Chinni Serial Today Episode మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం త్వరలోనే చేస్తానని దేవా అంటాడు. పంతులుతో మాట్లాడి ముహూర్తం పెట్టించమని నాగవల్లితో చెప్తాడు. శ్రేయ నాకు సాయం చేస్తుంది అనుకుంటే ఇలా చేసింది ఏంటి అని మ్యాడీ బాధ పడతాడు.

Continues below advertisement

మధు మేనమామ ఇంటికి వస్తుంది. మామ ఫొటో చూసి మామయ్య అమ్మ మీద నింద పడింది.. అసలేం జరిగిందో నువ్వు చెప్పలేదు.. అమ్మ చెప్పలేదు.. అమ్మని నువ్వు నిర్దోషిగా నిరూపిస్తావని నిన్ను చంపేసి ఆ నింద నాన్న మీద వేశారు అని బాధ పడుతూ ఉంటుంది. సరళ, చందు వచ్చి మధుతో మాట్లాడతారు. అంకుల్ ఎలా చనిపోయారు అని అడిగితే వాళ్ల చెల్లి వల్ల ఆయనకు ఈ గతి పట్టింది.. ఆవిడ ఎవరినో చంపేసింది దాని కోసం నా భర్తకి ఈ గతి పట్టిందని సరళ అంటుంది. మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు అని చందు అంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలి అంటే ఆరోజు ఏం జరిగిందో తెలియాలి అని అసలు ఏం జరిగిందని అంటుంది. గతాన్ని తవ్వొద్దని సరళ అనేస్తుంది. 

శ్రేయ లోహితకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. నీ పెళ్లి త్వరగా చేయడమే నా టార్గెట్ అని అంటుంది. మా అన్నయ్య చాలా లక్కీ శ్రేయ అంటుంది. ఇక లోహితకు సరళ కాల్ చేస్తుంది. ఇంటికి రమ్మని అంటే ఇప్పుడు బిజీ అని లోహిత అంటుంది. దాంతో మీ ఫ్రెండ్ వచ్చిందని అంటే లోహిత మధు నిజం చెప్పేస్తుందేమో అని కంగారుగా వస్తుంది. బిజీ అన్నావ్ ఇప్పుడు ఎలా వచ్చావే అంటే నీకు చీర ఇద్దామని వచ్చానని అంటుంది. సరళ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. చందు లోహితతో ఏంటి ఈ మధ్య అమ్మకి గిఫ్ట్‌లు కొంటూనే ఉన్నావ్ డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు. అత్తగారి ఇంట్లో ఇస్తున్నారేమో అని మధు అంటుంది. లోహిత, చందు, సరళ షాక్ అయిపోతారు. 

Continues below advertisement

సరళ మధుతో మేం చేయకుండా పెళ్లి ఎలా అవుతుందని అడుగుతుంది. దానికి మధు ఏమో మీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయిందేమో అని అంటుంది. సరళ చాలా కంగారు పడితే పీజీలను మేం అత్తారిల్లు అని అంటామని అంటుంది. మీ వార్డెన్ పేరు నాగవల్లినే కదా అని అంటుంది. కాదు నాగమణి అని అంటుంది. లోహిత మధుతో మా ఇంటికి ఎందుకు వచ్చావే నువ్వు మా శత్రువువే అని అంటుంది. ఇద్దరి మధ్య మాట యుద్ధం జరుగుతుంది. 

మధుతో మ్యాడీ శ్రేయతో త్వరలో నిశ్చితార్థం పెడుతున్నారని చెప్తుంది. దానికి మధు దీనికి ఒకటే దారి ఉంది.. చిన్ని వాళ్ల అమ్మ తప్పు చేసిందో లేదో తెలియాలి.. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకోవాలి అంటుంది. చిన్ని వాళ్ల అమ్మ నిర్దోషి అని తేలితే నువ్వు చిన్నిని పెళ్లి చేసుకోవచ్చు కదా.. ఏ ప్రయత్నం చేయకుండా  శ్రేయని పెళ్లి చేసుకుంటే తర్వాత అది అబద్ధం అని తెలిస్తే ఏం చేయలేవు కదా పెళ్లికి ముందే నిజనిజాలు తెలుసుకో అని అంటుంది. మ్యాడీ నిజాలు తెలుసుకుందామని అంటాడు. గతాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు కానీ నీ కోసం ఒప్పుకుంటున్నానని అంటాడు. రేపు ఉదయం రా అమ్మతో మాట్లాడుదామని అంటాడు. మధు ఉదయం పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. నలినీ అనే సెంట్రీని కలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.