Chinni Serial Today Episode దేవా రౌడీలతో చిన్నిని త్వరగా వెతికి తీసుకురమ్మని అప్పుడు వీడికి కాపాలా లేకుండా ఇద్దరినీ ఒకేసారి చంపేయాలని అంటాడు. రాత్రి స్వరూప, సుబ్బు ఇద్దరూ బయట మాట్లాడుకుంటారు. ఇంట్లో ఇంకో ముగ్గురు వచ్చారు కదా ఎక్కువ కష్టపడాలని భార్యతో చెప్తాడు. వాళ్లకి ఏ కష్టం రాకుండా చూసుకోమని అంటాడు. 

Continues below advertisement

సుబ్బు, స్వరూపల మాటలు మ్యాడీ చాటుగా వింటాడు. నేను కూడా ఏదో ఒక పని చేస్తానని స్వరూప అంటుంది. మ్యాడీ ఏడుస్తూ అంకుల్ ఆంటీ మీ ఇద్దరి ప్రేమ చూశాక నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది అని.. మీకు మేం భారం కాము ఏదో ఒక జాబ్ చేస్తా అని మ్యాడీ అనుకుంటాడు. మధు మ్యాడీ కోసం గదిలో పడక రెడీ చేస్తుంది. మ్యాడీ మధుతో మొదటి సారి ఫ్యాన్, మంచం లేకుండా పడుకోవడం ఎలా ఉంటుందో చూస్తా అని ఎగ్జైట్ అవుతాడు. ఇక మధుతో రేపు ఉదయం రోడ్డు దగ్గర డ్రాప్ చేయమని అంటాడు. మధు సరే అంటుంది. ఇక మధు మ్యాడీతో ఎప్పుడైనా కింద పడుకున్నావా అని అడుగుతుంది. మ్యాడీ లేదని చెప్తాడు. సరే అవన్నీ మ్యానేజ్ చేయొచ్చు కానీ ఈ లుంగీ మ్యానేజ్ చేయడం కష్టం ఎక్కడ జారిపోతుందో అని తెగ కంగారు పడుతున్నా అని అంటాడు. మధు చాలా నవ్వుతుంది. 

మ్యాడీ తనకి చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన పెళ్లి కూతురి బొమ్మ పట్టుకొని చిన్ని లైఫ్ ఆడిన గేమ్ చూశావా ఎంత వింతగా ఉందో.. అమెరికాలో ఉండాల్సిన నేను ఇలా  నీ కోసం ఇండియా రావడం ఇక్కడ మధు ఇంట్లో ఉండటం  అన్నీ కొత్తగా ఉన్నాయి.. బావ లవ్ చేసిన అమ్మాయితో పెళ్లి చేశా ఇక మన పెళ్లి ఉంది చిన్ని నువ్వు వచ్చేస్తే ఇక అంతా హ్యాపీ అని అనుకుంటాడు.   మ్యాడీ పక్కనే ఆ బొమ్మ పెట్టుకొని పడుకుంటాడు. నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. 

Continues below advertisement

మధు మ్యాడీ పడుకున్నాడో లేడో అని అక్కడికి వస్తుంది. నిద్ర పట్టడం లేదా మ్యాడీ అని విసనకర్ర తీసుకొచ్చి మ్యాడీకి విసిరి నిద్ర పుచ్చుతుంది. మ్యాడీని చూస్తూ నువ్వు రాముడి లాంటి వాడిని మ్యాడీ కానీ సీత అయ్యే అదృష్టం నాకు లేదు అని బాధ పడుతుంది. మ్యాడీని చూసి మొత్తానికి నా రాముడు హాయ్‌గా నిద్రపోయాడు.. ఎంత ముద్దుగా నిద్ర పతున్నాడో అని అనుకుంటుంది. లోహిత తనలో తాను నేనే దరిద్రంలో ఉన్నాను అంటే వీళ్లు నా కంటే దరిద్రంలో బతుకుతున్నారు. ఇది కానీ చిన్ని అని తెలిసిపోతే మ్యాడీ దీన్ని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఇది అందరి కంటే ధనవంతురాలు అయిపోతుంది అలా జరగకూడదు అని లోహిత అనుకుంటుంది. 

