Chinni Serial Today Episode: ప్రేమికులరోజులోగా మ్యాడీకి నేనే చిన్ని అని చెప్పి ఈ మధుపై ఉన్న ప్రేమకన్నా ఎక్కువ చిన్నిపై ఉందని నిరూపిస్తానంటూ నాగవల్లితో చిన్ని శపథం చేస్తుంది. అందుకే ఈరోజు ఎలాగైనా మ్యాడీకి నిజం చెప్పేయాలని భావిస్తుంది. రోజ్‌డే సెలబ్రేషన్లు గట్టిగా చేసిన మ్యాడీ....కిస్‌డే కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అతని గదిలోకి చిన్ని వస్తుంది.ఏంటి ఇందంతా అని అడిగితే నీకోసం ఎదురుచూస్తున్నానని చెబుతాడు. అయితే మధు ఈరోజు ఎలాగైనా మ్యాడీకి నిజం చెప్పేయాలని చూస్తుంటుంది. అందుకే అతన్ని ముందుగానే ప్రిపేర్ చేస్తుంది. నేను నీకు ఓ నిజం చెప్పాలని అనుకుంటున్నానని...చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయంగా ఉందని అంటుంది. నువ్వు ఏం చెప్పినా నేను వింటానని మ్యాడీ అంటాడు. ఇది నా చిన్పప్పటి సంగతి అని చెబుతుండగా...సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. వెంటనే మ్యాడీ కిస్ డే వచ్చిందని ఆమెతో కిస్ పెట్టించుకునేందుకు నాటకం అడతాడు.తన కంట్లో ఏదో పడిందని అనగా....మధు కంగారుగా వెళ్లి అతని కంట్లో గాలి ఊదుతుంది. అప్పుడు మ్యాడీ తన బుగ్గను మధు పెదాలకు అన్చి హ్యాపీ కిస్ డే అంటాడు. తను సిగ్గుపడటంతోపాటు భయపడుతుంది.ఎందుకు అంత కంగారు పడుతున్నావని మ్యాడీ అడగ్గా....ఈ ప్రేమ జీవితాంతం మనమధ్య ఉంటుందా అని అంటుంది. ఎందుకు ఉండదు ఏమవుతుందని అంటే...మనమధ్యకు ఎవరైనా వచ్చి గొడవలు పెడతారేమో అని అంటే...నేను ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం వదిలిపెట్టనని అంటాడు.అయితే నువ్వు చిన్నిని కూడా ప్రేమించావ్ కదా ఇప్పుడు ఆమె అంటే ఇష్టం లేదు కదా అని అంటుంది. ఇప్పుడు దాని పేరు తీసుకొచ్చి నాకు కోపం తెప్పించవద్దని మ్యాడీ మండిపడతాడు. దీంతో చిన్ని విషయం గురించి చెప్పడం మంచిది కాదని మధు అనుకుంటుంది. ఇంట్లో అందరూ నిద్రపోగా...మధును చంపడానికి మ్యాడీ వాళ్ల నాన్న ఓ మనిషిని నియమిస్తాడు. తలుపు తెరిచే ఉంచానని లోపలికి రమ్మని అతనికి ఫోన్‌చేసి పడుకుంటాడు. హంతకుడు లోపలికి అడుగుపెట్టగానే....మంచినీళ్ల కోసం నాగవల్లి లేస్తుంది.అలికిడి విని చిన్ని కూడా నిద్రలేచి తన గది నుంచి కిందకు వస్తుంది.అప్పుడే ఆ హంతకుడు కత్తితో చిన్నిని పొడవటానికి ప్రయత్నించగా....నాగవల్లి గడ్డగా అరిచి అడ్డుకుంటుంది. దీంతో వచ్చిన దొంగ పారిపోతాడు. లైట్ వేసి ఎవడువాడని అడుగుతుంది. నాకు తెలియదని చిన్ని చెబుతుంది. ఎంతమంది శత్రువులు ఉన్నారేంటని ఆరా తీస్తుంది. అయితే తొందరలోనే నీకుచావు మూడిందని చెప్పి వెళ్లిపోతుంది. తనను చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్ని కూడా అనుకుంటుంది. తన బెడ్‌రూంలోకి వెళ్లి ఈ విషయాన్ని నాగవల్లి తన భర్తకు చెబుతుంది.తను మాత్రం తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తాడు. అయినా మధును చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని అంటాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఒకసారి విచారణ చేద్దామని అని చెప్పి పడుకుంటాడు. తెల్లారిన తర్వాత మళ్లీ తానే చిన్నిని అన్న విషయం మ్యాడీకి చెప్పాలని మధు ప్రయత్నించినా....తలుపుచాటుగా లోహిత వింటుందని చూసి ఆగిపోతుంది. మ్యాడీతో ముద్దుపెట్టించుకుంటూ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలు లోహితకు చూపించి తనను బాగా ఏడిపిస్తుంది.
Chinni Serial Today February 20th: అర్థరాత్రి చిన్నిపై హత్యాయత్నం చేసింది ఎవరు..? ఇంతకు తనే చిన్ని అని మ్యాడీకి మధు చెప్పిందా లేదా..?
ABP Desam | 20 Feb 2026 10:08 AM (IST)
Chinni Serial Today Episode February 20th :అర్థరాత్రి చిన్నిపై హత్యాయత్నం చేసింది ఎవరు..? ఇంతకు తనే చిన్ని అని మ్యాడీకి మధు చెప్పిందా లేదా..?

చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్