Chinni Serial Today Episode మహి ఇంటికి వచ్చి సందడి చూసి ఏంటి అని వరుణ్‌ని అడుగుతాడు. పార్టీ ఉందని అత్తయ్య చెప్పారు కదా అని లోపలికి తీసుకెళ్తాడు. నాగవల్లి మహితో త్వరగా వెళ్లి రెడీ అయిరా పార్టీ మొదలు పెడదాం అని అనుకుంటుంది.
వరుణ్ మహిని తీసుకెళ్లి ఏంటి ఈ పార్టీ అని అడుగుతాడు. వరుణ్ తడబడి నాకు తెలీదు అనేస్తాడు. వసంత నాగవల్లి దగ్గరకు వెళ్లి మనం చేస్తుంది కరెక్టేనా అని అడుగుతుంది. కరెక్ట్ నీ కూతురు నా కోడలు అది ఫిక్స్ అని అంటుంది. మహి రెడీ అవుతుంటే నాగవల్లి వెళ్తుంది. పార్టీ ఏంటి మమ్మీ అని మహి అడగగానే ఏం లేదు నాన్న చిన్న గెట్ టు గెదర్ అని అనేస్తుంది. వరుణ్ మనసులో ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో మహి మనసు నిండా చిన్నినే ఉంది ఇప్పుడు శ్రేయతో పెళ్లి అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటుంది.
చిన్ని తన నెమలి పింఛం ఇచ్చినందుకు తనలో తాను చిన్నప్పుడు మహి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈ మ్యాడీకి ఇచ్చేశాను అనుకుంటుంది. ఇంతలో చంటి వచ్చి నేను చిన్నప్పుడు నుంచి అడిగితే ఇవ్వని ఆ పింఛం ఇప్పుడు ఆ అమెరికా అబ్బాయి అడిగితే ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు. ఏమోరా ఇచ్చేశాను అయినా ఎందుకు ఇచ్చాను అని మధు ఆలోచిస్తుంది. పద్దూ అక్క చెప్పినట్లు సంథింగ్ సంథింగ్ ఉందేమో అక్క అని చంటి అనగానే ఏంట్రా నువ్వు కూడా మొదలు పెట్టావా అని మధు చెవి మెలేస్తుంది. ఇక చంటి మధుకి వాచ్ ఇచ్చి అమెరికా అబ్బాయి మర్చిపోయాడని మధుకి ఇస్తాడు. నేను మ్యాడీని ఫ్రెండ్‌నే అనుకున్నా పద్దూ, చంటి ఇలా అంటున్నారేంటి అనుకుంటుంది. వాచ్ చూస్తూ ఎవరు ఎలా అనుకుంటే ఏంటి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది.
మహి రెడీ అయి వెళ్తాడు. మహిని దేవా దగ్గరకు తీసుకొని మా ఏకైక వారసుడు మహేంద్ర వర్మ అని చెప్తాడు. మినిస్టర్లు ఇతర పొలిటికల్ లీడర్స్ అందరూ మహికి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తారు. మహి అనుమానంగా చూస్తాడు. అందరూ నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి మమ్మీ అని అడుగుతాడు. ఇంతలో శ్రేయని వసంత తీసుకొస్తుంది. శ్రేయని చూసిస్తుంది నాగవల్లి. మహికి ఏం అర్థం కాదు. శ్రేయని తీసుకొచ్చి మహి పక్కనే నిల్చోపెడతారు. ఇద్దరి చేతికి రింగులు ఇస్తారు. ఏంటి ఇది అని మహి అడుగుతాడు. దాంతో నాగవల్లి నిశ్చితార్థం కాదు నాన్న జస్ట్ ఫార్మల్‌గా ఉంగరాలు మార్చుకుంటారు అంతే అంటుంది. మహి షాక్ అయిపోతాడు.
