. మధునే చిన్ని అని తెలియలేదని నాగవల్లి డిసప్పాయింట్ అయిపోతుంది.
తిలక్ మ్యాడీ, మధుల కోసం పూల దండలు తీసుకొచ్చి వాటికి ఇచ్చి మార్చుకొనేలా చేస్తాడు. రిసెప్షన్‌లో అందరూ సంతోషంగా గడుపుతారు. మధుని ఆమె తల్లిదండ్రులు ఆఫ్ టికెట్‌ని ఎందుకు కొట్టారు.. నువ్వే చిన్ని అని తెలిసిపోయేలా ఉంది.. నువ్వు ఇలాంటి మనుషుల మధ్య ఉండటం భయంగా ఉంది అని అంటారు. ఏం కాదు నేను చూసుకుంటా.. ఇప్పుడిప్పుడే నాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయని మధు అంటుంది. మధుని జాగ్రత్తగా ఉండమని తల్లిదండ్రులు చెప్తారు. నాగవల్లి వచ్చి నేను మీ కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటా అని అంటుంది. నేను కూడా అత్తకు మించిన కోడలు అనిపించుకుంటా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.