Chinni Serial Today Episode నాగవల్లి బాలరాజు గురించి ఎంక్వైరీ చేయమని పోలీసులకు చెప్తుంది. చిన్ని గురించి కూడా చెప్పాల్సింది అని దేవా అంటే వద్దులే బావ చిన్ని గురించి మన మనషులకు నీకు నాకు మాత్రమే తెలియాలి.. వాళ్లు చూసుకుంటారులే.. పైగా చిన్నిని మనం వెతుకుతున్నామని మ్యాడీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది.. చిన్ని సంగతి నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించకు అని చెప్తుంది. ఇంతలో నాగవల్లి ఫోన్‌కి ఓ మహి, మధులు బైక్ మీద వచ్చిన ఫొటో వస్తుంది.
మహి, మధులను ఒకే బండి మీద చూసి ఇద్దరూ షాక్ అయిపోతారు. శ్రేయ అత్తకి కాల్ చేసి అత్తా ఫొటో చూశావా.. అది బావ బైక్ ఎక్కడం ఏంటి అత్త నాకు దాని పీక పిసికి చంపేయాలని అనిపిస్తుందని అంటుంది. నాగవల్లి శ్రేయతో నువ్వు దానితో గొడవ పడితే మీ బావ దృష్టిలో బ్యాడ్ అయిపోతావ్.. నేను చూసుకుంటాలే అని అంటుంది. నాగవల్లి పీఏ వల్లితో దాన్ని చంపేద్దామా మేడం అని అంటే వద్దు అది మ్యాడీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తుంది. దాని సంగతి తర్వాత మనం ముందు చిన్ని సంగతి చూద్దాం అని దేవా అంటాడు.
మధు మహిని పిలిచి నీ వాచ్ మా ఇంట్లో మర్చిపోయావ్ తీసుకొచ్చా అని చెప్తుంది. ఆ వాచ్‌కి మహి చిన్నప్పుడు మధుకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ కూడా అతుకుపోతుంది. మహి ఒక్క సారి చిన్ని ఉనికి తెలిసినట్లు ఆగిపోతాడు. ఇక మహి వాచ్ చూసే టైంకి వాచ్ కిందపడిపోతుంది మధు అది తీద్దామని వెళ్తే మహి మళ్లీ చూసే టైం మహిని ఫ్రెండ్ పిలవడంతో అటు తిరిగిపోతాడు. మధు తీసి బ్యాగ్‌లో పెట్టుకొని మహి వాచ్ మహికి ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి తలను ఒకరు గుద్దు కుంటారు. మధు మరోసారి మహి తలను గుద్దుతుంది. ఇక ఇద్దరూ కలిసి రావడం చూసిన లోహిత మనసులో ఓసేయ్ చిన్ని నువ్వేంటే ఎప్పుడూ మ్యాడీ అంటి తిరుగుతున్నావ్.. నేను ఆ ఇంటికి కోడలు అవ్వాలి అనుకుంటున్నా నువ్వు కూడా తయారవుతావా ఏంటి శని లాగా అని అనుకుంటుంది.
సీనియర్లు జూనియర్లని పిలిచి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నామని స్లిప్‌లలో పేర్లు రాశాం అందులో ఏం ఉంటే అందరూ ఆ యాక్టివిటీ కచ్చితంగా చేయాలని అంటారు. అందులో లోహితకు వెస్ట్రన్ డ్యాన్స్ చేయాలని వస్తుంది. మహి, మ్యాడీలకు కపుల్ డ్యాన్స్ వస్తుంది. మాకు రాదు అని ఇద్దరూ అంటే ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తుందని సీనియర్స్ చెప్తారు. ఇక టైం టేబుల్ ప్రకారం ప్రాక్టీస్ చేయమని అంటారు. మధు, మ్యాడీ ఇద్దరూ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు. మధు మహిని చూస్తూ ఉండిపోతుంది. మహి చూసి చేయి ఊపుతాడు. అయినా మధు కదలకుండా అలా మహినే చూస్తూ ఉంటుంది. దాంతో మహి హలో ఏంటి అలా ఉండిపోయావ్ అంటే మధు తేరుకొని ముసి నవ్వులు నవ్వుకుంటుంది.
