Chinni Serial Today Episode దేవా లెటర్ చూసి చాలా కంగారు పడి చెమటలు పట్టేస్తాడు. దేవాని నాగవల్లి కనిపెడుతుంది. చిన్ని ఇక్కడే ఈ ఫంక్షన్‌లోనే ఉందని దేవా మొత్తం వెతుకుతాడు. వీళ్లతో చిన్నిని ఎలా గుర్తు పట్టాలి అని అనుకుంటాడు. బొకే ఇచ్చిన వాడిని పట్టుకుంటే చిన్ని ఎవరో తెలుస్తుందని చూస్తే అతను  ఉండడు. దేవా టెన్షన్ నాగవల్లి గమనిస్తూనే ఉంటుంది. 

Continues below advertisement

దేవా పాకెట్‌లో లెటర్ పెట్టుకుంటాడు. చెమటలు తుడుచుకోవడానికి రుమాలు తీస్తే లెటర్ కింద పడిపోతుంది. నాగవల్లి అది చూస్తుంది. నాగవల్లి తన దగ్గరకు రాగానే దేవా చాలా కంగారు పడతాడు. ఇక నాగవల్లి ఆ లెటర్ తీసి చూస్తుంటే దేవా తీసుకొని ఈ తలనొప్పులు నీకు ఎందుకు నాగవల్లి పార్టీలో ఏవో గొడవలు ఉంటే వాటి కోసం ఇచ్చారని అంటాడు. దేవా చిన్ని కోసం వెతుకుతూ ఉంటే మధు చూసి ఏమైంది అంకుల్ అంత టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఏం లేదు అని దేవా చెప్పినా మధు వినకుండా నాకు అర్థమైంది మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారో అర్థమైంది మీకు పార్వతి ఆంటీ గుర్తొచ్చింది కదా అని అంటుంది. అవును అని దేవా అంటాడు. 

దేవా చిన్ని ఎవరో మధుని అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు.  ఇక మధు పార్వతి గురించి దేవాని అడగాలి అని అనుకుంటుంది. పార్వతి చావు గురించి అడుగుతుంది. అవేవీ ఇప్పుడు వద్దమ్మా అని దేవా అనేస్తాడు. ఇక దేవా మధుతో నాకు కీడు శంకిస్తుందామ్మా.. చిన్ని ఇక్కడే ఉందని నాకు అనిపిస్తుంది. మీ కాలేజ్‌ వాళ్లు కాకుండా ఎవరైనా కొత్త ముఖాలు కనిపిస్తే నాకు చెప్పు అని అంటాడు. ఇంతలో నాగవల్లి వచ్చి ఫంక్షన్ అవుతుంటే మధుతో మాటలు ఏంటి అని అంటుంది. దేవాని తీసుకెళ్లిపోతుంది. 

Continues below advertisement

నాగవల్లి తర్వాత దేవాతో బొకే గురించి అడుగుతుంది. దేవా కవర్ చేస్తాడు. లెటర్ ఇవ్వు బావ నేను జాగ్రత్తగా దాచిపెడతా అని నాగవల్లి అంటే దేవా పార్టీ ఆఫీస్‌లో పెట్టించేశా అని అంటాడు. ఇక నిశ్చితార్థం వేడుక మొదలవుతుంది. మధు చాలా బాధ పడుతుంది. శ్రేయ తరుఫున వరుణ్‌, లోహితలు తాంబూలం తీసుకుంటారు. తాంబూలాలు తీసుకోవడం అయిపోయిన తర్వాత పూల దండలు, ఉంగరాలు మార్చుకోమని పంతులు చెప్తారు.

 

నాగవల్లి మధుకి చెప్పి దండలు తీసుకురమ్మని అంటుంది. మధు దండలు తీసుకొచ్చి మ్యాడీ, శ్రేయలకు ఇస్తుంది. ఇద్దరూ దండలు మార్చుకుంటారు. మధు ముఖం మాడ్చేస్తుంది. శ్రేయ ఫొటోలు తన ఫోన్‌లో తీయమని చెప్తే లోహిత మధు అయితే బాగా తీస్తుందని చెప్పి మధుకి ఫోన్ ఇస్తుంది. మధు ఫోటోస్ తీస్తుంది. చేతులు వేయ్ మ్యాడీ అని లోహిత చెప్తుంది. లోహిత దగ్గరుండి స్టిల్స్ చెప్పి మధుతో ఫొటోలు తీయిస్తుంది.

ఇక ఉంగరాలు మార్చుకోమని నాగవల్లి అంటుంది. నాగవల్లి ఫోన్ వచ్చి బయటకు వెళ్తుంది. దేవా కూడా టెన్షన్ పడుతూ చిన్ని గురించి తన మనిషికి చెప్పి వెతకమని అంటాడు. వసంత ఉంగారాల బాక్స్ తీసుకొస్తుంది. తీరా చూస్తే ఉంగరాలు కనిపించవు. ఎవరో నొక్కేసుంటారు అని లోహిత మధుని చూసి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.