Chinni Serial Today Episode ఆఫ్ టికెట్ మధుకి కాల్ చేస్తాడు. మధు ఫోన్ నాగవల్లి లిఫ్ట్ చేస్తుంది. ఆఫ్ టికెట్‌తో నాగవల్లి మధులా మాట్లాడుతుంది. ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి.. కలుద్దాం అని ఆఫ్ టికెట్ అంటే మా అత్తారింటికి వచ్చేయ్ అని చిన్నిలా నాగవల్లి చెప్తుంది. నాగవల్లి రిసెప్షన్ ఉందని చెప్పి నువ్వు వెంటనే రా అని ఆఫ్ టికెట్‌కి చెప్తుంది. ఆఫ్ టికెట్ సరే వస్తా అని అంటాడు.
ఆఫ్ టికెట్ వస్తే మధునే చిన్ని అని బయట పడేలా చేస్తానని నాగవల్లి అనుకుంటుంది. వెంటనే తన మనుషులకు కాల్ చేసి ప్లాన్ చెప్తుంది. చిన్ని అలియాస్ మధు ఇవాళ్టితో నీ డ్రామాకి తెరపడుతుందని అని అనుకుంటుంది. నాగవల్లి మ్యాడీ, మధుల దగ్గరకు వెళ్తుంది. మ్యాడీ డల్‌గా ఉండటం చూసి ఏమైంది నాన్న అలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని మ్యాడీ అంటాడు. రిసెప్షన్ పెట్టడం నీకు ఇష్టం లేదని మధుకి మాత్రమే ఇష్టమని నాకు తెలుసు.. అందుకే ఏమైనా గొడవ పడ్డావా,, నేను మధుకి ఇష్టం అని రిసెప్షన్ పెట్టలేదు.. నాకు ఇష్టం అని పెట్టా అర్థం చేసుకో అని అంటుంది.
మ్యాడీ రిసెప్షన్‌ని ఇష్టపడ్డాను అత్తయ్యా.. మీకు ఇష్టమని తనకు ఇష్టం.. రాత్రంతా దీని గురించే మాట్లాడాడు.. అందుకే కాస్త డల్‌గా ఉన్నాడు.. ఆ డల్‌నెస్ నేను పొగొట్టేస్తాలే మీరు మ్యాడీ గురించి మర్చిపోండి అని అంటుంది. లోహిత నాగవల్లితో చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతుందో మీరు మ్యాడీని మర్చిపోవాలి అంట.. అత్తగారు అని రెస్పెక్ట్ లేకుండా ఎంత ఓవర్ చేస్తుందో చూడండి అంటుంది. చేయని చేయని ఎంత చేస్తే నేను దాని ఓవర్‌ని ఎలా తగ్గిస్తానో నాకు తెలుసు అని అంటుంది.
మధు మ్యాడీతో ఇష్టం లేకపోయినా సంతోషంగా ఉన్నట్లు నటించొచ్చు కదా.. నేను నీ ఫ్రెండ్‌లా చెప్తున్నా అని అంటుంది. సరే అని మ్యాడీ అంటాడు. మ్యాడీ, మధులు రిసెస్షన్ దగ్గరకు వెళ్తారు. మధు, మ్యాడీలు జంటగా కూర్చొవడం చూసి శ్రేయ, లోహిత చాలా చిరాకుపడతారు. గతంలో శ్రేయ, మ్యాడీ నిశ్చితార్థం జరిగినప్పుడు మధుతో లోహిత ఫొటోలు తీయించడం గుర్తు చేసుకున్న మధు లోహితను పిలిచి స్టేటస్ పెట్టుకోవాలి మాకు ఫోటోలు తీయవా అని చెప్పి ఫోన్ ఇస్తుంది. లోహిత ఫొటోలు తీస్తుంటే.. లోహితను ఉడికిస్తూ రకరకాల ఫోజులు ఇస్తుంది.
నాగవల్లి తన మనుషుల దగ్గరకు వెళ్లి ఆఫ్ టికెట్ ఏ గెటప్‌లో వస్తాడో తెలీదు.. ఎలా వచ్చినా మీరు ఆ గెటప్‌లో మారిపోయి నేను చెప్పినట్లు చేయండి అని సలహా ఇస్తుంది. శ్రేయ చిరాకు పడుతుంటే జ్యూస్ తీసుకొని లోహిత వస్తుంది. హాయిగా తాగు అని శ్రేయ అంటే ఇది నా కోసం కాదు మధు కోసం అని అంటుంది. అయితే వెళ్లు అని శ్రేయ అంటుంది. మధుని అలా చూడటం ఇష్టం లేదు అందుకే మధుని స్టేజ్ మీద లేకుండా చేయాలి అని జ్యూస్‌లో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపేశా అప్పుడు మధు బాత్‌రూంకే పరిమితం అయిపోతుందని అంటుంది. బేరర్‌తో మధుకి జ్యూస్ పంపిస్తుంది.
మధు అది తీసుకొని సంతోషంగా ఉన్న లోహిత, శ్రేయలను చూసి అనుమానపడుతుంది. మధు ఆ జ్యూస్ ప్రమీలకు ఇచ్చి తాగమని అంటుంది. ప్రమీల వసంతకు ఇస్తుంది. వసంత వద్దు అనడంతో నాగవల్లికి ఇస్తుంది. నాగవల్లి ఆ జ్యూస్ తాగితే కడుపు అప్ సెట్ అయితే మన పని అంతే అని అనుకుంటుంది. నాగవల్లి జ్యూస్ తాగే టైంకి ఆఫ్ టికెట్ ఓ బొమ్మ గెటప్ వేసుకొని వస్తాడు. నాగవల్లికి వచ్చింది ఆఫ్ టికెట్ అని అర్థమైపోతుంది. ఇక శ్రేయ, లోహిత టెన్షన్‌గా ఉండటం చూసి నాగవల్లి అక్కడి వెళ్లి ఏంటి అలా ఉన్నావ్ అని లోహితను అడుగుతుంది.
నీరసంగా ఉందని లోహిత అంటే జ్యూస్ తాగమని నాగవల్లి ఇస్తుంది. లోహిత బిత్తరపోతుంది. నాగవల్లి జోకర్‌గా వచ్చిన ఆఫ్ టికట్‌ని గమనిస్తూ ఉంటుంది. ఆఫ్ టికెట్ తన మనుషులతో చిన్నిని కలుస్తానని దొరికిపోతే దేవా మీద అటాక్ జరుగుతుందని చెప్పండి అందరూ కంగారుగా ఉంటే నేను తప్పించుకుంటా అని అంటాడు. నాగవల్లి ఆ మాటలు మొత్తం వినేస్తుంది. హైట్ తక్కువైనా నీకు బుర్ర ఎక్కువేరా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.