Chinni Serial Today Episode లోహిత చిన్నికి దురద వచ్చేలా చేసి కల్యాణంలో పాల్గొనకుండా చేయాలి అనుకుంటే లోహితకే దురద వస్తుంది. శ్రేయ వచ్చి లోహితకు గోకుతుంది. మన బతుకులు ఇంతే.. కాసేపట్లో అక్కడ నల్లపూసల తంతు జరుగుతుంది అని శ్రేయ అంటే కల్యాణం ఆపలేకపోయినా నల్లపూసలు తంతు జరగనివ్వను అని అంటుంది. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. లోహిత చూసి షాక్ అయిపోతుంది. 

Continues below advertisement

చిన్ని లోహితతో నేను కల్యాణం చేయకుండా ఆపాలి అనుకున్నావ్.. నువ్వే కల్యాణంలో లేకుండా అయిపోయావ్.. నాకు పుట్టాల్సిన దురద నీకు ఎలా వచ్చింది అనుకున్నావా.. నీ ప్లాన్ నాకు ముందే తెలుసు.. అందుకే నేను కట్టుకోవాల్సిన చీర మార్చేశా.. ఇంకెప్పుడూ నువ్వు ఇలాంటి దరిద్రపుగొట్టు ప్లాన్ వేయకూడదు అని నీ చీర మీద నేను ఆ పౌడర్ వేశాను అని చిన్ని చెప్తుంది. లోహిత షాక్ అయిపోతుంది. నా భర్తని నేను దగ్గర అయ్యే క్రమంలో ఎవరైనా అడ్డు పడితే ఊరుకోను ఇలాగే కౌంటర్స్ ఇస్తా అని అంటుంది. నల్లపూసల కార్యక్రమం ఆగిపోయేలా చేస్తా.. చిన్ని మ్యాడీ జీవితంలో నుంచి వెళ్లిపోయేలా చేస్తా చూస్తూ ఉండు అని లోహి శ్రేయతో చెప్తుంది. 

మ్యాడీ దగ్గరకు నాగవల్లి, దేవా వచ్చి నువ్వు ఎంత బాధ పడుతున్నావో అర్థం చేసుకోగలం నాన్న.. నువ్వు ఆ చిన్న పక్కన కూర్చొని పూజ చేయాల్సి వస్తున్నందుకు నువ్వు ఎంత బాధ పడుతున్నావో మాకు తెలుసు.. ఆ చిన్ని నీకు పరిచయం అవ్వడం వల్లే నీకు ఇన్ని కష్టాలు.. తనే నీకు పరిచయం కాకపోయి ఉంటే బాగుండేది.. చిన్నితో వచ్చిన కష్టాలు చిన్ని నీ జీవితంలోనుంచి వెళ్లిపోతే పోతాయి అని చెప్తారు. కోయిదొర చెప్పినట్లు ఈ ఒక్క కార్యక్రమం చేస్తే నీకు ఉన్న గండాలు పోతాయి అని చెప్తారు. మ్యాడీ మనసులో నా బాధ మీకు మరోలా అర్థమైంది.. నన్ను ప్రేమించిన చిన్నికి దగ్గరవ్వాలా.. నన్ను మోసం చేసిన చిన్నికి దూరం అవ్వాలా తెలియని సందిగ్ధంలో నేను ఉన్నాను.. చిన్నికి నాకు మధ్య మోసం అనేది లేకుండా ఉండి ఉంటే మా జీవితాలు ఎంత బాగుండేవో అని మ్యాడీ అనుకుంటాడు.

