Chinni Serial Today Episode లోహిత, వరుణ్ ఇంటికి రాగానే మధు ఏమైందని అడుగుతుంది. దానికి లోహిత ఏం చెప్పాలి మధు మమల్ని మెడ పట్టుకొని గెంటేశారని చెప్పాలా.. నీ వల్లే మాకు ఈ గతి పట్టిందని చెప్పాలా.. నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యావని చెప్పాలా అని అంటుంది. ఏం అంటున్నావ్ లోహి అని మధు అడుగుతుంది.  నా వల్ల మీ జీవితాలు నాశనం అయ్యావా అని అంటుంది.

Continues below advertisement

లోహిత అవును అని నీ మీద కోపంతో ఆ నాగవల్లి మమల్ని గెంటేసిందని అంటుంది. నువ్వు అడిగితేనే కదా నేను పెళ్లి చేసింది అని మధు అంటే అదే నేను చేసిన తప్పు.. నీ వల్ల నాది, వరుణ్‌ది, మ్యాడీల ముగ్గురి లైఫ్ నాశనం అయిపోయింది. మేం మా ఫ్యామిలీలకు దూరం అయిపోయి ఇలా అనాథల్లా మీ ఇంట్లో బతుకుతున్నాం.. నువ్వు ఓ సెల్‌ఫిష్ అని అంటుంది. మ్యాడీని సొంతం చేసుకోవాలని మా అందర్ని జోకర్‌లా వాడుకొని మా అందర్ని మీ ఇంటికి తీసుకొచ్చావ్ అంటుంది. మాటలు సరిగా రాని లేదంటే కొడతా అని మధు అంటే నన్నే కొడతా అంటావా అని లోహి చేయి ఎత్తుతుంది.

మ్యాడీ వచ్చి అడ్డుకుంటాడు. లోహి నీకు పిచ్చా మధు మీద చేయి ఎత్తుతున్నావ్ ఏంటి.. బ్రైన్ ఉందా లేదా నీకు అని అడుగుతాడు. మధు వల్ల మన జీవితాలు నాశనం అవ్వడం ఏంటి అని అడుగుతాడు. మధు వల్లే మనల్ని మీ అమ్మ పంపేసిందని ఇందాకే మీ అమ్మ క్లియర్‌గా చెప్పిందని లోహిత అంటుంది. మమ్మీని కలిశారా అని మ్యాడీ అడుగుతాడు. అవును అని మధు చెప్తుంది. వెళ్లేటప్పుడు నేను వద్దు అన్నా సరే నా మాట వినకుండా వెళ్లారు అని మధు చెప్తుంది. ఇప్పుడు వెళ్తే వాళ్లని రెచ్చగొట్టినట్లు అవుతుందని చెప్పినా వినకుండా వెళ్లిందని అంటుంది మధు. మ్యాడీ లోహిత మీద కోప్పడతాడు. తప్పు అంతా నువ్వు చేసి మధుని కొట్టడానికి చేయి ఎత్తుతావా.. తను అంత రిస్క్ చేస్తే ఇలా చేస్తావా సారీ చెప్పు అని అంటాడు. సారీ అవసరం లేదు కానీ నువ్వు ఇలాగే ఉంటే భవిష్యత్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావ్ పద్ధతి మార్చుకో లోహి  అని మధు చెప్తుంది.

Continues below advertisement

లోహి కోపంగా వెళ్లిపోతుంది. మధు మనసులో నా వల్లే వీళ్లని పంపేసారా అని ఏడుస్తుంది. మ్యాడీ మధుని కూల్ చేయడానికి వెళ్తాడు. నేనేం చేశా మ్యాడీ మిమల్ని ఇంట్లోకి రానివ్వకపోతే నాది తప్పు అని ఎన్ని మాటలు అందో తెలుసా అని చెప్తుంది. నువ్వు తప్పు చేయవు మధు మధు ఏం చేస్తే అదే కరెక్ట్.. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అని మ్యాడీ అంటాడు. ఇక మ్యాడీ అందరి కోసం ఫుడ్ తెచ్చా అంటే మధు తినను అని అలిగితే మ్యాడీ మధుని ఇమిటేట్ చేసి మధుని నవ్వించేస్తాడు. మధు నవ్వి భోజనానికి రెడీ అయిపోతుంది.

నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటే దేవా చేతికి కట్టుతో వస్తాడు. ఏమైందని నాగవల్లి అడిగితే ఆ బాలరాజు చేశాడని జరిగింది చెప్తాడు. నాగవల్లి కోపంతో వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి అని ఉందని అంటుంది. వరుణ్ వాళ్లు వచ్చి బతిమాలారని నాగవల్లి చెప్తే వాళ్లని కాల్చి చంపేయకుండా వదిలేశావ్ ఏంటి నాగవల్లి అంటుంది. వసంత అయితే మీ పరువు కంటే నా కొడుకు నాకు ఎక్కువ కాదు అని వసంత అంటుంది. ఇద్దరినీ ఎంత ప్రేమగా చూసుకున్నాం అందుకే మోసం చేసి వెళ్లిపోయారని అంటాడు. చేసిన తప్పు తెలుసుకొని ఒక్కడే ఇంట్లోకి వస్తే అన్నీ వదిలేసి క్షమిస్తా లేదంటే నా యాక్షన్ వైల్డ్‌గా ఉంటుందని దేవా చెప్పి వెళ్లిపోతాడు.

మ్యాడీ వంట చేస్తున్నాడని మధు వాళ్ల పేరెంట్స్‌కి తెలియడంతో ఎందుకు బాబు అని అంటారు. ఇప్పుడు ఈ పని నాకు చాలా అవసరం అని మ్యాడీ అంటాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. మధు అందరికీ చేతిలో ముద్దులు పెడితే లోహిత, వరుణ్‌లు తినిపించుకుంటారు. వరుణ్ బాబు పెళ్లి అయిపోయింది ఇక మ్యాడీ బాబు పప్పు అన్నం పెట్టాలి అని సుబ్బు అంటే మ్యాడీ ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని వరుణ్ చెప్తాడు. ఆ అమ్మాయి పేరుఏంటి అని అడిగితే మ్యాడీ చెప్పే టైంకి లోహిత వాటర్ పడేసి డైవర్ట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.