Chinni Serial Today Episode చిన్నిని తీసుకొని మ్యాడీ కావేరి సమాధి దగ్గరకు బయల్దేరుతాడు. మధ్యలో చిన్నికి ఎక్కిళ్లు రావడంతో వాటర్‌ కోసం కారులో వెతుకుతుంది. నీళ్లు లేకపోవడంతో షాప్‌ కోసం వెతుకుతారు. షాప్‌ లేకపోవడంతో ఏం చేయాలా అని మ్యాడీ ఆలోచిస్తూ కొబ్బరి నీళ్లు ఉన్న చోటకి తీసుకెళ్తాడు. చిన్ని కోసం కొబ్బరి బోండాం తీసుకొని వస్తాడు. ఇంతలో చిన్ని ఎక్కిళ్లు ఆగిపోతాయి. నా మీద నువ్వు చూపించిన ప్రేమ చూసి ఎక్కిళ్లు ఆగిపోయావి.. ఇంత ప్రేమ మనసులో దాచుకొని పైకి కోపం నటిస్తున్నావా అని చిన్ని అడిగితే కేవలం జాలి మాత్రమే అని మ్యాడీ అంటాడు. 

Continues below advertisement

చిన్ని కొబ్బరి నీళ్లు తాగి.. మ్యాడీకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత ఇద్దరూ బయల్దేరుతారు. దేవా మనుషులు మ్యాడీ కారు వెనకే ఫాలో అవుతారు. ఇక బాలరాజు కావేరి సమాధి దగ్గర ఉన్న రాయితో కావేరి ఆ రోజు మనం ఊరి నుంచి వెళ్లిపోతాం అనుకున్నప్పుడు ఈ చైన్ నీకు ఇవ్వాలి అనుకున్నా.. నన్ను క్షమించి మళ్లీ నన్ను మీ జీవితాల్లోకి తీసుకొచ్చిన చిన్ని, నీ ఫోటోలు ఈ లాకెట్‌లో పెట్టుకున్నాను.. ఇది నీకు చూపించాలి అనుకున్నా కానీ ఇలాంటి పరిస్థితుల్లో చూపించాల్సి వస్తుంది అనుకోలేదు అని ఏడుస్తూ అక్కడే లాకెట్ చైన్ పెడతాడు. ఆఫ్ టికెట్ బాలరాజుని ఓదార్చుతాడు. మీ ముగ్గురు కలిసి సంతోషంగా ఉండే రాత ఆ దేవుడు రాయలేదు.. అన్న.. కనీసం చిన్నిని అయినా నీకు కనిపించేలా చేశాడు సంతోషించాలి అన్న అని చెప్తాడు. ఇంతలో చిన్ని, మ్యాడీ అక్కడికి రావడం చూసిన ఆఫ్ టికెట్ మ్యాడీ బాబు కారు అన్న చిన్ని మ్యాడీని తీసుకొని వచ్చినట్లు ఉంది.. పద అన్న అని పక్కకి తీసుకెళ్తాడు. 

బాలరాజు, ఆఫ్ టికెట్ దాక్కుంటారు. చిన్ని మ్యాడీ కలిసి రావడం చూసి బాలరాజు చాలా సంతోషపడతాడు. జంట బాగుందని అనుకుంటాడు. చిన్ని తల్లి చనిపోయిన చోటు ఉన్న రాయికి దండ వేసి దండం పెడుతుంది. చిన్ని రాయి దగ్గర కూర్చొని ఇక్కడే మా అమ్మ నాకు దూరం అయిపోయింది.. అమ్మ గడువులోపు నువ్వు నిర్దోషి అని నేను నిరూపించేలా చేయమ్మా అని అంటుంది. దేవా మనుషులు దేవాకి కాల్ చేసి చిన్ని మ్యాడీ బాబుని వాళ్ల అమ్మ చనిపోయిన ప్లేస్‌కి తీసుకొచ్చిందని చెప్తారు. దేవా సరే అని మ్యాడీ కంట పడకుండా వచ్చేయ్ అని చెప్తాడు. ఇక మ్యాడీ రాయి దగ్గర ఉన్న చైన్  లాకెట్ చూస్తాడు. చిన్ని ఆ లాకెట్ తీసుకుంటుంది. ఆ ఫొటోలో ఉంది నువ్వు మీ అమ్మ కదా అని మ్యాడీ అంటే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని చిన్ని అంటే మీ నాన్న వచ్చుంటాడు.. ఆ రోజు మా డాడీ మీ నాన్నని కిడ్నాప్ చేశాడు అన్నావ్.. మీ నాన్న ఏదో తప్పు చేయకపోతే మన ఎదురుగా ఎందుకు రావడం లేదు.. ఆయన నీకు ఇది ఇవ్వాలి అనే ఇలా ఇక్కడ పెట్టాడు అని అంటాడు. మా నాన్న గురించి నీకు ఏం తెలీదు మ్యాడీ.. తెలీకుండా ఇలా ఏం అనొద్దు అని చిన్ని అంటుంది. నాకు అన్నీ తెలుసు.. నీ గురించి.. మీ నాన్న గురించి.. మీ అమ్మ గురించి అని అంటాడు. 

