Chinni Serial Today Episode లోహిత చందుతో మనిద్దరం అన్నాచెల్లెళ్లం అని కాలేజ్‌లో ఎవరికీ తెలీకూడదు. నేను నిన్ను అన్నయ్య అని పిలవడం మా ఫ్రెండ్స్ చూస్తే బాగోదు అని చెప్తుంది. దాంతో చందు ఐడీ అప్లికేషన్ ఇస్తూ లోహితను మేడం అని పిలుస్తాడు. అందుకు చాలా ఫీలవుతాడు. తర్వాత చిన్ని ఫొటో చూస్తూ చివరి సారి చిన్నిని హగ్ చేసుకోవడం గుర్తు చేసుకొని చాలా బాధ పడతాడు. 

చందు తనలో తాను ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావ్ లోహిత చిన్ని మాత్రం ఎప్పటికీ నీలా మారదు అని అనుకుంటూ ఫొటో చూసుకుంటాడు. అప్పుడే చిన్ని లైబ్రరీలో ఉన్న చందు దగ్గరకు ఐడీ కార్డుల అప్లికేషన్ కోసం తన ఫ్రెండ్‌తో కలిసి వస్తుంది. పెద్దయ్యాక చిన్ని, చందు మొదటి సారి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. కానీ ఇద్దరికీ వాళ్లే చిన్నప్పటి చందు, చిన్నిలను తెలీదు. చిన్ని అలియాస్ మధుమిత అప్లికేషన్‌స్ తీసుకొని థ్యాంక్యూ మాస్టారూ అంటుంది. తర్వాత వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి మాస్టారూ ఇక్కడ పులిహోర ఉందా అంటే అవును అని చందు అంటాడు. తన ఫ్రెండ్ చందుతో మా మధు పులిహోర అంటే పడి చస్తుందని  అంటుంది. 

చందు నవ్వుతూ అయితే కొంచెం టేస్ట్‌ చేస్తారా అంటే మధు ఇవ్వమని అడుగుతుంది. కొంచెం టెస్ట్ చేసి మొత్తం అడుగుతుంది. చందు సంతోషంగా మొత్తం మధుమితకి ఇచ్చేస్తాడు. మధు సంతోషంగా తినేస్తుంది. చందు నవ్వుకుంటాడు. మధు మళ్లీ థ్యాంక్స్ మాస్టారూ అని ఈ సారి మా అమ్మ పులిహోర చేసినప్పుడు మీకు తెచ్చి ఇస్తాను అంటుంది. మధు తన ఫ్రెండ్ వెళ్లిపోతారు. ఇక చందు చిన్ని ఫొటో చూసుకుంటాడు. మరోవైపు చందు అటుగా వచ్చి మధుని చూసి తన ఫ్రెండ్స్‌తో ఇదేంట్రా ఎక్కడికి వెళ్లినా ఈ వెజిటేబుల్స్ ఎదురు వస్తుంది అని అంటాడు. 

మహి తాను సీనియర్‌ అంటూ మధుకి సెల్యూట్ చేయమని అంటాడు. మధు తన చేతిలో పులిహోర మహి చేతిలో పెట్టి సెల్యూట్ కొడుతుంది. మహి పులిహోర చూసి ఇదేంటి తీసుకో అని అంటే మధు ఉంచుకోండి పర్లేదు అని సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఈ పులిహోర బేబీ ఎక్కడ ఉందిరా బాబు అనుకుంటాడు. దీన్ని ఇప్పుడేం చేయాలి అని మహి అంటే తన ఫ్రెండ్ ఎవరూ చూడకుండా క్లోజ్ చేయాలి అని తినమని అంటాడు. మహి కూడా చందు దగ్గరకు వెళ్తాడు. అప్లికేషన్ అడుగుతాడు. ఇక చందుకి ఖాళీ బాక్స్ చూసి అడిగి అందులో పులిహోర పెడతాడు. నా పులిహోర నా దగ్గరకే వచ్చింది అని నవ్వుకుంటారు. మహికి పేపర్ కింద పడిపోవడంతో వంగితే తనకు దెబ్బతగలకుండా చందు చేయి అడ్డుపెడతాడు. మహి చందుని నవ్వు మట్టిలో మాణ్యిక్యం బ్రో అంటాడు. ఇక చందు పేరు అడుగుతాడు. దానికి చందు చంద్ర శేఖర్ అని చెప్తాడు. 

దేవేంద్ర వర్మ, నాగవల్లి మాట్లాడుకుంటారు. బాలరాజుని చంపడానికి చెన్నై నుంచి మనుషుల్నిపిలిపిస్తున్నానని చెప్తాడు. వాళ్లతో ఫోన్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా బాలరాజుని చంపేయమని అంటారు. బాలరాజు పని అయిపోయినట్లే కదా అని నాగవల్లి అంటుంది. దానికి దేవా ఇక మన టార్గెట్ చిన్ని మాత్రమే. ఆ చిన్నిని మన మహి మర్చిపోయేలా చేయడమే అంటాడు. మధు, పద్దు మాట్లాడుకుంటూ వెళ్తారు. లోహిత ఎదురు వస్తుంది. మధుకి ఓ డోస్ ఇస్తా అనుకుంటూ వృత్తలేఖిని పుస్తకం మధ్యలో పెట్టుకొని మధుని పొడవడానికి వెళ్తుంది. మధు తప్పించుకోవడంతో లోహిత పడిపోబోతే మధు పట్టుకుంటుంది. కారు నడిపేటప్పుడు కళ్లు కాలేజ్‌కి వచ్చేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అంటుంది. నీడిల్ చూసి చిన్న గొడవకి పొడిచేయాలని అనుకుంటున్నావా అని కింద పడేస్తుంది. ఫుల్ వార్నింగ్ ఇస్తుంది. ఈ సారి బాగా ప్లాన్ చేసి దాని సంగతి చెప్తా అని లోహిత అనుకుంటుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!