Chinni Serial Today Episode దేవా, నాగవల్లి మ్యాడీతో ఎక్కడికి వెళ్లావ్ అని అంటే వాళ్ల అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్లమని చెప్పిందని తీసుకెళ్లానని అంటాడు. అక్కడ వాళ్ల అమ్మ మీ అమ్మని చంపలేదు.. నిర్దోషి అని ఏమైనా నమ్మించాలని చెప్పిందా అని దేవా అంటే అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. తప్పు చేసేవాళ్లు అబద్ధాలు చెప్పేవాళ్లే అలా చెప్తారు.. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది.. అని అంటుంది చిన్ని. ఇప్పుడు ఏం తెలిశాయి అంట అని దేవా అంటే ఏం తెలిశాయో ఏంటి మీ అబ్బాయి చెప్తాడు కదా తొందర ఎందుకు అని చిన్ని అంటుంది.
మ్యాడీ పెద్దమ్మతో మన ఇంట్లో ఎవరి పుట్టిన రోజు అయినా స్వీట్ చేసి అందరి నోళ్లు తీపి చేస్తావు కదా.. ఈ రోజు చిన్ని వాళ్ల అమ్మ పుట్టినరోజు ఏదైనా స్వీట్ చేసి అందరి నోళ్లు తీపి చేయ్ అని అంటాడు. ఆ మాటకు దేవా, నాగవల్లి షాక్ అయిపోతే చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. లోహిత మ్యాడీతో మీ అమ్మని చంపిన వాళ్ల పుట్టినరోజున స్వీట్ చేసి నోరు తీపి చేస్తావా ఆ మాట వినడానికే మింగుడు పడటం లేదు అని లోహిత అంటే అమ్మ ఎవరికైనా అమ్మే.. నా మాట మీద గౌరవం ఉంటే అందరూ నోరు తీపి చేసుకోండి అని అంటాడు. మ్యాడీ మాట కోసం స్వీట్ చేయమని నాగవల్లి చెప్తుంది.
దేవా గదిలోకి వెళ్లి పార్వతి, కావేరి, సత్యంబాబుల చావుకి నేనే కారణం అని చిన్ని మ్యాడీకి చెప్పుంటుందా.. చెప్తే అంత కూల్‌గా ఎందుకు ఉంటాడు.. ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడైనా నా కొంప ముంచుతుంది. అప్పటి వరకు చూస్తూ ఊరుకోవడం ఎందుకు.. త్వరగా చిన్నిని లేపేయాలి.. ఇవాళ రాత్రికే దాన్ని లేపేయాలి అని తన మనుషులకు ఫోన్ చేసి చిన్నిని చంపేయమని అంటాడు. ప్రమీల పాయసం చేస్తుంది. ప్రమీల పక్కకి వెళ్లగానే దేవా మనిషి పాయసంలో మత్తు మందు కలిపేస్తాడు. మరోవైపు మ్యాడీ గదిలోకి వచ్చే సరికి చిన్ని గులాబీ రేకులతో థ్యాంక్స్ అని రాసుంటుంది. బెడ్ మీద థ్యాంక్స్ అని రాస్తుంది. తర్వాత మ్యాడీ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్తుంది. మా అమ్మ సమాధి దగ్గరకు నేను ఒంటరిగా వెళ్లాలి అనుకుంటే నాకు జంటగా వచ్చి చాలా సంతోషాన్ని ఇచ్చావ్ అందుకే థ్యాంక్స్ అంటుంది. అతి తొందర్లోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపించి నీ ప్రేమని పూర్తిగా పొందుతాను అని చిన్ని అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని మ్యాడీ అంటాడు.
నాగవల్లి అత్తయ్య గారికి కూడా విషయం తెలీదు.. ఇండియాలోనే లేరు కదా అంటుంది. సరే మా అమ్మకి తెలియకపోవచ్చు కానీ మా డాడీ ఇండియాలోనే ఉన్నారు.. ఇంట్లోనే ఉన్నారు కదా మా డాడీకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని మ్యాడీ అంటాడు. ఏమైనా అవసరం ఉండి నిజం దాచుంటారేమో అని చిన్ని అంటుంది. నిజం దాచడం వెనక బలమైన కారణం ఏమైనా ఉండొచ్చేమో.. నిన్ను నాగవల్లి అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక అలా చెప్పోచ్చేమో అని చిన్ని అంటుంది. మరోవైపు ప్రమీల ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచుతుంది. అందరూ స్వీట్ తీసుకొని తిని పడుకుంటారు. ఇక రాత్రి లోహితకు ఫోన్ వస్తుంది. అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేయమన్నాడేంటి అని అనుకొని బయటకు వెళ్తుంది.
దేవా చెప్పిన రౌడీలు కూడా అప్పుడే ఇంట్లోకి వస్తారు. లోహిత రౌడీలు ఇంట్లోకి రావడం చూస్తుంది. దొంగలు దూరారని అనుకొని వరుణ్‌ని లేపాలని చూస్తుంది, కానీ వరుణ్ లేవడు.. రౌడీలు ఇంట్లోకి దూరి చిన్ని గదిలోకి వెళ్తారు. కావేరి ఫొటో అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది. రౌడీలు చిన్నిని ఎత్తుకొని బయటకు వస్తారు. లోహిత వరుణ్ లేవకపోవడంతో ఆంటీ అంకుల్‌ని లేపుదాం అని వెళ్లి చిన్నిని కిడ్నాప్ చేయడం చూసి చిన్నిని తీసుకెళ్లిపోతే బెటర్ అని వదిలేస్తుంది. కావేరి ఫొటో ఊగి ఊగి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే చిన్ని రౌడీలకు షాక్ కొట్టినట్లు అయి చిన్నిని కిందకి వదిలేస్తారు. రౌడీలు చిన్నిని ఎందుకు వదిలేశారా అని లోహిత అనుకుంటుంది. ఇంతలో చిన్ని లేచి దెయ్యంలా కూర్చొంటుంది. అందరూ చూసి చిన్నికి భయపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
