Chinni Serial Today Episode కీర్తిని డిబార్ కాకుండా చేసినందుకు అందరూ మధుని ప్రశంసిస్తారు. కీర్తి మధుని హగ్ చేసుకొని నీ రుణం తీర్చుకోలేను థ్యాంక్యూ మధు అని చెప్తుంది. ఇంకెప్పుడూ ఇలాంటి సూసైడ్ ప్రయత్నాలు చేయకు అని అంటుంది. 

మహి కీర్తితో నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోకుండా తర్వాత పరీక్షకు ప్రిపేర్ అయిపో ఆల్‌ ది బెస్ట్‌ అని అంటాడు. కీర్తి థ్యాంక్స్ చెప్తుంది. మధు కలగజేసుకొని ఏంటి సార్ 3 ఫీట్ గుర్తొచ్చిందా.. నో ప్రాబ్లమ్ సార్ 3 ఫీట్ దూరంలో ఉంటూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వొచ్చు. అయినా ఇదేదో ఫస్ట్‌ టైం షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు అనుకుంటున్నావా నాకు ఇచ్చావ్ కదా అది తూచ్ అనుకోవాలా పర్లేదులే ఇవ్వు అని అంటుంది. దాంతో మహి కీర్తికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. 

మహి మధుతో నువ్వు ఇంత సాఫ్ట్‌గా ఉన్నావు కదా మొదట్లో అంత హార్డ్‌గా ఉన్నావేంటి నీలో హార్డ్ వేర్ సాఫ్ట్ వేర్ రెండూ ఉన్నాయన్న మాట అంటాడు. ముందు నేను సాఫ్టే బాబు తర్వాత హార్డుగా అయ్యాను అంటుంది. అందరూ వెళ్లిపోతారు. మహి మధుతో మొత్తానికి ఓ ప్రాణం కాపాడి హీరో అయిపోయావ్ కంగ్రాట్స్ అంటాడు. దానికి మధు టైంకి మంచి ఐడియా ఇచ్చి నవ్వు కూడా చాలా హెల్ప్ చేశావ్ ఇందులో సగం క్రెడిట్ నీది. కానీ నన్ను కాపాడటంలో 100 శాతం క్రెడిట్ నీదే అని అంటుంది. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. బాలరాజు ఓ మెకానిక్ షాప్‌కి వెళ్లి పని ఇవ్వమని అంటాడు. సేటు వచ్చే వరకు వెయిట్ చెయ్యమని ఓ కుర్రాడు చెప్తాడు. బాలరాజు అక్కడే కూర్చొంటాడు. ఇంతలో మధు స్కూటీ పాడవడంతో పద్దూతో కలిసి మెకానిక్  షాప్‌కి వస్తుంది. ఇక సేటు వచ్చి బాలరాజుకి స్కూటీ రిపేర్ చేయమని అంటాడు. మధు కాల్ మాట్లాడటానికి పక్కకి వెళ్లిపోతుంది. పద్దూ అక్కడే ఉంటే బాలరాజు స్కూటీ రిపేర్ చేస్తాడు. పద్దూ మధుని అడిగి వంద తీసుకొని వచ్చి బాలరాజుకి ఇస్తుంది. వంద పట్టుకొని బాలరాజు చాలా సంతోషపడతాడు. మధు అక్కడే ఉన్న తండ్రిని చూడదు.. బాలరాజు ఆ వందని తీసుకొని సేటుకి ఇస్తే సేటు వద్దని త్వరగా పని చేశావ్ నువ్వు నాకు నచ్చావ్ నెలకి 15 వేలు ఇస్తా.. అంటాడు. ఇళ్లు ఎక్కడా అని సేటు అడిగితే లేదని బాలరాజు చెప్తాడు. దాంతో ఇక్కడే మా కుర్రాలతో ఉండిపో అని సేటు చెప్తాడు. బాలరాజు చాలా హ్యాపీగా ఫీలవుతాడు. వంద పట్టుకొని అమ్మా బతుకు మీద ఆశ చూపించావ్ నా కూతురు, భార్య కోసమే బతుకుతున్నా అని అనుకుంటాడు. 

