Chinni Serial Today Episode మధుమిత ఇళ్లంతా శుద్ధి చేయడానికి నీరు చల్లుతుంది. మహి గదిలోకి వెళ్తుంది. ఇంతలో మహి వెళ్లి మధు ప్లీజ్ మధు నా గదిలోకి నా ఫ్యామిలీనే రానివ్వను ఏం అనుకోవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి మధుని ఆపేస్తాడు. మధుని బయట ఉండమని గంగాజలం మహినే తన గది మొత్తం చల్లుకుంటాడు. తర్వాత ఇద్దరూ వ్రతం దగ్గరకు చేరుకుంటారు.

వ్రతం పూర్తయిపోతుంది. పంతులు ఎవరికైనా మంచి పాట పాడమని చెప్తారు. ఇంత మంది ఆడవాళ్లు ఉండి కూడా ఎవరికీ రాదా అని అడిగి మధుకి పాడమని అంటాడు. మహి కూడా పాడమని అంటాడు. అత్తయ్య పర్మిషన్ ఇవ్వాలేమో అని వరుణ్ అంటే మా మమ్మీ వద్దు అనదు పాడు మధు అని మహి అంటాడు. అవునమ్మా పాడు అని నాగవల్లి కోపంగా చెప్తుంది. నత్యానంద కరే అని చిన్ని పాడుతుంది. అందరూ క్లాప్స్ కొడతారు. ఇక నాగవల్లి నా కోడలికి గిఫ్ట్ ఇస్తానని అన్నాను కదా తీసుకురా అని వసంతకి చెప్తుంది. ఏం తెలీనట్లు ఏం గిఫ్ట్ అత్తా అది అని శ్రేయ అడుగుతుంది.

వసంత వెళ్లి నగల బాక్స్ తీసి చూస్తుంది అందులో నగ ఉండదు. వసంత షాక్ అయి మొత్తం వెతుకుతుంది. కంగారుగా వెళ్లి వదిన అందులో నగ కనిపించడం లేదని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. శ్రేయ, లోహిత నవ్వుకోవడం మధు చూస్తుంది. పాతికి లక్షలు పెట్టి నా కోడలి కోసం కొన్న నగ ఎలా మిస్ అవుతుంది అని నాగవల్లి అంటుంది. ఎవరో దొంగతనం చేసుకుంటారు అని అంటుంది. ఇక శ్రేయ మధుతో నువ్వు గంగాజలం వేయడానికి అన్ని గదులకు వెళ్లావు కదా నువ్వు ఏమైనా తీశావా.. అదే చూశావా అని అడుగుతుంది. నేనేం చూడలేదు అని మధు కంగారుగా అంటుంది.

అందరి బ్యాగ్‌లు చెక్ చేయాలి అనుకుంటారు. నాగవల్లి అందరితో తప్పుగా అనుకోవద్దు అని చెప్పి అందరి పర్మిషన్ తీసుకొని వెతికిస్తుంది. లోహితతో పాటు అందరి బ్యాగ్‌లు చెక్ చేస్తారు. ఇక మధు బ్యాగ్ చూసి అది చెక్ చేద్దామని లోహిత అంటుంది. శ్రేయ నటిస్తూ వద్దులే మన ఫ్రెండ్ కదా వద్దులే అంటుంది. పర్లేదు అని మధు బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తుంది. లోహిత బ్యాగ్‌లో వస్తువులన్నీ కింద వేస్తుంది. దాంతో నెక్లెస్ కింద పడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. మధు కూడా షాక్ అవుతుంది.