Continues below advertisement

చిన్ని, మ్యాడీ తిరిగి వెళ్తుంటే చిన్ని కాలు రాయికి తగిలి కింద పడిపోతుంది. బాలరాజు వెళ్లబోతే ఆఫ్ టికెట్ ఆపుతాడు. మ్యాడీ అలా చూస్తూ ఉంటే చిన్ని మ్యాడీతో ఇది నాటకం కాదు అని అంటే నువ్వు అబద్ధం చెప్పినా కన్నీరు అబద్ధం చెప్పవులే అని చేయి అందిస్తాడు. చిన్ని కాలు బెనకడంతో కింద కూర్చొని కాలు నొక్కుతాడు. బాలరాజు చూసి చాలా సంతోషపడతాడు. చిన్ని కూడా మ్యాడీని అలా చూస్తూ ఉంటుంది. చిన్ని నడవలేకపోతే తీసుకెళ్లి కారులో కూర్చొపెడతాడు. మందులు వేసుకుంటే పది నిమిషాల్లో తగ్గిపోతుందని మ్యాడీ అంటే నిజంగా తగ్గిపోతుందా అమ్మ పేరు అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టాలని చిన్ని అంటుంది. తగ్గకపోయినా వెళ్దువులే.. కారు ఉంది కదా అని మ్యాడీ అంటాడు. బాలరాజు ఆఫ్ టికెట్‌తో నా వల్లే చిన్నికి ఈ కష్టాలు.. ఏ భార్య అనుభవించని కష్టాలు నా వల్ల కావేరి అనుభవించింది.. ఏ కూతురు అనుభవించిని కష్టాలు నా వల్ల చిన్ని అనుభవించింది.. కావేరికి ఏం చేయలేను కానీ చిన్నికి ఇక నుంచి కష్టాలు లేకుండా చేస్తా.. మ్యాడీబాబుకి నిజనిజాలు తెలిసేలా చేస్తా.. చిన్ని సంతోషంగా కాపురం చేసుకునేలా చేస్తా.. నన్ను నా భార్యని, నా కూతురిని ఇన్ని కష్టాల పాలు చేసిన ఆ దేవాకి.,, నాగవల్లికి తగిన బుద్ధి చెప్తా అని బాలరాజు అనుకుంటాడు.

చిన్ని, మ్యాడీ ఇంకా రాలేదు ఏంటి అని నాగవల్లి, దేవా వెయిట్ చేస్తుంటారు. ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటే మ్యాడీ, చిన్ని వస్తారు. ఇంత సేపు వరకు ఎక్కడికి వెళ్తారు అని నాగవల్లి అడిగితే భార్యాభర్తలు ఎక్కడికైనా వెళ్తారు.. ఎంత సేపు తర్వాత అయినా వస్తారు.. అందులో తప్పేముంది.. అలా నిలదీసి అడుగుతారు ఏంటి అని చిన్ని అంటే అత్తగారిలా అడిగే హక్కు మా వదినకు లేదా అని వసంత అడిగితే కోడలిగా నా భర్తని తీసుకెళ్లే హక్కు నాకు ఉంది అని చిన్ని అంటుంది. దేవా మ్యాడీతో నువ్వు చెప్పు నాన్న ఎక్కడికి వెళ్లారు.. యాక్సిడెంట్ జరిగి బయట పడ్డావ్,,. మళ్లీ ఎందుకు బయటకు వెళ్లావ్ అంటే దానికి మ్యాడీ ఈ రోజు చిన్ని వాళ్ల అమ్మ పుట్టిన రోజు అంట వాళ్ల అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్లమంటే తీసుకెళ్లా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.