వరుణ్ బయట నుంచి వస్తూ నేల మీద పడుకున్న మ్యాడీని చూసి బావ నా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావా అని అనుకుంటాడు. చాలా బాధ పడతాడు. లోహిత దగ్గరకు వెళ్లి ఇంకా పడుకోలేదా.. అని అంటాడు. ఏవేవో ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు అంటుంది. వరుణ్‌ లోహితను బెడ్ మీద పడుకోమని తను కింద పడుకుంటా అంటాడు. దానికి లోహిత నువ్వు మినిస్టర్ మేనల్లుడివి నీకు లగ్జరీ అలవాటు ఉంటుంది. నువ్వు కింద పడుకోలేవు మీద పడుకో అంటుంది. దానికి వరుణ్ నేను కింద పడుకోవడమే న్యాయం.. నేను మినిస్టర్ మేనల్లుడిని నన్నే నువ్వు కింద పడుకోవద్దు అంటున్నావ్ కానీ మ్యాడీ బావ మినిస్టర్‌కి ఒక్కగానొక్క కొడుకు తను నేల మీద పడుకుంటే నేను ఎలా మంచం మీద పడుకోగలను.. అని అంటాడు. మ్యాడీ కింద పడుకున్నాడా అని లోహిత అంటే అవును లోహి అసలు బావని ఎలా పెంచుకున్నారో తెలుసు మామూలు బొమ్మలు అడిగితే డైమండ్ బొమ్మలు ఇచ్చే అంత గారాభంగా పెంచారు. కింద నడిస్తే మట్టి అంటుకుంటుంది అని గుండెల మీద నడిపించుకున్నారు మా అత్త మామయ్య బావని అలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది లోహి అని వరుణ్ ఏడుస్తాడు. ఇక నుంచి మనం ఎప్పుడూ బావకి భారం అవ్వకూడదు అని అంటాడు. ఇక ఎప్పుడూ మనం మ్యాడీని బాధ పెట్టొద్దని అంటుంది. 

చందు లోహితకు కాల్ చేస్తాడు. ఇంటికి ఎప్పుడు వస్తావ్ అని చందు అడిగితే లోహిత చందుతో టూరిజం ట్రిప్‌కి ఫ్రెండ్స్‌తో వచ్చానని చెప్తుంది. దాంతో వరుణ్ షాక్ అవుతాడు. చెప్పాపెట్టకుండా ట్రిప్ ఏంటి అని చందు అంటే లోహిత సిగ్నల్ లేనట్లు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. రోజు రోజుకి దీనికి బుద్ధి లేకుండా పోయింది అని చందు అంటాడు. మా ఇంట్లో మన పెళ్లి గురించి తెలీదు తెలిస్తే చంపేస్తారని లోహిత అంటుంది. 

మధు ఉదయం ఇంటి బయట ముగ్గు పెడుతుంది. మ్యాడీ వెళ్లి చూస్తా బాగుందని అంటాడు. మ్యాడీ కోసం మధు వేప పుల్ల బ్రష్ చేయడానికి ఇస్తుంది. భలే ఉంది అనుకుంటూ మ్యాడీ వేపపుల్లతో పళ్లు తోముకుంటాడు. మరోవైపు వరుణ్ లోహితను నిద్ర లేపుతుంటాడు. లోహిత లేవదు.. నేను లేవను అని అంటుంది. మధు వాళ్ల దగ్గరకు స్వరూప వచ్చి మ్యాడీ బాబు మీ కోసం వేడి వేడి ఇడ్లీ రెడీ అంటుంది. ఇక సుబ్బు వచ్చి మ్యాడీ బాబు వేడి వేడి నీరు రెడీ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.