Chinni Serial Today Episode బాలరాజు చిన్ని కావేరి కోసం తెలుసుకోవడానికి చిన్ని ఫొటో పట్టుకొని వెతుకుతున్న రౌడీల దగ్గరకు వెళ్తాడు. ముఖానికి టవల్ చుట్టుకొని రౌడీలను చితక్కొట్టి చిన్ని కోసం ఎందుకు వెతుకుతున్నారని అడుగుతాడు.
రౌడీలు బాలరాజుతో కావేరి, చిన్ని ఇద్దరూ పదేళ్ల క్రితం చనిపోయారని అనుకున్నాం కానీ కావేరి చినిపోయింది చిన్ని బతికే ఉంది అని తెలిసింది అని అంటారు. కావేరి చనిపోయిందా అని బాలరాజు షాక్ అయిపోతాడు. ఇదంతా ఎవరు చేశారని అడిగితే దేవేంద్ర వర్మ, ఆయన భార్య నాగవల్లి చిన్నిని వెతికి చంపేయమని చెప్తారని అంటారు. బాలరాజు వాళ్లతో ఆ దేవేంద్ర వర్మకి ఆయన భార్యకి చెప్పండి చిన్ని కోసం చిన్ని తండ్రి బాలరాజు బతికే ఉన్నాడని.. చిన్నికి రక్షణ కవచంలా ఉన్నాడని చెప్పండి.. చిన్ని కోసం వెతికించినా.. చిన్ని జోలికి వచ్చినా.. ఆ దేవేంద్రని వాడి పెళ్లాన్ని చంపేస్తానని చెప్పండి అని వార్నింగ్ ఇస్తాడు.
బాలరాజు కింద కూలబడి వెళ్లిపోయావా కావేరి నన్ను చిన్నీని వదిలేసి వెళ్లిపోయావా అని ఏడుస్తాడు. ఇంతకాలం మీ ఇద్దరూ ఎక్కడో ఒక చోట ఉంటారని అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు లేవని తెలిసింది.. చిన్ని ఎక్కడుందో తెలుసుకుంటా కావేరి.. ఆ దుర్మార్గుడిని నుంచి కాపాడి చిన్నిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని అనుకుంటాడు. మరోవైపు నాగవల్లి వాయినాలు ఇస్తుంటుంది. తర్వాత శ్రేయకి నక్లెస్ వేసి పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటుంది. నాగవల్లి మహిని పిలిచి పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటాడు. మధుని కూడా మహి పిలుస్తాడు. మధు వెళ్తుంది. పంతులు ఇద్దరినీ శ్రీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. నాగవల్లి, శ్రేయ ఇద్దరూ షాక్ అయిపోతారు.
రౌడీలు దేవాకి కాల్ చేసి విషయం చెప్తారు. ఆ బాలరాజు బతికే ఉన్నాడని దేవా అరుస్తాడు. చిన్ని చనిపోయింది అని చెప్పినట్లే బాలరాజు కూడా బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడని ఈ వెదవలు చెప్పారు.. వాడు ఎక్కడున్నా వెతికి తీసుకురండీ నేనే వాడిని చంపాలని దేవా అరుస్తాడు. మధు వెళ్లిపోతుంటే మహి వెళ్లి సారీ చెప్తాడు. మధు మహితో నువ్వు నాకు సారీ చెప్పడం కాదు మ్యాడీ.. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.. ఆటైంలో నువ్వు నేను దొంగ కాదు అని నిరూపించకపోయి ఉంటే జీవితాంతం ఆ నింద నేను భరించాల్సి వచ్చేంది. థ్యాంక్యూ మ్యాడీ అని కన్నీటితో చెప్తుంది. జరిగింది జరిగిపోయింది దాని కోసం ఎక్కువ ఆలోచించకు అని చెప్తుంది. ఇంతలో మహికి దేవా కాల్ చేస్తాడు. నేను వెళ్తాను అని మధు చెప్తుంది.
మధు గొడవ దగ్గర ఫోన్ మర్చిపోతుంది. పంతులు చూసి లోహితకు ఇచ్చి మధుకి ఇవ్వమని అంటారు. లోహిత చిరాకుగా తీసుకెళ్తుంది. లోహిత ఫోన్‌లో అనుకోకుండా చిన్ని వాల్ పేపర్ ఫొటో చూస్తుంది. అది చూసి బిత్తరపోతుంది. మధునే చిన్ని అని అనుకుంటుంది. మధు చూసి లోహి ఏంటి నా ఫోన్ అలా చూస్తుంది అని అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది. నా ఫోన్ ఇవ్వు లోహి అని మధు అడిగితే లోహిత షాక్‌లో ఉండి మధు నువ్వు.. నువ్వు అని అంటుంది. ఇంతలో శ్రేయ వచ్చి ఏమైంది లోహి ఇదేమైనా ఎక్కువ చేస్తుందా చెప్పు డోస్ ఇద్దాం అని అంటే మధు వాళ్లని ఆపి మీరు చేసిన ప్లాన్ రివర్స్ అయినా మీకు బుద్ధి రాలేదా.. మీరు పని మనిషితో ఇదంతా చేయించడం నాకు తెలుసు. మీ ఇంట్లో మీ పరువు తీయడం ఇష్టం లేక నోరు కదపలేదు అని చెప్పి తన జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.
లోహిత మధుని చూసి ఇది చిన్నినా అప్పటిలాగే ఉంది అనుకుంటూ తెగ కంగారు పడుతుంది. లోహిత తలనొప్పిగా ఉందని చెప్పి బయల్దేరుతుంది. ఏమైంది లోహికి సెడన్‌గా అని శ్రేయ అనుకుంటుంది. మరోవైపు మహి తాంబూలం తీసుకొచ్చి తన గదిలో చిన్ని ఫొటోల దగ్గర పెట్టుకుంటాడు. కన్నీరు పెట్టుకుంటూ మా మమ్మీ నాకు 90 రోజుల గడువు ఇచ్చింది.. కొన్ని రోజులు అయిపోయాయి. గడువు లోపు మనం కచ్చితంగా కలిసి తీరాలి చిన్ని అని కన్నీరు పెట్టుకుంటాడు. వచ్చే ఏడాది ఇదే రోజున నువ్వు ఈ ఇంట్లో కోడలిగా వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి అంటాడు.
మరోవైపు బాలరాజు బతికే ఉన్నాడని దేవా విధ్వంసం సృష్టిస్తాడు. మనం అనుకున్నవి ఏవీ జరగడం లేదు అని కోపంతో ఊగిపోతాడు. మహి ఆ సౌండ్స్ వింటాడు. వీలైనంత త్వరగా బాలరాజు చిన్నిని చంపేయాలని దేవా వల్లితో చెప్తాడు. ఇంతలో మహి అక్కడికి వస్తాడు. దేవా కోపంగా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు. పొలిటికల్ ఇరిటేషన్‌లో ఉన్నారు నాన్న మీ డాడీ అని మహికి వల్లి చెప్తుంది. ఏం కాలేదు నేను మామూలుగా ఉన్నానని దేవా అంటాడు. ఇక మహి వెళ్లిపోయిన తర్వాత దేవా వల్లితో బాలరాజు అజ్ఞాతంలో ఆట మొదలు పెట్టాడు. వాడికి వాడి కూతురికి ఈ మినిస్టర్ దేవేంద్ర వర్మ పవర్ ఏంటో చూపిస్తా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.