నాగవల్లి మధుతో పిలవని పేరంటానికి వచ్చింది ఇలా దొంగతనం చేయడానికే అన్నమాట అని అంటుంది. నాకేం తెలీదు అండీ అని మధు ఏడుస్తుంది. శ్రేయ వెంటనే నాకు అర్థమైంది ఇళ్లంతా చూసినట్లు ఉంటుందని అని నా దగ్గర గంగాజలం తీసుకున్నది ఇలా నగ కొట్టేయడానికే అన్నమాట అంటుంది. శ్రేయ మాట మార్చేయడం చూసి మధు షాక్ అయిపోతుంది. మధు అలాంటిది కాదు అని పంతులు చెప్తారు. దొరికని వరకు అందరూ దొరలే దొరికితేనే దొంగలు అని లోహిత అంటే దానికి మహి లోహి అనవసరంగా నోరు జారకు మధు ఎలాంటిదో నాకు తెలుసు అని అంటాడు. లోహిత సైలెంట్ అయిపోతుంది. కచ్చితంగా మధు ఇలా చేయదు ఎవరో చేసి తనని ఇరికించుంటారు అని మహి అంటాడు.

నాగవల్లి మాత్రం మధుని తిడుతుంది. తను నీ ఫ్రెండ్ కాబట్టి వెనకేసుకొస్తున్నావ్ నువ్వేం మాట్లాడొద్దు అని మహికి చెప్తుంది. కళ్ల ముందు ఇంత సాక్ష్యం కనిపిస్తే తను నిర్దోషి అనడానికి నేను పిచ్చిదాన్ని కాదు అని ఇలాంటి వాళ్లకి నా ఇంట్లో స్థానం లేదు అని నాగవల్లి మధు మెడ పట్టుకొని లాక్కెళ్తుంటే మధు ఆపి నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను.. మాకు మీ లా ఆస్తిపాస్తుల లేకపోవచ్చు మేం పేదవాళ్లమే కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయమని ఏడుస్తూ చెప్తుంది. పంతులు కూడా చెప్తాడు. అయినా నాగవల్లి మధుని ఈడ్చుకెళ్లి బయట తోసేస్తుంది. మధు వాళ్లకి ఫొటోలు తీసిన బాబు అక్కడే వీడియో చూస్తూ ఉంటాడు. వరుణ్‌ని పిలిచి పోలీసులకు పిలిచి మధుని అప్పగించమని చెప్తుంది నాగవల్లి.

మహి పక్కనే ఉన్న బాబు దగ్గర ఫోన్ చూసి తీసుకొని అందులో వీడియో చూసి షాక్ అయి వరుణ్‌ పోలీసులకు ఫోన్ చేయకుండా ఆపుతాడు. ఈ దొంగతనం చేసింది మధు కాదు మమ్మీ అని సాక్ష్యాలు చూపిస్తానని వీడియో చూపిస్తాడు. అందులో పని మనిషి నగ తీసి మధు బ్యాగ్‌లో పెట్టడం ఉంటుంది. శ్రేయ, లోహిత చాలా భయపడతారు. నాగవల్లి కోపంగా పనిమనిషిని పిలుస్తుంది. లాగిపెట్టి కొడుతుంది. రమ్య శ్రేయ వాళ్ల వైపు చూస్తే నిజం చెప్తే చంపేస్తా అని లోహిత బెదిరిస్తుంది. నాగవల్లి వరుణ్‌తో ఆమెకి జీతం ఇచ్చి సెటిల్ చేసేయమని అంటుంది. మధు తల్లితో ఆ మ్యాటర్ సరిగ్గా సెటిల్ చేసి మరి మధుకి చేసిన అవమానం ఎలా సెటిల్ చేస్తావు అని మధుకి తన వాళ్ల తరుఫున క్షమాపణ చెప్తాడు. నమ్మకం కంటే కళ్ల ముందు సాక్ష్యానికే విలువ ఇచ్చారు. నా ఇంట్లో నా ముందే నీకు అవమానం జరిగినందుకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నా అంటుంది. మరీ అంత క్షమాపణ చెప్పాల్సిన పని లేదు నెక్లెస్ తన బ్యాగ్‌లో ఉండే సరికి అనుమానించానని నాగవల్లి అంటుంది. దానికి మహి అదే నగ నా జేబులో ఉంటే నన్ను అనుమానిస్తావా మమ్మీ అని అడుగుతాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. అవమానించే ముందు ఆలోచించాలి కదా ఒక ఆడపిల్లకి ఇలా అవమానం చేయకూడదు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా అని మహి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.