Chinni Serial Today Episode విజయ్ ఉషని పోలీస్‌ స్టేషన్‌కి పిలుస్తాడు. ఉష, చిన్ని, సత్యంబాబు పోలీస్ స్టేషన్‌కి వస్తారు. గౌతమ్ విజయ్‌తో పది నిమిషాల్లో డీఎన్‌ఏ రిపోర్ట్స్ తీసుకొని వస్తాడని చెప్తాడు. సత్యం బాబుని చూసి మీరు వచ్చారా చెల్లిని ఒంటరిగా వదలడం ఇష్టం లేదా అని అంటాడు. చెల్లి కాదు చెల్లి లాంటిది అని సత్యంబాబు అంటాడు. రాజు చాటుగా జైలులో జరిగేది చూస్తూ ఉంటాడు. రిపోర్ట్స్‌ తీసుకొని ఓ వ్యక్తి వస్తారు. 

తను కావేరినే కానీ రిపోర్ట్స్‌లో అలా లేదు..

రిపోర్ట్స్‌ చూసిన విజయ్ అలా ఉండిపోవడంతో గౌతమ్ ఏమైందని అడుగుతాడు. విజయ్ కావేరిని చూస్తూ తను కావేరినే అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. తను కావేరినే కానీ కావేరి కాదు అని ఉందని చెప్తాడు. ఉష, రాజు ఊపిరి పీల్చుకుంటారు. చిన్నీ చాలా సంతోషపడుతుంది. ఈ రిపోర్ట్స్‌ కరెక్ట్‌ కాదని నాకు అనుమానంగా ఉందని విజయ్ డాక్టర్‌తో మాట్లాడుతాడు.  

రిపోర్ట్స్‌ కరెక్టే సార్..

విజయ్‌ డాక్టర్‌తో మాట్లాడి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అని అడుగుతాడు. బ్లడ్ టెస్ట్ సరిగా జరిగింది కదా అంటే లేదు సార్ 12 ఏళ్లుగా నేను పని చేస్తున్నా ఎప్పుడూ తప్పు జరగలేదు అంటాడు. దాంతో విజయ్ మీ డీఎన్‌ఏ మ్యాచ్ అవ్వలేదు అని అంటాడు. ఉష విజయ్ దగ్గరకు వెళ్లి మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా నేను కావేరి కాదు అని అంటుంది. మేం ఇక బయల్దేరొచ్చా ఏసీపీ సార్ అని అంటుంది. సరే అని ఇక విజయ్ కావేరితో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. అందరూ బయటకు వెళ్తారు. 

నేను అస్సలు నమ్మను మేడం..

కావేరితో విజయ్ పర్సనల్‌గా మాట్లాడుతాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ మీరు కావేరి కాదు అని చెప్పినా నేను నమ్మను. మీ గురించి నేను చాలా పూర్తిగా తెలుసుకున్నా. మీరు ఏ పరిస్థితుల్లో జైలుకి వెళ్లారో నాకు తెలుసు. గర్భవతిగా జైలుకి వెళ్లిన మీరు బిడ్డ కోసం ఎంత తపించారో నాకు తెలుసు. మిమల్ని ఓ అదృశ్య శక్తి ఇప్పటి వరకు కాపాడుతుంది. ఫైనల్‌గా మీకు ఓ విషయం చెప్తున్నా మేడం. మీరు అనవసరంగా కేసులో ఇరుక్కొని ఉంటే మీరు నిర్దోశి అని నిరూపించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా పేరు మార్చుకొని చట్టాన్ని మోసం చేయకూడదు. నిప్పుతో చెలగాటం చట్టంతో ఆటలు వద్దు మేడం. ఏమంటారు అని విజయ్ అంటాడు.

నాతో గేమ్స్ వద్దురా బచ్చా..

విజయ్ మాటలకు ఉష స్పోర్ట్స్ కోటాలో వచ్చా నాతో గేమ్స్ వద్దురా బచ్చా.. ఇలా అనాలి అనుకున్నా కానీ పోలీస్‌కి అలా అనకూడదు అని ఆగిపోయా. మీరే నాతో గేమ్స్ అడుతున్నారు సో మీరే గేమ్స్ ఆపితే బెటర్. చిన్నీ వాళ్లు రావడం చూసిన విజయ్ ఉష గారు చెప్పింది గుర్తిందిగా ఇక జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఇక విజయ్ తను వచ్చిన పని అయిపోయిందని వెళ్లిపోతానని చెప్పి తన మెడలో గొలుసు చిన్నికి వేస్తాడు. చిన్నీ బాగా చదువుకొని మీ మామయ్యకి మీ టీచరమ్మకి మంచి పేరు తీసుకురా అని చెప్తాడు. మళ్లీ ఎప్పుడు కలుస్తాం విజ్జూ అని చిన్ని అడిగితే టైం వస్తుంది కలుస్తాం అంటాడు. ఉష, చిన్ని, సత్యం సంతోషంగా వెళ్లిపోతారు. విజయ్  వాళ్లని చూసిన చూపునకు ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. 

ఫ్లాష్ బ్యాక్‌లో కథ నడిపిన రాజు..

రాజు డీఎన్‌ఏ టెస్ట్‌లు చేసే డాక్టర్‌ దగ్గరున్న ఆసిస్టెంట్‌లో కలిసి మందు తాగుతాడు. తర్వాత అతని దగ్గరకు వెళ్లి మాటల్లో పెట్టి మందు తాగిస్తాడు. ఆటోలో ఆయన మందు తాగుతుంటే రాజు ల్యాబ్‌కి వెళ్లి బ్లడ్ సాంపిల్స్ మార్చేస్తాడు. ఆ విషయం గుర్తు చేసుకొని తెగ సంతోష పడతాడు. చిన్ని విజయ్ మాటలు గుర్తు చేసుకొని మళ్లీ విజ్జు వస్తాను అన్నాడంటే ఈ కేసు వదల్లేదా. అమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడా అని ఆలోచిస్తుంది. అమ్మ నిర్దోశి అని నిరూపించుకుంటే ఈ బాధే ఉండదు కదా అని అనుకుంటుంది. అమ్మ వెళ్లింది రాజు వల్లే కాబట్టి రాజుతో మాట్లాడితే అన్ని విషయాలు తెలుస్తాయని చిన్ని బయల్దేరుతుంది. 

రాజు ఇంట్లో కూర్చొని ఇప్పటికైతే ఓ గండం గడిచింది కానీ ఏసీపీ వదిలి పెట్టడు ఏం చేయాలి అనుకుంటాడు. ఇంతలో భారతి రాజు దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటుంది. కావేరికి ఏమైనా ప్రాబ్లమా అని రాజు అంటే నేను నీతో మాట్లాడాలి అని వచ్చారా. ఎన్ని రోజులు ఇలా అజ్ఞాతంలో ఉండిపోతావురా. కావేరిని జైలులో కాపాడింది.. ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నది నువ్వే కదా ఆ విషయం చెప్పవా అని అడుగుతుంది. ఎంతకాలం ఇలా కావేరి దృష్టిలో చెడ్డవాడిలా ఉండిపోతావురా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: అనంత్ పక్కనే గాయత్రీ.. ఊర్వశి దొరికిపోతుందా.. కంకణం కట్టించుకునేదెవరు?