నాగవల్లి శ్రేయని పిలుస్తుంది. శ్రేయ పేపర్ లీక్ గురించి ఏమో అని తెగ టెన్షన్ పడుతుంది. నాగవల్లి శ్రేయతో రేపు మొత్తం ఫ్రీగా ఉండు.. మన ఫ్యామిలీ ఫంక్షన్‌ జరగబోతుంది అందులో నీకు మ్యాడీకి పెళ్లి జరగబోతుందని అనౌన్స్‌ చేస్తా అని అంటుంది. శ్రేయ చాలా ఎగ్జైట్ అవుతూ లవ్ యూ అత్తయ్యా అని అంటుంది. నాగవల్లి శ్రేయతో ఈ విషయం మీ బావకి తెలీదు అస్సలు చెప్పకు సర్ప్రైజ్ అంటుంది. మహి, వరుణ్‌లు చూసి అక్కడికి వస్తారు. ఏంటి చక్కగా నవ్వుకుంటున్నారు అని అంటుంది. నాకు తెలీదు అని అంటుంది. తెలీకుండా నవ్వుతావా అని అత్తయ్య ఎవరైనా మెంటల్ హాస్పిటల్లో చూపించండి అంటాడు. ఇక నాగవల్లి మహికి కూడా రేపు పార్టీ ఉందని చెప్తుంది. వరుణ్‌ని మొత్తం చూసుకోమని అంటుంది. వసంత వల్లితో మహికి తన పెళ్లి విషయం చెప్పకుండా నలుగురిలో చెప్పడం కరెక్టేనా అంటుంది. అలా చెప్తేనే కరెక్ట్ లేదంటే శ్రేయ నా ఇంటి కోడలు కాదు ఏ దిక్కుమాలినదో అవుతుంది అని అంటుంది. 

మధుమిత స్వచ్ఛమైన తెలుగమ్మాయిలా అందంతా నడుం మీద బిందె పెట్టుకొని ఆరు బయట పెద్ద పాత్రల్లో నీరు నింపుతుంది. సుబ్బు వాళ్లు ఇళ్లంతా నీటిగా తుడిచేస్తారు. ఇంతలో మహి, విక్రమ్ అక్కడికి వస్తారు. పద్దూ, మధు, చంటిలు వెల్‌కమ్ చెప్తారు. మధు చెంబుతో నీరు ఇస్తుంది. మహి తీసుకొని కాళ్లు కడుక్కొని లోపలికి వస్తాడు. మహి వాళ్లకి మధు వాళ్లు మర్యాదలు చేస్తారు. ఇళ్లు చాలా నీట్‌గా ఉంది మధు అని మహి అంటే ఎప్పుడూ ఇలా ఉండదు మీరు వచ్చారని నీటిగా చేశారని చంటి అంటాడు. అందరూ షాకింగ్‌గా చూస్తే జోక్ అని అంటాడు. మరోవైపు శ్రేయని రెడీ చేస్తారు. ప్రమీల శ్రేయని ఆటపట్టిస్తుంది.  ఇంతలో వల్లి వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తుంది. శ్రేయ చాలా ఎగ్జైట్ అవుతుంది. నాగవల్లినే దగ్గరుండి శ్రేయకి అలంకరిస్తుంది. ఎలా ఉన్నాను అత్తయ్యా అని శ్రేయ అడిగితే దేవేంద్ర వర్మ గారి కోడలిగా ఉన్నావ్ అంటుంది. వరుణ్ అదంతా చూస్తాడు. వసంత వరుణ్ దగ్గరకు వెళ్తుంది. బాధగా ఉన్న వరుణ్‌ని చూసి ఏమైందని అడుగుతుంది. మహి బావకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఏర్పాటు చేస్తున్నారు మీరు ఇలా చేస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్‌గా ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.