Chinni Serial Today Episode దేవేంద్ర, నాగవల్లిలు మహి గురించి మాట్లాడుకుంటారు. చిన్ని చాపర్ట్‌ క్లోజ్ చేయాలని అనుకుంటారు. శ్రేయ కాలేజ్‌కి వెళ్తూ దేవా, వల్లిలకు చెప్పి వెళ్తుంది.  మహి కూడా నీతో వస్తాడు కదా ఒక్కదానివే ఎందుకు వెళ్తున్నావ్ అని దేవా అడిగితే బావ నాతో రావడం ఏంటి అసలు బావ ఏ అమ్మాయితోనూ కలిసి వెళ్లడు.. మూడు అడుగుల దూరం పాటిస్తాడు అని చెప్తుంది. 

దేవా వల్లితో ఈ త్రీ ఫీట్ డిస్టెన్స్ ఏంటి అని అడిగితే అది ఆ చిన్ని కోసమే అయింటుంది.. చిన్ని చిన్ని అని కలవరిస్తున్నాడు కదా అందుకే అలా చేస్తుంటాడు అని అంటుంది. ఇంతలో మహి కిందకి వస్తాడు. కాలేజ్‌కి వెళ్తూ బ్యాగ్ లేదేంటి అని వల్లి అడిగితే నేను కాలేజ్‌కి వెళ్లడం లేదు చిన్నిని వెతకడానికి వెళ్తున్నా.. చిన్ని ఈ ఊరిలోనే ఉందని తెలిశాక వెతక్కుండా ఎలా ఉంటాను.. ఒక్క రోజు వెతక్కపోయినా నేను ఉండలేను.. అని చెప్తాడు. దేవా, వల్లి షాక్ అయిపోతారు. చిన్ని కనిపిస్తే ఏం చేస్తావ్ అని దేవా అడుగుతాడు. 

మహి తండ్రితో ఇంకేం చేస్తా డాడీ.. చిన్ని కనిపించగానే వెళ్లి హగ్ చేసుకుంటా.. నువ్వే నా లైఫ్ ఇంకెప్పుడూ నా లైఫ్ నుంచి దూరం కావొద్దని చెప్తాను. వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేసి మీ కోడలిగా మీకు పరిచయం చేస్తాను అని చెప్తాడు. దాంతో దేవా మ్యాడీ అని గట్టిగా అరుస్తాడు. వల్లి దేవాని కూల్ చేస్తుంది. ఎక్కడుందో తెలియని అమ్మాయి కోసం ఇలా పిచ్చిగా ఆలోచించడం ఏంటి నాన్నా అని దేవా అడిగితే ఇది పిచ్చి కాదు నాన్న పిచ్చి ప్రేమ. చిన్ని నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు డాడీ. ఎప్పటికీ మారని ఓ ఎమోషన్. నా గుండె కొట్టుకునేంత కాలం చిన్ని అనే పేరు తలచుకుంటూనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. 

శ్రేయ తల్లి వసంత మొత్తం విని అన్నావదినలతో మహి ఇలా చిన్ని చిన్ని అంటే నా కూతురి పరిస్థితి ఏంటి అది వాడి మీద ప్రేమ పెంచుకుంది కదా.. చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ మొగుడు పెళ్లాలని మనం కూడా అనుకున్నాం కదా.. వాడు మరో పెళ్లి చేసుకుంటే నా కూతురి పరిస్థితి ఏంటి అని వసంత అడుగుతుంది. ప్రమీల సర్దిచెప్తుంది. మహి నా కూతురిని పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను అంటుంది. వసంతకి దేవా, వల్లి ఇద్దరూ శ్రేయనే తమ కోడలు అని మాటిస్తారు. 

మధుమిత కాలేజ్‌కి వస్తుంది. మహి కోసం చూస్తుంది. మహి ఫ్రెండ్‌ కనిపించగానే అడుగుతుంది. ఇంకా రాలేదని చెప్పగానే డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక మధు బ్యాగ్ కింద పడిపోయి అందులో నుంచి బాలరాజు ఫొటో బయటకు వస్తుంది. తండ్రి ఫొటో పట్టుకొని మధు కన్నీరు పెట్టుకుంటుంది. చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్ ఎగిరిపోతుంది. డ్రాయింగ్ ఎగిరి శ్రేయ వస్తుంటే దారిలో పడిపోతుంది. శ్రేయ చూడకుండా తొక్కేయబోతే మధు శ్రేయ చెప్పు పట్టుకొని ఆపుతుంది. శ్రేయ కంగారు పడి ఏమైంది నా కాళ్లు పట్టుకున్నావ్ చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నావా అని అడుగుతుంది. దాంతో చిన్ని పేపర్ నీ కాళ్ల కింద పడిపోబోతే ఆపానని చెప్పానని అంటుంది. అనవసరంగా నా కాళ్లు పట్టినందుకు సారీ చెప్పు అని శ్రేయ అంటుంది. దాంతో మధు ప్రతి చిన్న దానికి గొడవ వద్దు శ్రేయ మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం చదువుకుందాం గొడవలు వద్దు అని వెళ్లిపోతుంది. 

చిన్ని తండ్రి ఫొటో చూస్తూ ఎక్కడున్నావ్ నాన్న అనుకుంటుంది. ఇంతలో ఆఫ్ టికెట్‌లా నడుచుకుంటూ వెళ్తున్న  వ్యక్తిని చూసి ఆఫ్ టికెట్ అని పిలిచి పరుగులు తీస్తుంది. తీరా చూసే సరికి తను ఆఫ్ టికెట్ కాదు. దాంతో మధు డిసప్పాయింట్ అయిపోతుంది. ఆఫ్ టికెట్‌ని కలవాలి అని తన క్లాస్‌మేట్‌కి బ్యాగ్ ఇచ్చేసి తను బయటకు వెళ్తుంది. మరోవైపు మహితో తన ఫ్రెండ్ మన చిన్ననాటి క్లాస్ టీచర్ శ్రావణి టీచర్ అడ్రస్ దొరికిందని చెప్తాడు. మహి చాలా సంతోషపడతాడు. ఆవిడను కలిస్తే చిన్ని గురించి తెలుస్తుందని రాహుల్‌ని తీసుకొని వెళ్తాడు. దేవుడా చిన్ని వివరాలు నాకు తెలిసేలా చేయ్ స్వామి అని మొక్కుకుంటుంది. 

శ్రావణి టీచర్‌ని చూసి మహి తను మహేంద్ర వర్మ అని చెప్తాడు. టీచర్ గుర్తు పట్టి ఎంత పెద్దవాడివి అయిపోయావ్ మహి అని పలకరిస్తుంది. రాహుల్, మహిని తీసుకెళ్లి మాట్లాడుతుంది. చిన్ని గురించి అడిగితే చిన్ని వాళ్లు, చందు వాళ్ల గురించి తెలీదని టచ్‌లో లేరని చెప్తుంది. మహి కన్నీరు పెట్టుకుంటాడు. ఇక వెళ్తూ వెళ్తూ కావేరి ఉష టీచర్‌గా ఉన్నప్పుడు టీచర్స్ అందరూ తీసుకున్న ఫొటో చూసి ఉష టీచర్ చిన్ని వాళ్ల ఇంట్లోనే ఉండేవాళ్ల కదా ఆమెకు తెలుస్తుంది. ఉష టీచర్ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతాడు. ఉష టీచర్ చనిపోయారు అని శ్రావణి చెప్పగానే మహి షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.