Continues below advertisement

లోహిత శ్రేయని తీసుకొని పక్కకి వెళ్లి నల్లపూసల కార్యక్రమం జరగాలి అంటే వచ్చిన ఐదుగురు ముత్తుయిదువులు వీల్లే కదా.. కార్యక్రమం అయ్యే టైంకి వీళ్లు అక్కడ ఉండరు అని అంటుంది. ఎలా అని శ్రేయ అంటే లోహిత వాళ్లకి డబ్బులు, పట్టు చీరలు ఇచ్చి తన వైపునకు తిప్పుకుంటుంది. నల్లపూసలు కార్యక్రమం మొదలైన టైంకి వెళ్లిపోమని చెప్తుంది. నల్లపూసల కార్యక్రమం మొదలవుతుంది. పంతులు నాగవల్లితో పసుపు కొమ్ము చిన్ని మెడలో వేసి తన మెడలో ఉన్న సూత్రాలు తీసి ఇవ్వమని చెప్తారు. దాంతో నాగవల్లి అలాగే చేస్తుంది. పంతులు ముత్తయిదువులకు కార్యక్రమం మొదలు పెట్టమని అంటే అప్పుడే లోహి తుమ్ముతుంది. పంతులు అందరికీ నిమిషం పాటు శ్రీరామ నామం చెప్పమని అంటారు. అప్పుడే లోహిత తాళి కొట్టేస్తుంది. ముత్తయిదువులను కూడా పంపేస్తుంది. ముత్తుయిదువులు లేరు అని అందరూ షాక్ అయిపోతారు. తాడు కూడా లేదు అని లోహిత అంటుంది. కొంపతీసి తాడు తీసుకొని పారిపోలేదు కదా అని లోహిత అంటే వాళ్లు అలాంటి వాళ్లు కాదు అని స్వరూప అంటుంది. 

లోహిత చిన్నితో ఇక నల్లపూసల కార్యక్రమం జరుగదు లే అని అంటే చిన్ని లేచే టైంకి స్వరూప ఆపి కార్యక్రమానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి అని అంటుంది. తన దగ్గర జాగ్రత్తగా దాచిన తాళి తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇవి ఎక్కడివి అని నాగవల్లి అడిగితే ఇవి చిన్ని వాళ్ల అమ్మ కావేరివి అని స్వరూప చెప్తుంది. ఏంటమ్మా ఇది అని చిన్ని అడిగితే మీ అమ్మ శవాన్ని ఆరోజు అలాగే వదిలేశాం.. తర్వాత మీ నాన్న అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఇవి అక్కడే ఉన్నాయి అని చెప్తుంది. కార్యక్రమం మొదలు పెట్టండి అని ప్రమీల అంటే లోహిత పంతులుతో చనిపోయిన వారి తాళిని ఇలా వాడొచ్చా.. అని అడిగితే శాస్త్రం ఒప్పుకున్నా లేకపోయినా నేను ఒప్పుకుంటా.. నా మెడలో అవి ఉంటే మా అమ్మ ఆశీర్వాదం ఉన్నట్లు ఉందని అంటుంది. లోహిత చిన్నితో నువ్వు వేసుకుంటావ్ కానీ దాని వల్ల మ్యాడీకి ఏమైనా కీడు జరిగితే ఎలా అని అంటుంది. పంతులు అందరితో పుణ్య స్త్రీగా చనిపోయిన వాళ్లవి వేసుకోవచ్చు కానీ వాటిని కరిగించేసి వేసుకోవాలని అని అంటారు. దానికి స్వరూప మాకు పంతులు అలాగే చెప్పారు.. అందుకే వాటిని కరిగించేశాం అని స్వరూప అంటుంది. 

లోహిత ఐదుగురు ముత్తయిదువులు లేరు కదా అంటే మనం ఉన్నాం కదా అని స్వరూప అంటుంది. నువ్వు, నేను, వసంత అక్క, నాగవల్లి వదిన ఉన్నారు కదా అంటుంది. మరి ఐదో వాళ్లు ఎవరు అని లోహిత అంటే ఉన్నారు.. కూతురి నల్లపూసల కార్యక్రమం ఆగిపోకూడదు అని మా అమ్మ తన సూత్రాలు పంపింది. ఇప్పుడు ముత్తయిదువులా మా అమ్మ వస్తుందని చిన్ని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.