దేవా మహితో ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా ఉంటుంది ఇప్పటికి ఉంగరాలు మార్చుకోండి అని అంటాడు. దానికి మహి ఉంగరాలు మార్చుకోవడం ఏంటి అని అడుగుతాడు. చిన్నప్పటి నుంచి శ్రేయని నీ భార్య అని అనుకున్నాం అని కదా అందుకే ఇలా అనౌన్స్ చేస్తున్నాం అని అంటారు. శ్రేయ మహితో బావ నేను పుట్టగానే నీ భార్య అన్నారు. ఇప్పుడు నీ భార్య అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మహి కోపం మొత్తం అణుచుకొని అందరితో ఇది ఇక్కడితో ఈ ఫంక్షన్ ఆపేస్తున్నాం. ఇది మాఫ్యామిలీ మేటర్ మీ ముందు మాట్లాడుకోలేం. ఎవరూ మా మమల్ని మా పేరెంట్స్‌ని తప్పుగా అనుకోకుండా పార్టీని వదిలేసి వెళ్లిపోండి అంటాడు. అందరూ వెళ్లిపోతారు.
వల్లి మహితో ఇలా పార్టీ ఆపేయడం తప్పు కదా నాన్న అంటే నాకు తెలీకుండా పార్టీ ఏర్పాటు చేయడం కూడా తప్పే కదా అంటాడు. ఏంట్రా తప్పు చిన్నప్పటి నుంచి నీకు ఏం కావాలో మాకు తెలుసు కదా అదే ఇస్తున్నాం కాదా ఏదీ నీకు అడిగి ఇవ్వడం లేదు కదా అని అంటాడు. దానికి మహి తప్పే డాడీ చిన్నప్పటి నుంచి నాకు చిన్ని అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. చిన్ని నా ప్రాణం అని నేను చిన్నిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని తనే నా సర్వస్వం అని తన కోసం వెతుకుతున్నాను అని తెలిసి కూడా ఇలా పెళ్లి ప్లాన్ చేయడం తప్పే కదా అని మహి అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. శ్రేయ ఏడుస్తుంది. ఆ చిన్ని ఎక్కడుందో తెలీదు.. దానికి పెళ్లి అయిందో లేదో కూడా తెలీదు అది లైఫ్‌లో కనిపించకపోతే ఇలాగే పెళ్లి లేకుండా ఉండిపోతావా అని వల్లి కోప్పడుతుంది. ఇలాగే ఉంటాను మమ్మీ జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాను కావాలి అంటే చనిపోతా కానీ ఇలా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటాడు.
దేవా మహి కాలర్ పట్టుకుంటాడు. నీకు మా కంటే అదే ఇష్టమా అంటే అవును నాకు అందరి కంటే చిన్నినే ఎక్కువ అంటాడు. నాగవల్లి మహిని లాగి పెట్టి కొట్టి ఫ్యామిలీ కంటే అది ఎక్కువ ఏంట్రా ఎవరూ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు. నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చా కాబట్టే నా జీవితం వదిలేసి మీ కోసం బతుకుతున్నా మనం ఇలా సంతోషంగా ఉన్నాం నువ్వు కూడా అలాగే ఉండాలి. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నావ్ కదా ఇక చాలు.. దాన్ని ప్రేమించింది చాలు.. అని వల్లి కోప్పడుతుంది. ప్లీజ్ మమ్మీ అలా మాట్లాడొద్దు నీకు ఇంకొక్క అవకాశం ఇవ్వు మమ్మీ అని మహి బతిమాలుతాడు. దాంతో వల్లి సరే ఇస్తున్నా నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా 3 నెలలు నీకు టైం ఇస్తున్నా.. ఈ లోపు ఆ చిన్ని నీకు కనిపిస్తే ఒకే లేదంటే 91 రోజు నువ్వు శ్రేయ మెడలో తాళి కట్టాలి.. ఇది హెచ్చరిక కాదు శాసనం అని వల్లి అంటుంది. మహి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. శ్రేయ ఏడుస్తూ వెళ్లిపోతుంది. వల్లి దేవాతో ఈ గడువు వాడికి కాదు మనకి ఈ 90 రోజుల్లో ఆ చిన్ని ఎక్కడుందో తెలుసుకొని దాని శవం గోదారిలో పడేలా చేయాలి అంటుంది. మరోవైపు బాలరాజు అమ్మవారి దగ్గరకు గాజులు తీసుకొని వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.