లోహిత శ్రేయ దగ్గరకు వెళ్లి కొంప మునిగింది అని మ్యాడీ, మధులు కపుల్ డ్యాన్స్ చేస్తున్నారని చెప్తుంది. శ్రేయ షాక్ అయిపోతుంది. ఆ మధు ఏదో ప్లాన్ చేసి మీ బావని ట్రాప్ చేస్తుందని అంటుంది. శ్రేయ కోపంగా ఎక్కడ ఆ మధు అని మధుని చూసి ఆపుతుంది. ఎంత ధైర్యమే నీకు పొద్దున్న మా బావ బైక్ మీద వచ్చావ్ చాలా కోపం వచ్చింది కానీ పోనీలే అని వదిలేశా ఇప్పుడు మా బావతో కలిసి డ్యాన్స్ చేయడానికి సెట్ చేశావా అంటుంది. లోహిత మధుతో కావాలనే నువ్వు మీ ఇద్దరి పేర్లు వచ్చినట్లు ప్లాన్స్ చేశావని అంటుంది. నువ్వు వీళ్ల బావతో డ్యాన్స్ చేయడానికి వీల్లేదని లోహిత అంటే నువ్వు ఎవరు అది చెప్పడానికి అని మధు అంటుంది. మధు వెళ్లిపోతుంటే లోహిత చేయి పట్టుకొని మెలేస్తుంది. ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావ్ నేను శ్రేయలా మెతక కాదు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అని అంటుంది. మధు లోహిని వదలమని అడుగుతుంది. మ్యాడీతో డ్యాన్స్ చేయకు అని చెప్తుంది లోహిత చేస్తా అని మధు అంటుంది. చేయి కాలో విరగ్గొట్టు అని శ్రేయ అంటుంది. డ్యాన్స్ చేస్తే అదే చేస్తా అని లోహిత అంటే నా చేయి కాలు విరగ్గొడతావా అని మధు లోహిత చేయి మెలేస్తుంది. నొప్పి అని లోహిత అరుస్తుంది. మీరు మాస్ అయితే నేను ఊరమాస్ అని వార్నింగ్ ఇస్తుంది.
బాలరాజు మెకానిక్ షెడ్‌కి పోలీసులు వస్తారు. ఓనర్‌తో పాటు అందర్ని కొట్టి బాలరాజు గురించి అడుగుతారు. అందర్నీ కొడతారు. బాలరాజు ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని ఆయన చెప్తాడు. పోలీసులు వెళ్లిపోతే బాలరాజు ఓనర్ దగ్గరకు వెళ్లి అన్నా నాకోసం నువ్వు దెబ్బలు తిన్నావు అంటే నువ్వు నా వర్కర్ కాదు నా దోస్త్‌వి నీ భార్యబిడ్డలు నీకు కనిపించే వరకు వాళ్లు నన్ను ఎంత హింసించినా చెప్పను అంటాడు. బాలరాజు అతన్ని వాటేసుకొని ప్రతీ మనిషికి నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు అని అంటాడు. బాలరాజు వెళ్లిపోయాడు అని పోలీసులు దేవాకి చెప్తే 24 గంటల్లో బాలరాజు నా కళ్ల ముందు ఉండాలి అని దేవా అరుస్తాడు.
మధు, మ్యాడీలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. శ్రేయ చూసి చిరాకు పడి వెళ్లిపోతుంది. లోహిత చూసి మా నాన్నని చంపేసిన నిన్ను వదలనే చిన్ని ఈ రోజు లాస్ట్ ప్రాక్టీస్ మ్యాడీ రాత్రి 7కి వెళ్లిపోతాడు. మధు ఒక్కర్తే ఉంటుంది కదా అప్పుడు చెప్తా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.